breaking news
Naga militants
-
మరోసారి సర్జికల్ స్ట్రైక్స్..
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైన్యం మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులపై విరుచుకుపడింది. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండో- మయన్మార్ సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన 70మంది పారా కమాండోల బృందం ఉదయం నాలుగు గంటల 45 నిమిషాలకు ఈ దాడి నిర్వహించింది. లాంఖూ గ్రామ సమీపంలో ఉన్న నాగా టెర్రర్ క్యాంప్స్ను ధ్వంసంచేసింది. ఈ మెరుపుదాడుల్లో ఎన్ఎస్సీఎన్-కే ఉగ్రమూకకు భారీ నష్టం వాటిల్లినట్టు సైన్యం ప్రకటించింది. పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పింది. అయితే, సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన కమాండోలు అంతర్జాతీయ సరిహద్దు దాటలేదని స్పష్టంచేసింది. మన కమాండోలకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. జవాన్లపై నాగాలు దాడికి దిగడంతో.. వారిని నిలువరించే క్రమంలోనే మెరుపుదాడులు చేసినట్టు సైనికవర్గాలు వెల్లడించాయి. ఎస్ఎస్ ఖప్లాంగ్ నేతృత్వంలో ఏర్పడిన ఎన్ఎస్సీఎన్-కే తిరుగుబాటుదళం.. నాగాల్యాండ్, మణిపూర్‌ల్లో మన జవాన్లపై వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ తరహా మెరుపుదాడులు నిర్వహించి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా ఇండో మయన్మార్ సరిహద్దుల్లో భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం గమనార్హం. -
మరోసారి సర్జికల్ స్ట్రైక్స్.. ఈసారి టార్గెట్ నాగా టెర్రర్!
-
ఇంజనీర్ల కిడ్నాప్ కథ సుఖాంతం
విజయవాడ: నాగా తీవ్రవాదుల చెరలో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఇంజ నీర్లు ఎట్టకేలకు విడుదలయ్యారు. దీంతో ఐదు రోజులుగా ఆందోళన చెందుతు న్న రెండు కుటుంబాలు...ఊపిరి పీల్చుకున్నాయి. జూలై 27న విజయవాడ కరెన్సీనగర్‌కు చెందిన గోగినేని ప్రతీష్‌చంద్ర, నూజివీడు మండలం గొల్లపల్లికి చెం దిన చింతకింద రాఘవేంద్రరావు(రఘు)లను నాగా రివల్యూషనరీ ఫ్రంట్ (ఎన్ఆర్ఎఫ్) తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. చర్చల్లో భాగంగా ముందస్తు ఒప్పందంలోని కొంత నగదును బుధవారం తీవ్రవాద సంస్థకు చెల్లిం చిన పృథ్వీ కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులు..మిగిలిన మొత్తం గురువారం ఉద యం చెల్లించడంతో కిడ్నాప్ చేసిన ఇంజనీర్లను విడుదల చేశారు. ఈ విషయాన్ని సదరు ఇంజనీర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు విడుదలైన తర్వాత దిమ్మాపూర్ నుంచి అస్సాం రాజధాని గువాహటికి గురువారం సాయంత్రం చేరుకుని, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు గురువారం రాత్రి చేరుకుంటారు. శుక్రవారం విజయవాడకు వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.