breaking news
Naval dakyard
-
శత్రువుని భయపెట్టబోయి భంగపడటం అంటే ఇదే..! ఇరాన్ అత్యుత్సాహం..
యుద్ధంలో అప్పుడప్పుడు రహస్య పథకాలు, పన్నాగాలతో శత్రువులను గందరగోళంలో పడేస్తుండటం మామూలే! అయితే, ఇరాన్ సైన్యం మాత్రం తన రహస్యాలను తానే బట్టబయలు చేసుకుని, ఇతర దేశాలను భయపెట్టే ప్రయత్నం చేసింది. సముద్ర మట్టానికి 500 మీటర్ల దిగువన నిర్మించుకున్న రహస్య నౌకాదళ స్థావరాన్ని ఇరాన్ ఇటీవల ప్రారంభించింది. అక్కడ ఉండే పెద్దపెద్ద భూగర్భ క్షిపణులతో పాటు, వారి వద్ద ఉన్న ఆయుధాలను కూడా బాహ్య ప్రపంచానికి చూపించింది ఇరాన్ సైన్యం. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక టీవీ చానల్స్‌లో ప్రసారం చేస్తూ, ‘మేము పెద్ద, చిన్న శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామ’ని ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో డొనాల్ట్ ట్రంప్‌ను ఒక ఇంటర్వ్యూలో ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లే అవకాశాల గురించి ప్రశ్నించగా.. ‘ఏదైనా జరగవచ్చు’ అని బదులిచ్చారు. అందుకే ఇరాన్ సైన్యం ట్రంప్‌ను ఇలా పరోక్షంగా హెచ్చరిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇరాన్ సైన్యం విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనిని గమనించిన ఇరాన్ ప్రభుత్వం ఆ వీడియోను తొలగించింది. (చదవండి: పెళ్లే అవ్వదనుకున్నారు..అలాంటిది ప్రెగ్నెంట్ అయ్యింది..ఏకంగా 36 సార్లు..!) -
నేవల్ డాక్‌యార్డ్ -ముంబైలో అప్రెంటీస్ ట్రైనీ పోస్టులు
వివిధ విభాగాల్లో అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం పురుషులు, మహిళల నుంచి నేవల్ డాక్‌యార్డ్ - ముంబై.. దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏడాది శిక్షణ ఉన్న ట్రేడ్స్.. ఖాళీలు.. అర్హత మెషినిస్ట్: 15 అర్హత: మెషినిస్ట్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 10 అర్హత: ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. ఫిట్టర్: 40 అర్హత: ఫిట్టర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 10 అర్హత: మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనె న్స్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్: 10 అర్హత: రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. ఎలక్ట్రోప్లేటర్: 10 అర్హత: ఎలక్ట్రోప్లేయర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రీషియన్): 15 అర్హత: వెల్టర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రీషియన్ టేడ్తో ఐటీఐ ఉత్తీర్ణత. పెయింటర్ (జనరల్): 10 అర్హత: పెయింటర్ (జనరల్) ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. మాసన్ (బీసీ): 15 అర్హత: మాసన్ (బీసీ) ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. టైలర్: 15 అర్హత: కటింగ్ అండ్ టైలరింగ్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. పాటర్న్ మేకర్: 10 అర్హత: పాటర్న్ మేకర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. రెండేళ్ల శిక్షణ ఉన్న ట్రేడ్లు.. అర్హత మెకానిక్ (డీ జిల్): 25 అర్హత: మెకానికల్ (డీజిల్) ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. ఫౌండ్రీ మెయిన్: 5 అర్హత: ఫౌండ్రీ మెయిన్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. మెకానిక్ రేడియో అండ్ రాడార్ (ఎయిర్‌క్రాఫ్ట్): 15 అర్హత: మెకానిక్ (రేడియో అండ్ టీవీ) లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. పవర్ ఎలక్ట్రీషియన్: 15 అర్హత: ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. షిప్‌రైట్ స్టీల్: 15 అర్హత: ఫిట్టర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. ప్లంబర్: 20 అర్హత: ప్లంబర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. పైప్ ఫిట్టర్: 15 అర్హత: ప్లంబర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. రిగ్గర్ (హెవీ ఇండస్ట్రీస్): 10 అర్హత: కార్పెంటర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. షీట్ మెటల్ వర్కర్: 10 అర్హత: షీట్ మెటల్ వర్కర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. క్రేన్ ఆపరేటర్ (ఓవర్‌హెడ్ ఎస్ఐ): 10 అర్హత: మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. ఠి షిప్రైట్వుడ్: 15 అర్హత: కార్పెంటర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దేశిత మార్కులు: అన్ని విభాగాలకు 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు 65 శాతం మార్కులతో సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. వయోపరిమితి: ఏప్రిల్ 1, 1996 - మార్చి 31, 2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. శారీరక ప్రమాణాలు: కనీసం 150 సెం.మీ ఎత్తు, 45 కిలోల బరువు ఉండాలి. ఎంపిక విధానం: ముందుగా పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా జాబితా రూపొందిస్తారు. వీరికి డిసెంబర్ చివరి వారంలో ముంబైలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారిని ఫిబ్రవరి, 2017లో జరిగే ఇంటర్వ్యూ/వైద్య పరీక్షలకు పిలుస్తారు. అప్రెంటీస్‌షిప్ శిక్షణ: ఏప్రిల్ 3, 2017 దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో పూర్తి చేసిన దరఖాస్తును ‘పీవో బాక్స్ నెంబర్ - 10035 జీపీవో, ముంబై - 400001’కు అక్టోబర్ 14లోపు సాధారణ పోస్టు చేయాలి. స్పీడ్ పోస్టులో పంపిన దరఖాస్తులను స్వీకరించరు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 14 వెబ్సైట్: http://www.davp.nic.in