breaking news
Neeraj Chopra Classic 2025
-
స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. సరికొత్త చరిత్ర
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్‌లో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్లో స్వర్ణ పతకంతో మెరిశాడు. బెంగళూరు వేదికగా తన పేరిట జరుగుతున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్‌ను ఈ గోల్డెన్ బాయ్ సొంతం చేసుకున్నాడు.ఈ క్రమంలో తన పేరిట జరుగుతున్న అంతర్జాతీయ పోటీలో తానే పసిడి పతకం గెలిచిన తొలి అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అత్యుత్తమంగా ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి నీరజ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. బెంగళూరులోని శనివారం నాటి ఈవెంట్‌కు శ్రీ కంఠీవరవ స్టేడియం వేదికైంది.ఇక కెన్యాకు చెందిన జూలియస్ యెగో 84.51 దూరం బల్లాన్ని విసిరి నీరజ్ తర్వాతి స్థానంలో నిలిచి రజత పతకం అందుకున్నాడు. శ్రీలంకకు చెందిన అండర్-16 మాజీ ఫాస్ట్ బౌలర్ రమేశ్ పతిరగె 84.34 మీటర్ల దూరం ఈటెను విసిరి కాంస్య పతకం గెలుచుకోగా.. భారత్‌కే చెందిన సచిన్ యాదవ్ తృటిలో కాంస్యాన్ని కోల్పోయాడు. అతడు అత్యుత్తమంగా బల్లాన్ని 82.33 మీటర్ల దూరం విసిరాడు.హ్యాట్రిక్ కొట్టిన నీరజ్ చోప్రాకాగా టోక్యో ఒలింపిక్స్-2020లో పసిడి పతకం గెలిచిన నీరజ్ చోప్రా.. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు..27 ఏళ్ల ఈ హర్యానా అథ్లెట్ ఖాతాలో ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్.. అదే విధంగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో గెలిచిన పతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా.. తాజాగా నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు. ఈ ఈవెంట్లో నీరజ్ చోప్రా (భారత్)తో పాటు.. సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్), లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), థామస్ రోలెర్ (జర్మనీ), కర్టిన్స్ థామ్సన్ (అమెరికా), మార్టిన్న్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్), జూలియస్ యెగో (కెన్యా), రమేశ్ పతిరగే (శ్రీలంక), సచిన్ యాదవ్ (భారత్), రోహిత్ యాదవ్ (భారత్), సాహిల్ సిల్వాల్ (భారత్), యశ్ వీర్ సింగ్ (భారత్) బరిలో దిగారు.NEERAJ CHOPRA WINS NC CLASSIC 2025! 🏆- The Winning Throw of 86.18m for G.O.A.T 🐐pic.twitter.com/nPaJhHuJmk— The Khel India (@TheKhelIndia) July 5, 2025 -
Neeraj Chopra Classic 2025: మరో స్టార్ అవుట్
బెంగళూరు: భారత్‌లో జరగనున్న తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్... ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ నుంచి ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) వైదొలిగాడు. మడమ గాయం కారణంగా 27 ఏళ్ల పీటర్స్ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. ఇప్పటికే పలువురు జావెలిన్ త్రోయర్లు ఈ ఈవెంట్‌కు దూరం కాగా... ఇప్పుడు ఆ జాబితాలో పీటర్స్ కూడా చేరాడు. ఇక 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన పీటర్స్ స్థానాన్ని పోలాండ్‌కు చెందిన సిప్రియన్ మ్రిగ్లాడ్ భర్తీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.‘పీటర్స్ గాయం కారణంగా ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్‌కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని పోలాండ్‌కు చెందిన అథ్లెట్ సిప్రియన్ భర్తీ చేస్తాడు’ అని వెల్లడించారు. అండర్ 23 యూరోపియన్ మాజీ చాంపియన్ అయిన సిప్రియన్ అత్యుత్తమ ప్రదర్శన 84.97 మీటర్లు. శనివారం బెంగళూరు వేదికగా జరగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్‌కు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపునిచ్చింది.మొత్తం 12 మంది జావెలిన్ త్రోయర్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్ నుంచి ఐదుగురు అథ్లెట్లు పోటీలో ఉన్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లు టోర్నీకి దూరం కాగా... వారి స్థానాల్లో ఇతరులను ఎంపిక చేశారు. భారత త్రోయర్ కిషోర్ జెనా గాయం కారణంగా ఈ ఈవెంట్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో యశ్వీర్సింగ్ బరిలోకి దిగనున్నాడు. జెన్కీ డీన్ (జపాన్) స్థానాన్ని మార్టిన్ కొనెస్నీ (పోలాండ్)తో భర్తీ చేశారు.ఈ టోర్నీలో నీరజ్ చోప్రాతో పాటు అంతర్జాతీయ స్టార్లు జూలియస్ యెగో (కెన్యా), థామస్ రహ్లెర్ (జర్మనీ), సిప్రియన్ మ్రిగ్లాడ్, మార్టిన్ కొనెస్నీ, కర్టీస్ థాంప్సన్ (అమెరికా), లూయిస్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), రమేశ్ పతిరగె (శ్రీలంక) పాల్గొననున్నారు. భారత్ నుంచి నీరజ్‌తోపాటు సచిన్ యాదవ్, రోహిత్ యాదవ్, సాహిల్, యశ్వీర్ సింగ్ బరిలోకి దిగనున్నారు.