breaking news
Nalgonda DEO Office
-
నల్గొండ డీఈవో లీలలు.. భార్య ఉండగానే మరో మహిళతో..
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ డీఈవో భిక్షపతి లీలలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ మహిళ ద్వారా ముగ్గురు పిల్లలకు భిక్షపతి తండ్రి అయినట్లు మొదటి భార్య ఆరోపిస్తోంది. ప్రియురాలితో ఉండగా డీఈవో భిక్షపతిని భార్య రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది. పెళ్లైన నెలకే వదిలేశాడంటూ డీఈవో ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. గతంతోనూ డీఈవోపై అనేక ఆరోపణలు రాగా, గత కొన్నేళ్లుగా నల్లగొండ డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. తనను మోసం చేసి వేరే కాపురం పెట్టాడంటూ డీఈవో భిక్షపతి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో మహిళతో ఉంటూ తనకు విడాకుల నోటీసులు పంపించారని.. ఈ వ్యవహారం ఏంటని ప్రశ్నిస్తే చంపుతానంటూ బెదిస్తున్నారని ఆమె తెలిపారు. -
నల్గొండ డిఇఓ కార్యాలయంలో అగ్నిప్రమాదం
నల్లగొండ: డిఇఓ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించి పలు కీలక పత్రాలు దగ్ధమయ్యాయి. రికార్డు రూం పూర్తిగా దగ్ధమైంది. ముఖ్యమైన సర్టిఫికెట్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అగ్ని ప్రమాదంపై డిఇఓ జగదీష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలిపోయిన వాటిలో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.