New dishes
-
వియ్ హబ్ బ్రాండ్ అంబాసిడర్ వంట గెలిచింది
ఆమె... వంటతో జీవితాన్ని నిలబెట్టుకుంటానని, వంటలతో అవార్డులు అందుకుంటానని, వియ్ హబ్ (విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్)కి బ్రాండ్ అంబాసిడర్ అవుతానని కలలో కూడా కలగనలేదు. పాలతో కూరలు వండే గుజరాత్ వాళ్లు ఆమె చేసిన పుదీనా పచ్చడిని లొట్టలేసుకుంటూ తిన్నారు. కొబ్బరి, అరటితో మసాలాలు లేని తేలిక ఆహారం తీసుకునే కేరళ వాసులు కూడా ఆమె చేతి రుచికి ఫిదా అయ్యారు. గోవా వాళ్లకు చేపలతో కొత్త వంటలను పరిచయం చేశారామె. ఈ విజయాలన్నీ ఆమెను రాష్ట్ర సెక్రటేరియట్ వైపు నడిపించాయి. తెలంగాణ సెక్రటేరియట్లో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆమె పేరు ఆకుల కృష్ణకుమారి. ఊరు మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మూడు చింతలపల్లి గ్రామం. నెలకు లక్షకు పైగా ఆర్జిస్తున్న కృష్ణకుమారి జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం.కృష్ణకుమారి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రంట్ ఆఫీసర్. తనకు వంటలు చేయడం, వంటల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఆ ఇష్టంతో తాను చేసిన కొత్త వంటకాలను కొలీగ్స్‌కి ఇచ్చేవారామె. ‘‘మా నాన్న టైలర్. ఓ రోజు సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) డీపీఎమ్ సురేఖ గారు మా షాప్‌కి వచ్చారు. నన్ను చూసి నేను చేస్తున్న పని తెలిసిన తర్వాత ఆమె నాకో డైరెక్షన్ ఇచ్చారు. ఆ ధైర్యంతోనే నా కుటీర పరిశ్రమ మొదలైంది. తొలి ఆర్డర్ యూఎస్‌కి, డాక్టర్ గీతాంజలి మేడమ్ పది వేల రూపాయల ఆర్డర్ ఇచ్చారు. అలా మొదలైన నా జర్నీ ఇప్పుడు నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయంతో విజయవంతంగా సాగుతోంది. మిల్లెట్స్‌తో ప్రయోగాలు నన్ను నిలబెట్టాయి.’’ అన్నారు కృష్ణకుమారి.మహిళాశక్తి క్యాంటీన్డ్వాక్రా స్వయంసహాయక బృందంలో చేరిన తర్వాత తన కార్యకలాపాలను వేగవంతం చేశారు కృష్ణకుమారి. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎన్ఐఆర్డీలో శిక్షణ తీసుకోవడంతోపాటు, తన ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో స్టాల్ పెట్టడంతో మొదలైన ఆమె జర్నీ సరస్ మేళా ఎగ్జిబిషన్లతో అండమాన్, కశ్మీర్ మినహా దేశమంతటికీ విస్తరించింది.ఆమె విజయపథం... ఎగ్జిబిషన్లో స్టాల్ కోసం అధికారులను అడగాల్సిన దశ నుంచి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో స్టాల్ పెట్టవలసిందింగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చే దశకు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత ఏడాది జూన్ నెల రెండవ తేదీన జరిగిన వేడుకల్లో ఆమె స్టాల్ పెట్టారు. ఆ స్టాల్‌లోని ఉత్పత్తులను ఆసాంతం పరిశీలించిన మంత్రులు, ముఖ్యమంత్రి ఆమె అక్కడికక్కడే లైవ్ కౌంటర్లో వండిన తెలంగాణ రుచులకు కూడా సంతృప్తి చెందారు.డ్వాక్రా మహిళల కోసం శాశ్వతంగా ఒక వేదికను ఏర్పాటు చేయవలసిందిగా కోరడంతో ‘సెక్రటేరియట్ క్యాంటీన్ మహిళలకే ఇద్దాం’ అని నోటిమాటగా వచ్చిన ఉత్తర్వుతో అదే నెల 21న ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ మొదలైంది. అందులో కృష్ణకుమారితో పాటు పదిమంది మహిళలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ ఉపాధిపొందుతున్నారు. జయహో మహిళాశక్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిచిన్న రైతులేనా ఉత్పత్తులకు స్వాద్ అనే బ్రాండ్‌నేమ్ రిజిస్టర్ చేశాను. పరిశ్రమ దమ్మాయిగూడలో ఉంది. ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు. నేను ఉదయం తొమ్మిదిన్నరకు సెక్రటేరియట్‌కు చేరుకుంటాను. తిరిగి ఇంటికి చేరేటప్పటికి రాత్రి పదవుతుంది. యూనిట్లో నిన్న తయారైన మెటీరియల్‌ను ఈ రోజున కౌంటర్లో పెడతాను. ఏ రోజుకారోజు అమ్ముడైపోతాయి. సెక్రటేరియట్ క్యాంటీన్‌తోపాటు యూనిట్లోనే అవుట్లెట్ కూడా ఉంది. రాపిడో ద్వారా సప్లయ్ చేస్తున్నాం. వినియోగదారులు మా దగ్గరకు రావడం కంటే మేమే వినియోగదారుల దగ్గరకు వెళ్లాలనే ఉద్దేశంతో మొబైల్ యూనిట్ ప్రారంభించనున్నాను.నా సక్సెస్‌కి కారణం తోటలే. పచ్చళ్లు, పొడులు ఏవి చేయాలన్నా కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకోను. నేరుగా తోటలకే వెళ్లి తెచ్చుకుంటాను. భారీ స్థాయిలో పండించే వాళ్లు స్వయంగా మార్కెట్‌కు తరలించగలుగుతారు. చిన్న రైతులు తమకు తాముగా మార్కెట్‌కి తీసుకెళ్లాలంటే ఆ ఖర్చులు భరించలేరు. నేను వారి దగ్గర తీసుకుంటాను. నేను ఇష్టంతో ఎంచుకున్న ప్రొఫెషన్. నాకు ఉపాధినివ్వడంతోపాటు గుర్తింపును కూడా తెచ్చింది. ఇందులోనే భవిష్యత్తును నిర్మించుకుంటాను. మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మహిళలకు తెలియడం లేదు. ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం కోసం పని చేస్తాను.– ఆకుల కృష్ణకుమారి, స్వాద్ ఫుడ్స్ -
కొత్త అల్లుడికి వందల రకాల నోరూరించే వంటకాలు
-
కీరదోస పాన్ కేక్
కావలసినవి: కీరదోసకాయలు – 3; కరాచీ రవ్వ – రెండున్నర కప్పులు; పచ్చిమిర్చి పేస్ట్ – 2 టీ స్పూన్లు; గడ్డ పెరుగు – పావు కప్పు; ఉప్పు – సరిపడా; నూనె – కొద్దిగా; కరివేపాకు పేస్ట్ – 1 టీ స్పూన్; కొత్తిమీర తురుము – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా కీరదోసకాయలను శుభ్రం చేసుకుని, గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జులో కరాచీ రవ్వ, గడ్డ పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తురుము, కరివేపాకు పేస్ట్, ఉప్పు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. తర్వాత పెద్ద ఆకారంలో పల్చగా గారెల్లా చేసుకుని పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. వీటిని వేడి వేడిగా తింటే భలే టేస్టీగా ఉంటాయి. -
పండగ రుచులు
కొత్త కొత్త వంటలు చేసుకునే పండుగ... కొత్త బట్టలు ధరించే పండుగ...ఇంతేనా... కొత్త అల్లుళ్లతో ఇళ్లన్నీ కళకళలాడే పండుగ... మరద ళ్లు సరదాగా బావలను ఆటపట్టించే పండుగ... ఇంటికి వచ్చిన అల్లుడికి ఆప్యాయంగా రకరకాల రుచులు వడ్డించి, ఆప్యాయతలు పంచండి... రెండోసారి మీ ఇంటికి అల్లుడుగా కాదు, కొడుకుగా వస్తాడు... గులాబి గుత్తులు కావలసినవి: మైదా పిండి - అర కేజీ, బియ్యప్పిండి - పావు కేజీ, కొబ్బరి పాలు - తగినన్ని, పంచదార - పావు కేజీ, ఉప్పు - చిటికెడు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ఒక పాత్రలో మైదాపిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి తగినన్ని నీళ్లు జత చేసి, పల్చటి వస్త్రంలో వడక డితే కొబ్బరిపాలు వస్తాయి కొబ్బరిపాలలో పంచదార వేసి కరిగేవరకు గరిటెతో కలపాలి మైదాపిండి మిశ్రమంలో కొబ్బరి పాలు కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా పిండిని చిక్కటి బజ్జీలపిండిలా కలపాలి బాణలిలో నూనె వేసి కాచాలి గులాబి పువ్వుల గుత్తిని నూనెలో ముంచి కాలిన తర్వాత, ఆ గుత్తిని పిండిలోకి సగం వరకు మాత్రమే మునిగేలా ముంచి, ఆ గుత్తిని నూనెలో ముంచాలి కాసేపటికి పువ్వు నూనెలో పడుతుంది అలా పిండి మొత్తం చేసుకోవాలి (ఇవి చేసేటప్పుడు ఇద్దరు ఉంటే, మాడిపోకుండా దోరగా వస్తాయి). గుమ్మడికాయ ముక్కల పులుసు కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు - కప్పు (తీపి గుమ్మడి), ఆనపకాయ ముక్కలు - రెండు (పెద్ద సైజువి), మునగకాడ ముక్కలు - 4, ఉల్లిపాయలు - 6, చిలగడ దుంప ముక్కలు - 4, టొమాటో - 4, పచ్చి మిర్చి - 6, ఎండు మిర్చి - 6, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ఇంగువ - కొద్దిగా, పసుపు - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - 2 టీ స్పూన్లు, కొత్తిమీర - చిన్న కట్ట, కరివేపాకు - 2 రెమ్మలు, చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు (చిక్కగా ఉండాలి), బియ్యప్పిండి - టేబుల్ స్పూను (చల్లనీళ్లలో వేసి చిక్కగా కలపాలి) తయారీ: ముందుగా కూరముక్కలకు తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి ఉడికించాలి చింతపండు రసం జత చేసి పులుసు మరిగించాలి బియ్యప్పిండి నీళ్లు జత చేయాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించి పులుసులో వేయాలి కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక పొంగు రానిచ్చి దింపేయాలి. చింతచిగురు పప్పు కావలసినవి: చింతచిగురు - కప్పు, కందిపప్పు - కప్పు, పచ్చి మిర్చి - 6, ఎండు మిర్చి - 6, ఉల్లి తరుగు - పావు కప్పు, సెనగ పప్పు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - 6 గింజలు, ఇంగువ- పావు టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - తగినంత, కారం - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 8, కరివేపాకు - 3 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారీ: ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. (సుమారు ఏడెనిమిది విజిల్స్ రావాలి) బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాలి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి చింత చిగురు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి సుమారు పది నిమిషాలు మగ్గించాలి ఉడకబెట్టిన కందిపప్పు, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి కొత్తిమీర వేసి దింపేయాలి. భీండీ 65 కావలసినవి: బెండకాయలు - పావు కిలో, కారం - అర టీ స్పూను, పసుపు - కొద్దిగా, ఆమ్ చూర్ పొడి - అర టీ స్పూను (నిమ్మ ఉప్పు కూడా వాడుకోవచ్చు), గరం మసాలా - అర టీ స్పూన్లు, సెనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయేవరకు నీడలో ఆరబెట్టాలి ముక్కలు పొడవుగా తరగాలి మసాలా దినుసులన్నీ ఒకదాని తరవాత ఒకటి బెండకాయ ముక్కల మీద చల్లి, జాగ్రత్తగా కిందికి పైకి కలపాలి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరోమారు కలపాలి చివరగా సెనగ పిండి, బియ్యప్పిండి చల్లి (నీరు జత చేయకూడదు) అన్నిపదార్థాలు కలిసేలా జాగ్రత్తగా కింది నుంచి పైకి కలిపి, సుమారు పావుగంట సేపు పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేడయ్యాక తయారుచేసి ఉంచుకున్న బెండకాయలను వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి టిష్యూ నాప్కిన్ మీదకు తీసుకోవాలి (అధికంగా ఉన్న నూనెను పీల్చేస్తుంది) చివరగా గరం మసాలా లేదా చాట్ మసాలా చ ల్లి వేడివేడి అన్నంతో వడ్డించాలి. కొబ్బరి -మామిడికాయ పచ్చడి కావలసినవి: కొబ్బరి తురుము - కప్పు, మామిడి తురుము - అర కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చి మిర్చి - 6, సెనగ పప్పు - టేబుల్ స్పూను, మినప్పప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, ఇంగువ - పావు టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు, నూనె - టేబుల్ స్పూను తయారీ: బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాలి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి చల్లార్చాలి మిక్సీలో ముందుగా పోపు వేసి మెత్తగా పొడి చేయాలి కొబ్బరి తురుము, మామిడికాయ తురుము, పచ్చి మిర్చి, ఇంగువ, పసుపు, ఉప్పు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి గిన్నెలోకి తీసుకుని కరివేపాకు జత చేసి బాగా కలపాలి కమ్మటి నెయ్యి, వేడివేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. కట్ పొంగల్ కావలసినవి: బియ్యం - కప్పు, పెసర పప్పు - కప్పు, మిరియాల పొడి - 2 టీ స్పూన్లు, ఉప్పు - కొద్దిగా, జీడిపప్పు - 25 గ్రా., నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక గిన్నెలో బియ్యం, పెసర పప్పు వేసి బాగా కడిగి, ఆరు కప్పుల నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఆరు విజిల్స్ వచ్చాక దింపాలి బాణలిలో నెయ్యి కరిగాక మిరియాల పొడి, జీడిపప్పు వేసి దోరగా వేయించి తీసేయాలి ఉడికించిన బియ్యం పెసరపప్పు మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, జీడిపప్పు, మిరియాల పొడి వేసి కలిపి, కొబ్బరి పచ్చడితో అందించాలి. -
మురిపాల మిఠాయిలు
ఎప్పటిలాగే ఆ రోజు కూడా శ్రీకృష్ణుడు ఇరుగుపొరుగు ఇళ్లలో నుంచి వెన్నపెరుగులు దొంగిలించి తిన్నాడు... అక్కడితో కడుపు నిండలేదు... అమ్మని మీగడ పాలు అడిగితే తిడుతుందని భయం వేసి... ‘అమ్మా! పాలు తాగితే జుట్టు పెరుగుతుందన్నావుగా, కడివెడు పాలు ఇవ్వవూ’ అని గోముగా అడిగాడు. అవి తాగినా కడుపు నిండలేదు... ‘అమ్మా! పాలుపెరుగులతో ఏవైనా కొత్త మిఠాయిలు చేసిపెట్టవూ’ అన్నాడు మురిపెంగా... చిన్నికృష్ణుని మాటలకు యశోద ముచ్చటపడింది. అంతే క్షణంలో కొత్త కొత్త వంటలు చేసింది... కన్నయ్యను ఒడిలో కూర్చోపెట్టుకుని ప్రేమగా తినిపించింది... పనీర్ ఖీర్ కావలసినవి: పాలు - ఒకటిన్నర కప్పులు; పనీర్ తురుము - అర కప్పు; కండెన్స్డ్ మిల్స్ - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; ఏలకుల పొడి - అర టేబుల్ స్పూను; డ్రైఫ్రూట్స్ తరుగు - 3 టేబుల్ స్పూన్లు (బాదం, జీడిపప్పు, పిస్తా) తయారి: పెద్ద పాత్రలో పాలు, పనీర్ తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, ఆపకుండా కలుపుతూ, పాలను మరిగించాలి కండెన్స్డ్ మిల్క్ జత చే సి ఐదారు నిమిషాలు ఉంచి దించేయాలి ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి తీసేయాలి పిస్తా తరుగు పైన చల్లి చల్లగా అందించాలి. చాకో స్వీట్ కావలసినవి: డార్క్ చాకొలేట్ తురుము - 75 గ్రా; పల్లీలు + బాదం పప్పులు - రెండు టేబుల్ స్పూన్లు; తురిమిన పనీర్ - 150 గ్రా (కాటేజ్ చీజ్); కాఫీ పొడి - అర టీ స్పూను; కోకో పొడి - టీ స్పూను; పంచదార పొడి - 75 గ్రా.; బాదం పప్పులు - 8; చాకో చిప్స్ - అలంకరిచండానికి తగినన్ని తయారీ: డార్క్ చాకొలేట్‌ను అవెన్‌లో ఒక నిమిషం ఉంచి కరిగించి బయటకు తీసి స్పూన్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చాకొలేట్ మౌల్డ్‌లో పల్చగా ఒక పొరలా పోయాలి బాణలిలో పల్లీలు, బాదంపప్పులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి ముక్కలుముక్కలుగా వచ్చేలా చేయాలి పనీర్‌ను పొడిపొడిలా చేసి రెండు నిమిషాలపాటు చేతితో మెత్తగా చేయాలి. పంచదార, కాఫీ పొడి, కోకో పొడి, పల్లీలు + బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాల్స్‌లా తయారుచేసి, చాకొలేట్ టార్ట్ మౌల్డ్స్‌లో ఉంచి, సుమారు అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి చాకో చిప్స్‌తో అలంకరించి చల్లగా అందచేయాలి. మావా కాజు శాండ్విచ్ కావలసినవి: మెత్తగా పొడి చేసిన కోవా - 150 గ్రా; పంచదార - 40 గ్రా; నెయ్యి - టీ స్పూను; ఖర్జూరాలు - 10 (పాలలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి); జీడిపప్పు పలుకులు - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - కొద్దిగా తయారి: ఒక పాత్రలో కోవా పొడి, పంచదార వేసి స్టౌ మీద ఉంచి ముద్దలా అయ్యేవరకు కలిపి, దించి చల్లారాక ఈ మిశ్రమాన్ని రెండు ఉండలుగా (ఒకటి పెద్దది, ఒకటి చిన్నది) చేసి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి కరిగాక, నానబెట్టి ఉంచుకున్న ఖర్జూరాలు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు కలపాలి ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి దించేయాలి ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీద కొద్దిగా నూనె పూయాలి ఐదు అంగుళాల వెడల్పు, ఒక అంగుళం లోతు ఉన్న డబ్బా మూత తీసుకుని, అందులో ప్లాస్టిక్ షీట్ ఉంచాలి తయారుచేసి ఉంచుకున్న కోవా పెద్ద బాల్ తీసుకుని మూత మధ్యలో ఉంచి, చేతితో జాగ్రత్తగా అంచులు కూడా మూసుకునేలా ఒత్తాలి ఇప్పుడు కోవా మిశ్రమం మీద ఖర్జూరం మిశ్రమం ఉంచి, ఆ పైన చిన్న బాల్ పెట్టి గట్టిగా ఒత్తి పైన సిల్వర్ ఫాయిల్ ఉంచి, ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచి తీసేయాలి ఎనిమిది సమాన భాగాలుగా కట్ చేసి అందించాలి. స్ట్రాబెర్రీ శ్రీఖండ్ కావలసినవి: నీరు పూర్తిగా తీసేసిన పెరుగు - కప్పు; మెత్తగా చేసిన స్ట్రాబెర్రీల గుజ్జు - అర కప్పు; క్రీమ్ - పావు కప్పు; పంచదార - 2 టీ స్పూన్లు; స్ట్రాబెర్రీలు - 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) తయారి: ఒక పాత్రలో ముందుగా పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి క్రీమ్, మెత్తగా చేసిన స్ట్రాబెర్రీల గుజ్జు జత చేసి మరోమారు కలిపి, మూడు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి స్ట్రాబెర్రీలతో అలంకరించి అందించాలి. (నాలుగు కప్పుల పెరుగును మూట గడితే ఒక కప్పు పెరుగు తయారవుతుంది) మలై పేడా కావలసినవి: చిక్కటి పాలు - రెండున్నర కప్పులు; పల్చటి పాలు - రెండున్నర కప్పులు; కుంకుమ పువ్వు - కొద్దిగా; నిమ్మ ఉప్పు - పావు టీ స్పూను; కార్న్ ఫ్లోర్ - 2 టీ స్పూన్లు (పల్చటి పాలలో వేసి కరిగించాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; పంచదార - 4 టీస్పూన్లు; పిస్తా పప్పులు - టీ స్పూను (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) తయారీ: నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలను పక్కన ఉంచి, మిగిలిన చిక్కటి పాలకు, పల్చటి పాలను జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. అంచులకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. చిన్న పాత్రలో నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి మూడు టేబుల్ స్పూన్ల నీళ్లలో నిమ్మ ఉప్పు వేసి కలిపి, మరుగుతున్న పాలలో చిలకరించాలి నీళ్లలో కరిగించిన కార్న్‌ఫ్లోర్, పంచదార వేసి బాగా కలిపి చూడటానికి కోవాలా అయ్యేవరకు ఉంచాలి కుంకుమ పువ్వు మిశ్రమం, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, చల్లారనివ్వాలి ఈ మిశ్రమాన్ని పేడాలుగా చేసుకోవాలి పిస్తా తరుగుతో అలంకరించి, సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి, తీసిన పావు గంటకు అందించాలి ఇవి రెండు మూడురోజులు తాజాగా ఉంటాయి. సేకరణ: డా ॥వైజయంతి