breaking news
music videos
-
అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన సింగర్ సునీత
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్లో ఎంతో క్రేజ్ దక్కించుకున్న సునీత సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఏ పోస్ట్ షేర్ చేసినా క్షణాల్లో అది వైరల్ అవుతుంది. తాజాగా సింగర్ సునీత అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వన్ మినిట్ మ్యూజిక్ వీడియోలను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు(సోమవారం)నుంచే తన మొదటి మ్యూజిక్ రీల్స్‌ను అప్లోడ్ చేస్తానని తెలిపారు. దీనిపై స్పందించిన ఫ్యాన్స్ మీ గొంతు వినడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
మ్యూజిక్ ఇష్టపడే వారికి ఫేస్బుక్ గుడ్‌న్యూస్..
ముంబై: సంగీత ప్రియులకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ శనివారం శుభవార్త ప్రకటించింది. ఫేస్బుక్ తన అధికారిక సెక్షన్లో సంగీతానికి సంబంధించిన వీడియోలను(మ్యూజిక్ వీడియోలు)అందించనుంది. ఇప్పటికే సంగీత సంస్థలతో ఫేస్బుక్ ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే గత సంవత్సరం నుండే దేశీయ సంగీత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, సంగీత ప్రియులను ఆకర్శించడమే తమ అభిమతమని ఫేస్బుక్ ఇండియా డైరెక్టర్ మానీష్ చోప్రా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంగీతాన్ని ప్రపంచానికి చేరవేసే అన్ని సాంకేతిక వనరులను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. కాగా మ్యూజిక్ ఫీచర్లు ఇండియా,ధాయ్‌లాండ్, యూఎస్ తదితర దేశాలలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఫేస్‌బుక్‌కు వీడియోలు అందించే కంపెనీల వివరాలు టీసిరీస్ మ్యూజిక్, జీమ్యూజిక్ కంపెనీ, యష్ రాజ్ ఫిల్మ్స్ తదితర కంపెనీలు వీడియోలు అందిస్తాయి. మరోవైపు సోనీ మ్యూజిక్, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్, బీఎమ్జీ తదితర దిగ్గజ సంస్థలతో ఫేస్బుక్ కలిసి పనిచేయనుంది. వినియోగదారులు సంగీత వీడియోల సెక్షన్‌కు వెళ్లి కావాల్సిన కళాకారుల పాటలను కూడా వీక్షించగలరు. ఫేస్బుక్ గ్రూప్స్, మెసెంజర్లతో వీడియోలను పంచుకోవచ్చు. -
యూట్యూబ్..ఫేస్బుక్ లో ఏం చూస్తారంటే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా ఏఏ అంశాల కోసం వాడుతున్నారో వెల్లడయింది. మ్యూజిక్ కోసం యూట్యూబ్‌ను, వార్తల కోసమైతే ఫేస్‌బుక్‌పైన ఆధారపడుతున్నారట. విడూలీ మీడియా టెక్ అనే వీడియో ఇంటలిజెన్స్ సంస్థ దీనిపై సర్వే జరిపింది. ఆ వివరాలను సంస్థ సీఈవో సుబ్రత్ కర్ మంగళవారం వెల్లడించారు. దాదాపు 3 బిలియన్ల మంది నెట్ వీక్షకులు సంగీతం కోసం యూట్యూబ్‌ను వాడుతుండగా తర్వాతి స్థానంలో దాదాపు 2.4బిలియన్ల మంది వినోద కార్యక్రమాల కోసం ఆశ్రయిస్తున్నారు. మూడో స్థానంలో చిన్నారుల కార్యక్రమాలకు దాదాపు 1.3 బిలియన్ వ్యూస్ ఉన్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వార్తాంశాల కోసం 1.58 బిలియన్లు, వినోదం కోసం 1.06బిలియన్ వ్యూస్ ఉన్నాయని ఆయన తెలిపారు. ఫేస్బుక్లో వార్తాంశాల వీడియోల తర్వాత వినోదాంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సంగీతం, వినోదం, వార్తల వీడియోలను చూసే వారి సంఖ్య ఒక్కసారిగా దాదాపు 40శాతం పెరిగిపోయిందని, టయర్-2, 3 స్థాయి పట్టణాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందని చెప్పారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 400 మిలియన్ల మంది ఉండగా అందులో యూట్యూబ్ చూసేవారి సంఖ్య అందులో ప్రధానంగా ఉంటోంది. సుమారు 241 బిలియన్ల వినియోగదారులతో ఫేస్బుక్ దేశంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమంగా మారిందని వెల్లడయింది. దేశంలోని 18-65 ఏళ్ల వారి 641 మిలియన్ల మంది నెట్ వినియోగదారుల అభిరుచులను విడూలీ సంస్థ విశ్లేషించి ఈ వివరాలను నమోదు చేసింది. దీని ప్రకారం యూట్యూబ్ ఛానెళ్లలో టాప్-10లో ఉన్నవి... టీ సిరీస్, సెట్ ఇండియా, జీటీవీ, చుచుటీవీ, వేవ్ మ్యూజిక్, సబ్ టీవీ, జీ మ్యూజిక్, సీవీస్ రైమ్స్, స్పీడ్ రికార్డ్స్, ఈరోస్ నౌ ఉన్నాయి. అలాగే టాప్-10లో ఉన్న ఫేస్బుక్ వార్త ఛానెళ్లలో ఏబీపీ న్యూస్, దైనిక్ భాస్కర్, ఆజ్‌తక్, విజయ్ టెలివిజన్, ఏబీపీ మఝా, ఏబీపీ లైవ్, హెబ్బార్స్ కిచెన్, ది అమిత్ భదానా, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆష్కీన్-1 ఉన్నాయి. yout Indian internet users -
దేవుడి వెయ్యినోటు!
