బంగ్లాదేశ్‌లో 26 మందికి మరణశిక్ష
నారాయణ్‌గంజ్ హత్యల కేసు
ఢాకా: ఏడుగుర్ని అతి కిరాతకంగా హత మార్చిన కేసులో 26 మందికి బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించింది. వీరిలో నగర మాజీ కౌన్సిలర్ ఒకరు, బంగ్లాదేశ్ భద్రతా దళానికి చెందిన సీనియర్ అధికారులు ముగ్గురున్నారు. హంతకులను మరణించేవరకు ఉరి తీయాలని నారాయణ్‌గంజ్ జిల్లా, సెషన్స్ జడ్జి సయ్యద్ ఇనాయెత్ హోస్సైన్ సోమవారం నాటి తీర్పులో పేర్కొన్నారు.నారాయణ్‌గంజ్‌లో 2014లో ఈ హత్యలు జరిగాయి.
ముగ్గురు అధికా రుల్లో ఒకరు మంత్రికి స్వయానా అల్లుడు.హత్యాకాండ సమయంలో ఆయన రాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. మిగతా ఇద్దరిలో ఒకరు ఆర్మీ మేజర్ కాగా మరొకరు నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో ఉన్నారు. ప్రత్యర్థి కౌన్సిలర్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించిననూర్ హŸస్సైన్ అనే మాజీ కౌన్సిలర్ అధికారులకు డబ్బులు ఎరవేసి లొంగదీసుకున్నాడు. వీరంతా కలసి ఏడు గురిని అతి కిరాతకంగా హత్యచేశారు.