breaking news
National College of Andhra Pradesh
-
అక్షర దాతల గుర్తులు.. శిథిల సమాధులు!
సాక్షి, మచిలీపట్నం: విద్యాదాతలను గౌరవించడం అందరి బాధ్యత. వారి స్మారకాలను భవిష్యత్ తరాల కోసం పదిలంగా ఉంచడం మన కర్తవ్యం. అయితే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ కళాశాల వ్యవస్థాపకుల సమాధులకు పట్టిన గతి చూస్తే విద్యాదానం చేసిన వారిని ఏవిధంగా గౌరవిస్తున్నామో అర్థమవుతుంది. స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయమిది. 1906లో కోల్‌కత్తాలో నేషనల్ కాంగ్రెస్ జాతీయ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో ఉద్యమంలో ప్రజలను చైతన్యపర్చాలంటే దేశవ్యాప్తంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. నేషనల్ కళాశాలల పేరిట వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశాల్లో తీర్మానించడమే తరువాయి స్వాతంత్య్ర సమరయోధులు కోపెల్ల హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మచిలీపట్నంలో నేషనల్ కళాశాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కృష్ణారావు తన 20 ఎకరాలను కళాశాల కోసం దానం చేయగా, దాంట్లో హనుమంతరావు, పట్టాభి సీతారామయ్య కలిసి 1907లో నేషనల్ కళాశాల నిర్మాణానికి పూనుకున్నారు. మూడేళ్ల పాటు శ్రమించి దాతల నుంచి విరాళాలు సేకరించి 1909 మార్చి 25న కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించారు. 1910 మార్చి 27న ఆంధ్ర జాతీయ కళాశాలగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండే వెంకట్రామయ్య పంతులుతో ప్రారంభింపజేశారు. 1910 నుంచి 1922 వరకు ఈ కళాశాలకు వ్యవస్థాపక ప్రిన్సిపాల్‌గా కోపెల్ల హనుమంతరావు వ్యవహరించారు. 1922లో ఆయన మరణించారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ కళాశాల ఇదే. ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు అనాడే విద్యను విస్తరించారు. నేషనల్ కళాశాల విద్యార్థి అంటే దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఒక గుర్తింపు, గౌరవం ఉండేది. అలాంటి కళాశాల నాటి వైభవాన్ని నేడు కోల్పోయిందనే చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థలుగా గుర్తింపు పొందాయి. ప్రైమరీ, హైసూ్కల్, ఇంటర్, డిగ్రీ, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేసిన ఈ ప్రతిష్టాత్మక కళాశాల నేడు ఐదారువందల మందికి మించి విద్యార్థుల్లేని పరిస్థితి. అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ విద్యాలయాల వ్యవస్థాపకులైన కోపెల్ల హనుమంతరావు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సమా«ధులు నేడు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. కళాశాల వెనుక భాగంలోనే హనుమంతరావుతో పాటు అతని కుటుంబ çసభ్యులందరి సమా«ధులున్నాయి. కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు బందరు వచ్చిన ప్రతిసారి ఈ సమా«ధులను దర్శించుకుని వెళ్తుంటారు. అలాంటి ఈ సమాధులు నేడు తుప్పల్లో శిథిలమై ఉన్నాయి. పైగా సమాధులు మందుబాబులకు నిలయంగా మారాయి. సమా«ధుల చుట్టూ ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు చెత్తాచెదారం చూడటానికే అత్యంత దయనీయంగా ఉంది అక్కడి పరిస్థితి. ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం ఈ సమా«ధుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని బందరు వాసులు కోరుతున్నారు. -
ఉలిక్కిపడ్డారు..పరుగులు తీశారు
