నర్సీపట్నం సబ్‌జైలులో ఖైదీ మృతి
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ గుండెపోటుతో మృతిచెందాడు. కష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన పందిరి సత్యనారాయణ రోడ్డు ప్రమాదం కేసులో నర్సీపట్నం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనకు సోమవారం ఉదయం గుండెనొప్పి రావడంతో జైలు సిబ్బంది ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం తీసుకువచ్చారు. తిరిగి రాత్రి గుండెనొప్పి రావటంతో వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.