దైవికం వరుణ్ పృధి నటుడు, మంచి డాన్సర్. కొన్ని యాడ్స్ చేశాడు. మ్యూజిక్ వీడియోలు తీశాడు. చిన్నపాటి నిర్మాత కూడా. ‘టెరోడాక్టల్ సర్ప్రైజ్’, ‘సుగర్ వీల్స్’, ‘రికీ ది హ్యాండీమ్యాన్’ (మొదటిది టీవీ సిరీస్, తర్వాతి రెండూ షార్ట్ ఫిల్ములు)లలో నటించాడు. ‘రికీ ది హ్యాండీమ్యాన్’ చిత్రానికి మాటలు అతడివే. ఖర్చూ అతడిదే. ఇన్ని రంగాలలో ప్రావీణ్యం ఉన్న ఈ ఢిల్లీ యువకుడి గురించి నిన్నమొన్నటి వరకు దాదాపుగా ఎవరికీ తెలియదు. ఇప్పటికైనా తెలియకపోయేవాడేనేమో కానీ, ఇటీవల తను అప్లోడ్ చే సిన వీడియో ఒకటి అతడిని వివాదాస్పద ప్రముఖుణ్ణి చేసింది! ‘డ బ్బు సంతోషాన్నిస్తుందా’ అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే ఆ వీడియో, ‘తప్పకుండా. కష్టాలు, కన్నీళ్లతో జీవితం సాగిస్తున్నవారికి అది సంతోషాన్నిస్తుంది’ అనే సమాధానంతో ముగుస్తుంది. ఆ వీడియో పేరు ‘గాడ్ సెంట్ మీ ఫర్ యు’ (మీకోసం దేవుడు నన్ను పంపించాడు). వీడియో ఆసక్తికరంగా సాగుతుంది. వరుణ్ మొదట ఓ పార్కులో గ్లాసు నీళ్లను (కుండలోని నీళ్లు) రూపాయి చొప్పున అమ్ముకునే మహిళ దగ్గరకు వెళ్లి, మోకాళ్ల మీద వంగి నిలబడి, ‘‘ఏమ్మా, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా?’’ అంటాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. నిజమే. జీన్స్‌ప్యాంటు, టీషర్టులో సినిమా హీరోలా ఉన్నవాడికి వెళ్లెళ్లి ఆమె కుండలో నీళ్లు తాగే అవసరం ఏముంటుంది? ఆమె ఆశ్చర్యం పూర్తికాకుండానే, మళ్లీ అదే ప్రశ్న అడుగుతాడు వరుణ్. దానికి సమాధానంగా ఆమె ‘‘ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంటుంది. నాకు మాత్రం ఎందుకు ఉండదు?’’ అని ప్రశ్నిస్తుంది. వెంటనే వరుణ్ నిటారుగా నిలబడి ప్యాంటు జేబులోంచి పెళపెళలాడే వెయ్యినోటు తీసి ఆమెకు ఇస్తూ, ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అంటాడు. ఆమెకేమీ అర్థం కాదు! భయంగా చూస్తుంది. ‘‘తీస్కోమ్మా, నీకే’’ అంటాడు. ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కొద్దిసేపు వీడియోలో ఆ నోటు తీసుకున్నావిడ ఫీలింగ్ కనిపిస్తాయి. ఈలోపు వరుణ్ ఇంకో చోటుకు వెళ్లి ఉంటాడు. అక్కడా ఇలాగే ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అని చెప్పి వెయ్యినోటు ఇస్తుంటాడు. అలా... బ్రేస్లెట్స్ అమ్మే అమ్మాయి, పాపడ్లు అమ్ముకునే 55 ఏళ్ల ఆయన, పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్మే వ్యక్తి, ఐదురూపాయలకు టీ అమ్ముకునే అతను, పదిరూపాయలకు పీచుమిఠాయి అమ్ముతుండే పెద్దాయన, బబుల్ టాయ్స్ అమ్మే కుర్రాడు... ఇలాంటి వాళ్లందరి దగ్గరకు వెళ్లి ‘‘దేవుడి మీద నీకు నమ్మకం ఉందా?’’ అని మొదలు పెడతాడు. చివర్లో ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అంటూ వెయ్యి నోటు చేతిలో పెడతాడు. పెట్టి, వెంటనే వెళ్లిపోతాడు. ఆ డబ్బు తీసుకున్నవాళ్లు ఒక్కొక్కొళ్లు ఒక్కోలా స్పందిస్తుంటారు. బ్రేస్లెట్స్ అమ్మే అమ్మాయి ఎలాంటి సంకోచం లేకుండా డబ్బు తీసుకుని థ్యాంక్స్ చెబుతుంది. ఆ ఆనందంలో... రాబోతున్న డాన్స్‌ని ఆపుకుంటుంది. పాపడ్లు అమ్మే ఆయన ‘‘సార్ ఒక్క పాపడ్ అయినా తీసుకోండి’’ అని కృతజ్ఞతగా అంటాడు. వెయ్యినోటుని కళ్లకద్దుకుని, ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకుంటాడు. పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్మే ఒంటి కన్ను వ్యక్తి వెయ్యి నోటు తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. వరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినా కూడా ఆ నోటును చూసుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. టీ అమ్మే అతను మాటలు రాని ఆనందంలో తటపటాయింపుగా నోటు తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. కాసేపు అలా స్తంభించినట్లు నిలబడిపోతాడు. పీచుమిఠాయి అమ్మే ఆయన ‘‘నా మీద జోకు చెయ్యొద్దుసార్’’ అని, తర్వాత నోటును అందుకుని నుదుటికి ఆన్చుకుంటాడు. బబుల్ టాయ్స్ కుర్రాడు చిరునవ్వుతో వెయ్యినోటు అందుకుని ప్యాంటు జేబులో పెట్టుకుంటాడు. వరుణ్ వీళ్లందరిలోనూ ఆనందాన్ని చూశాడు. ఎలా చూశాడంటే నేరుగా చూడలేదు. ఒకళ్లకు వెయ్యినోటు ఇచ్చివెళ్లాక వాళ్ల ముఖ భావాలను దూరం నుంచి వీడియోగ్రాఫర్ కొద్దిసేపు క్యాచ్ చేస్తే, అన్నిటినీ కలిపి ఒకేసారి వీడియోలో చూశాడు. లేమిలో సైతం భగవంతుడిపై నమ్మకం కోల్పోకుండా కుటుంబాల కోసం బతుకులు ఈడుస్తున్న ఈ స్ట్రీట్ హాకర్ల కళ్లలో వెయ్యినోటు తెచ్చిన ఆనందాన్ని, దేవుడే వెయ్యినోటుగా సాక్షాత్కరించినంత ఉద్వేగాన్ని చూశాడు. ‘‘జీవితం మీద ఆశలు కోల్పోకండి. దేవుడు ఏదో ఒకరూపంలో మీ బాధలు తీరుస్తాడు’ అని చెప్పడం వరుణ్ ఉద్దేశం. అయితే వరుణ్ ఇలా దేవుడు పంపిన దూతలా పేదవారికి డబ్బు పంచడం వివాదాస్పదం అయింది. ‘‘దేవుణ్ణి ఇందులోకి లాగడం ఏం బాలేదు. ఎవరికైనా మేలు చేయాలనుకున్నప్పుడు వారికి పని కల్పించాలి తప్ప, వాళ్లను యాచకుల స్థాయికి దిగజార్చకూడదు. అలా చేయడం దాతృత్వం అనిపించుకోదు’’ అని ఇండియన్ కార్పొరేట్ గురు సుహెల్ సేథ్ లాంటి వాళ్లు అంటున్నారు. అయితే వరుణ్ పృధి ఆ మాటలేమీ పట్టించుకున్నట్టు లేదు. ‘గాడ్ సెంట్ మీ ఫర్ యూ’ పార్ట్ 2 కూడా తీసి నెట్లో పెట్టేశాడు. ‘‘వాళ్లను సంతోషపెట్టడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుడి చిరునామా పేదవాళ్ల సంతోషమే కదా. అలా దేవుణ్ణి వెదికి పట్టుకుంటున్నాను తప్ప, దేవుణ్ణి ఎందులోకీ లాగడం లేదని చెబుతున్నాడు. వరుణ్ని కూడా మనం ఎందులోకీ లాగకుండా అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగితే... లేమిలో ఉన్నవారిని సంతోష పెట్టడం అంటే ఆ భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోవడమేనన్న భావనలో మనకెలాంటి తప్పూ కనిపించదు. - మాధవ్ శింగరాజు