పట్టణంలో పోలీసుల కార్డెన్‌సెర్చ్ కేశవరావుతోటలో ఆకస్మిక తనిఖీలు ఆందోళన చెందిన పలువురు కాలనీ వాసులు కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : అది పట్టణంలోని ఆంధ్రా జాతీయ కళాశాల సమీపంలోనికేశవరావుతోట ప్రాంతం... సమయం మంగళవారం ఉదయం 5.30 గంటలు.. వాతావరణం నిర్మానుషంగా ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం ప్రశాంత వాతావరణంలో ఉంది.. ఆ ప్రాంతంలో ఉద్యోగులతో పాటు ఏ రోజుకారోజు కాయకష్టం చేసుకునే కూలీలు ఉన్నారు.. గతంలో ఆ కాలనీ పలు వివాదాలతో పోలీస్‌స్టేషన్ రికార్డుల్లోకి ఎక్కిన సంఘటనలు ఉన్నాయి.. చిన్న చిన్న నేరాలు, ఘోరాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి.. అలాంటి వాతావరణంలో ఉండే కాలనీలో తెల్లవారుజామున 5.30 గంటలకు బూట్ల శబ్ధాలు కాలనీ వాసుల చెవినపడ్డాయి. ఖంగారుపడిన స్థానికులు చూడగా పోలీసు బృందాలు కుప్పలుతెప్పలుగా కాలనీలోకి పరుగులు పెడుతూ కనిపించాయి. దీంతో కాలనీ మొత్తం ఉలిక్కిపడింది. కాలనీలోకి పరుగులు పెట్టిన పోలీసు బృందాలు గుంపులు గుంపులుగా విడిపోయి ఆ ప్రాంతంలోని ఇళ్లల్లో విస్త్రృత సోదాలు చేశారు. నిద్రలో ఉన్న వారిని సైతం తట్టిలేపారు. కంగారులో నిద్ర లేచిన వారికి కళ్లెదుట పోలీసులు కనబడటంతో ఉలిక్కిపడ్దారు. కాలనీలోకి పోలీసులు ఎందుకు వచ్చారు.. ఎవరి కోసం వెతుకుతున్నారు.. ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు. అసలు విషయమేంటి అనే మీమాంసలో ఆ ప్రాంత వాసులందరూ ఖిన్నులై మిన్నుకుండిపోయారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మరికొందరు స్థానికులు ఉరుకులు పరుగులు మీద రోడ్లపై వచ్చేశారు. కాలనీ మొత్తం పోలీసులు సోదాలు చేస్తుండటంతో అర్ధంకాని పలువురు అమాయకంగా పోలీసుల వైపు చూస్తుండటమే వంతుగా మిగిలింది. సోదాలు మొత్తం పూర్తి చేసుకున్న పోలీసులు అసలు విషయం చెప్పే వరకు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. అధికారులు అసలు విషయం చెప్పే సరికి హమ్మయ్య అనుకున్నారు. ఇది మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని కేశవరావుతోటలో జరిగిన ఘటన. విషయానికొస్తే మంగళవారం ఉదయం బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు నేతృత్వంలో బందరు సబ్-డివిజన్ పరిధిలోని పోలీసులు కేశవరావుతోట ప్రాంతంలో నేర ప్రవృత్తి కలిగిన నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అందుకోసం డివిజన్ పరిధిలోని సుమారు 150 మంది పోలీసులు కాలనీపై ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు. కాలనీలోని ఇంటింటిని సోదా చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు నాయకత్వం వహించగా డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిసి కార్డెన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. కేశవరావుతోట మొత్తం జల్లిడ పట్టిన పోలీసులు సుమారు 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారందరినీ ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అలాగే కాలనీలో పత్రాలు, నెంబరు ప్లేట్లు సరిగా లేని 10 వాహనాలను స్టేషన్‌కు తరలించారు. అయితే అదుపులోకి తీసుకున్న అనుమానితులు పలువురు తమ చిరునామాలను పోలీసులకు వివరించడంతో వారిని స్టేషన్ నుంచి పంపించివేశారు. మిగిలిన అనుమానితులను స్టేషన్లో విచారణ నిమిత్తం అట్టిపెట్టారు. అలాగే బైక్‌లకు సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నట్లు చూపించిన వారికి వారి బైక్‌లను అప్పగించేశారు. ఈ కార్డెన్‌సెర్చ్‌లో రూరల్ సీఐ వీఎస్‌ఎస్‌వీ మూర్తి, టౌన్ సీఐ సుబ్బారావు, ఎస్సైలు అశోక్, నభీ, లోవరాజు, ఏ దుర్గారావు, అనిల్‌కుమార్, శ్రీహరికుమార్, 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.