breaking news
MUDIRAJ Social
-
క్షమాపణలు చెప్పేందుకు మంత్రి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తన మాటలతో గంగపుత్రుల మనసు బాధించి ఉంటే తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గంగపుత్రులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, గంగపుత్ర సంఘం ప్రతినిధులతో మంత్రి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న కోకాపేటలో ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో ముదిరాజ్‌లను ఉత్తేజపరిచే విధంగా మాట్లాడానే తప్ప ఎవరినీ బాధ పెట్టే విధంగా ప్రసంగించలేదని సంఘం ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా.. వాటి పరిష్కారానికి చర్య లు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. -
వైఎస్ కుటుంబాన్ని వేధించారు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలో సోమవారం నిర్వహించి న ముదిరాజ్ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ కుటుంబం పై వేధింపుల్లో భాగంగానే వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని నెలలపాటు జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వేధింపులనూ తట్టుకుని జగన్ అశేష ప్రజాభిమానం చూరగొన్నారన్నారు. వై ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావాలంటే జగన్‌ను ప్రజలు నిండు మనసుతో ఆశీ ర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న బియ్యపు మధుసూదన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కో రారు. అదేవిధంగా తిరుపతి పార్లమెం టు సభ్యులుగా పోటీ చేయనున్న వెలగపల్లి వరప్రసాద్‌ను ముదిరాజులు అఖం డ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజులకు శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాల్లో కమ్యూనిటీ భవనా లు, కల్యాణ మండపాలు ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నా రు. అనంతరం వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. జిల్లాకు సింహం లాంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అభివర్ణించారు. వచ్చే ఏడాది ముది రాజ్‌ల సమావేశానికి రాష్ట్ర కీలకమంత్రి హోదాలో ఆయన హాజరవుతారని పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ పేదల సంక్షే మం వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సా ధ్యమన్నారు. ఆప్కో డెరైక్టర్ మిద్దెలహరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజ లు జగన్‌కు మద్దతు పలకాలన్నారు. రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనందరెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్‌లు ఐక్యతతో విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని సూచించారు. ముదిరాజ్ సంఘం నాయకులు చిట్టేటి చిన్నా ముదిరాజ్ మాట్లాడుతూ ముది రాజ్‌ల అభ్యున్నతికి తోడ్పాటు అందిం చే రాజకీయపార్టీకే తమ మద్దతు ఉం టుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ము దిరాజ్ల అభ్యున్నతికి సహకరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముది రాజ్ సంఘం నాయకులు దేశీయ ముది రాజ్, కుమార్‌రాజ, కోటేశ్వరరావు, మునిరామయ్య, అంకయ్య ముదిరాజ్, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుమ్మడి బాలకృష్ణయ్య, నాయకులు కొ ట్టెడి మధుశేఖర్, లోకేష్‌యాదవ్, ఉ న్నం వాసునాయుడు, పురుషోత్తంగౌడ్, సిరాజ్‌బాషా, జయశ్యాంరాయల్, పం తులు, మదన్మోహన్ పాల్గొన్నారు.