breaking news
NDCCB
-
రుణాలిచ్చేందుకు ప్రణాళికలు
డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు నెల్లూరు(అర్బన్): వచ్చే సంవత్సరం(2017–18)కి సంబంధించి పంటరుణాలను రైతులకు విరివిగా అందించేందుకు ప్రణాళికలను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి అధికారులను కోరారు. స్థానిక గాంధీబొమ్మ సమీపంలోని కేంద్రసహకార బ్యాంకులో జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీతో శుక్రవారం పంటరుణాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట రకాన్ని బట్టి ఎకరాకు ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించాలో అధికారులు అభిప్రాయాలు తెలపాలని సూచించారు. రబీలో 35 పంటలకు, ఖరీఫ్‌లో 33 రకాల పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇచ్చే విషయమై చర్చించారు. ఈ ఏడాది వర్షాలు సరిగా పడనందువల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల వారిని దృష్టిలో ఉంచుకుని రుణాలను సరళతరం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో డీసీసీబీ జీఎం సరిత, డీసీఓ రాజేశ్వరరావు, ఉద్యానవనశాఖ ఏడీ ఉమాదేవి, వ్యవసాయశాఖ ఏడీ మురళీ, మత్య్సశాఖ అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగులకు దీపావళి కానుక
రూ.3 కోట్ల పీఆర్సీ నిధులు విడుదల డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి నెల్లూరు రూరల్ : జిల్లా కేంద్ర సహకార ఉద్యోగులకు దీపావళి కానుకగా దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్న రూ.3 కోట్ల పీఆర్సీ నిధులను విడుదల చేసినట్లు డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి తెలిపారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్లోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ గురువారం పీఆర్సీ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 179 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. బ్యాంకు అభివృద్ధి కోసం ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆయన వెంట డీసీసీబీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్రెడ్డి, డైరెక్టర్ బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్, సీఈఓ రాజారెడ్డి, బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు ప్రసాద్, దయాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.