breaking news
muharram parade
-
30 ఏళ్లకు మొహర్రం
శ్రీనగర్: దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా జమ్మూలో షియా ముస్లింలు మొహర్రం ఊరేగింపు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం శ్రీనగర్ గుండా లాల్ చౌక్ ఏరియా మార్గంలో గురువారం భారీ మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఊరేగింపు సాగింది. షియాలు పెద్ద సంఖ్యలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు గురుబజార్ నుంచి దాల్గేట్ మార్గంలో జెండాలు చేబూని శాంతియుతంగా ముందుకు సాగారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం ప్రబలిన తర్వాత..గత 30 ఏళ్లలో మొహర్రం ఊరేగింపు జరగడం ఇదే మొదటిసారని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. -
మొహర్రం ఊరేగింపులో విషాదం
నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ పంచాయతీ అచ్చాయపల్లిలో బుధవారం జరిగిన మొహర్రం ఊరేగింపులో ప్రమాదం జరిగింది. గ్రామంలో పీర్లను ఊరేగిస్తున్న బృందం విద్యుదాఘాతంతో ఓ యువకుడు సజీవ దహనం కాగా మరో 26 మంది గాయపడ్డారు. వివరాలు.. మొహర్రం సందర్భంగా అచ్చాయపల్లికి చెందిన కొందరు పీర్లను ఎత్తుకొని ఊరేగింపుగా ఎల్లారెడ్డి మండలం మచాపూర్ నుంచి వస్తుండగా 132 కేవీ హై టెన్షన్ వైర్లకు పీర్ కర్ర తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. వైర్ల నుంచి ఒక్కసారిగా నిప్పురవ్వలు లేచి వారిపై పడ్డాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన జింక సాయిలు(35) అక్కడిక్కడే సజీవదహనం కాగా, 26 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.