breaking news
nazib razak
-
తప్పుడు వార్తలు రాస్తే.. పదేళ్లు జైలు!
కౌలాలంపూర్ : తప్పుడు వార్తలపై చర్యలకు మలేషియా ప్రభుత్వం ఉపక్రమించింది. నకిలీ వార్తలు రాసేవారికి, ప్రచారం చేసేవారికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఈ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఇప్పటికే తనపై అవినీతి ఆరోపణలు చేస్తోన్నవారిని టార్గెట్ చేశారు. ఆగస్టులో జరిగే ఎన్నికల్లో గెలుపోందడానికే రజాక్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష ఎంపీ చార్లెస్ సాంటిగో మాట్లాడుతూ.. అసమ్మతిని అణచివేయడానికి ప్రభుత్వం అతిపెద్ద ఆయుధాన్ని వాడుతోందన్నారు.రాబోయే ఎన్నికల్లో నజీబ్ రజాక్ హయాంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని తీసుకురానుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం ప్రజా భద్రత కోసమే తాము ఈ చట్టాన్ని తీసుకు రానున్నామని చెబుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది ఏ మాత్రం ఆటంకం కాబోదని పేర్కొంది. ఈ చట్టాన్ని అనుసరించి తప్పుడు వార్తలు రాసేవారికి పదేళ్లు జైలు శిక్ష లేదా 5,00,000 రింగిట్లు(దాదాపు 84 లక్షల రూపాయలు) జరిమానా విధించనున్నారు. ఈ చట్టాన్ని బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఉల్లఘించినా, వారు మలేషియాలో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ నివేదిక ప్రకారం ‘రిపోర్టర్స్ విత్ అవుట్ బార్డర్స్’ జాబితాలో మలేషియా 144వ స్థానంలో ఉంది. -
రాజ్‌ఘాట్ వద్ద రజాక్ నివాళులు
న్యూఢిల్లీ: మలేసియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ఆయన అక్కడ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అంతకు మందు రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మలేసియా ప్రధానిని మోదీ సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రజాక్ సమావేశం కానున్నారు. Malaysian Prime Minister Najib Razak pays tribute at Rajghat in New Delhi pic.twitter.com/5uw893FwfW — ANI (@ANI_news) 1 April 2017