breaking news
Moon Day
-
చల్లని రాజా ఓ చందమామా
చందమామ రావే... జాబిల్లి రావే.. అని ఎంత పిలిచినా దగ్గరకు రాని చందమామ దగ్గరకు మనిషే వెళ్లాడు. జూలై 20, 1969 నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి పై కాలు మోపిన రోజు.అతడే చెప్పినట్టు అది ‘మానవ జాతి ముందంజ’.అయినా సరే... నేటికీ చందమామ ఒక నిగూఢ దీపం. రహస్యాల మయం.మానవజాతికి ఈ రేరాజు ఆత్మీయుడు,అందమైన స్నేహితుడు, ప్రియతముడు, మేనమామ. అతని చుట్టూ ఎన్నో కథలూ గాథలూ కల్పనలు. నేడు ‘ఇంటర్నేషనల్ మూన్ డే’. కాబట్టి శశికాంతుని సంగతులు కొన్ని...కుందేలు ఇలా వచ్చిందట!చంద్రుడిపై కుందేలు అనేది అందమైన అబద్ధమైనా అది మనకు అమితంగా ఇష్టమైన అబద్ధం! అసలు మన కుందేలు అక్కడెక్కడో ఉన్న చంద్రుడిపైకి ఎలా చేరింది? ప్రపంచ వ్యాప్తంగా పాచుర్యంలో ఉన్న ఒక నమ్మకం ప్రకారం.... బుద్ధుడు ఊరూరూ తిరిగి, బోధనలు చేసి అలిసిపోయాడు. ఆకలితో ఉన్నాడు. ఇది గమనించిన జంతువులు తమకు తోచిన పరిధిలో బుద్ధుడు తినడానికి రకరకాల పదార్థాలు తీసుకువచ్చాయి. పాపం! ఒక కుందేలు దగ్గర మాత్రం ఏమీ ఉండదు. ‘నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి’ అంటూ మంటల్లో దూకి చనిపోతుంది కుందేలు. కుందేలు ఆత్మత్యాగానికి చలించిన బుద్ధుడు దానికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. చంద్రుడిపై ఉండి కనువిందు చేసేలా వరమిస్తాడు.మూడుసార్లు పుట్టాడు...ఎవరైనా సరే ఒక్కసారే పుడతారు. పురాణాల ప్రకారం చంద్రుడు మాత్రం మూడుసార్లు పుట్టాడు. అందుకే చంద్రుడిని త్రిజన్మి అని కూడా అంటారు. చంద్రుణ్ణి మొదటిసారి బ్రహ్మ సృష్టించాడు. రెండోసారి అత్రి మహర్షి కన్నుల నుంచి ఉద్భవించాడు. రాక్షసులు, దేవతల క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు చంద్రుడు పునర్జన్మ పొందాడు.డస్ట్‌బిన్ కాదు...మనిషంటేనే నిరంతరం చెత్తను పారబోస్తుండే జీవి. అతడా చెత్త వేయడానికి భూగ్రహం సరి΄ోక చంద్రుని మీదా బోలెడంత ΄ారబోస్తున్నాడు. పనికి రాకుండా పోయిన రోవర్లూ, విఫలమైన రాకెట్లూ, పంపిన ఉపగ్రహాలూ, ఆస్ట్రొనాట్ల బూట్లూ, బ్లాంకెట్లూ ఇలాంటివెన్నో అక్కడ. అంతరిక్ష ప్రయాణికులు బ్యాగుల్లో ΄ోసి అక్కడ ΄ారబోసిన యూరిన్ బ్యాగులే 100కు పైగా ఉన్నాయక్కడ. ఇలా ఇప్పటివరకూ చంద్రుడి మీద మనిషి పారబోసిన చెత్త బరువు ఎంతో తెలుసా? అక్షరాలా 2,27,000 కిలోలు.చంద్రపాలుమనకు భూకంపాలలాగే చంద్రుడి మీదా చంద్రకం΄ాలు వస్తుంటాయి. ఇంగ్లిషులో మూన్‌క్వేక్స్. ఇవి మళ్లీ నాలుగు రకాలు. చాలా లోతుగా వచ్చేవి డీప్ క్వేక్స్, ఉల్కలేవైనా చంద్రుణ్ణి ఢీకొడితే వచ్చేవి మీటియోరైట్ ఇంపాక్ట్స్, సూర్యుడి ఉష్ణోగ్రతతో వచ్చేవి థర్మల్ క్వేక్స్... ఇవి మూడూ ఒకరకం. కానీ ‘షాలో మూన్ క్వేక్స్’ మాత్రం చాలా భయంకరం. భూకంపం సెకన్లపాటు కొనసాగితేనే మహా ఉత్పాతం కదా... కానీ చంద్రకంపం దాదాపు పదినిమిషాలు మొదలుకొని అరగంట ΄ాటూ అదేపనిగా వస్తుంది.లూనార్ స్మెల్...చంద్రునికో వాసన కూడా ఉంటుంది. దాన్నే ‘లూనార్ స్మెల్’ అంటారు. అక్కడ వాతావరణం ఉండదు. అప్పుడు స్మెల్ ఎలా అనే అనుమానం రావచ్చు. అ΄ోలో–11కు చెందిన ఆస్ట్రొనాట్స్అందరి స్పేస్ సూట్లకు అంటుకుపోయి ఒకేలాంటి వాసన కొట్టడంతో ఈ విషయం తెలిసొచ్చింది. ఘాటైన మెటాలిక్ స్మెల్లాగా. క్రాకర్స్ కాలిపోయాక బాగా మండిన గన్΄ûడర్లా ఉండే వాసన ఇదంటూ ఖచ్చితంగా తెలిపినవాడు హరిసన్ జాక్ స్మిత్ అనే అపోలో–17 కు చెందిన సైంటిస్ట్ ఆస్ట్రొనాట్.ఆఖరి మజిలీ...΄ాపం... అప్పుడప్పుడూ అతడు శశికాంతుడా శ్మశానమా అనే డౌటు కూడా వస్తుంటుంది. చంద్రుడి మీద తమ చితాభస్మం పడాలని చాలా మంది భూలోక వాసుల కోరిక. అందుకే 450 బీసీ కాలం నుంచే కొందరు తమ చితాభస్మాన్ని చంద్రుడి మీద పడేలా ఎత్తైన ప్రదేశం నుంచి ఆకాశంలోకి విసిరేయమని వీలునామా రాసేవారు. యూజీన్ షూమాకర్ అనే ఆస్ట్రొనాట్కు చంద్రుని మీదకు వెళ్లాలని కోరిక. అయితే అతడు ఓ శారీరక లోపం కారణంగా చంద్రుణ్ణి చేరలేక΄ోయాడు. కానీ ఏనాటికైనా చంద్రుణ్ణి చేరాలన్న అతడి కోరిక నెరవేరకుండానే కారు యాక్సిడెంట్‌కు గురై 1997 లో మరణించాడు. అతడి కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్న నాసా... అతడి భార్య, పరిశోధనల్లో సహచరి అయిన కరోలిన్ దగ్గర్నుంచి అనుమతి తీసుకుని లూనార్ ్రపాస్పెక్టర్ అనే ఉపగ్రహోపకరణంతో చంద్రుడిపైన దక్షిణ ధ్రువంలోని ఓ క్రేటర్‌లోకి సమాధయ్యేలా చితాభస్మాన్ని జల్లి 1998లో అతడి కోరిక తీర్చారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ లాంటివాళ్లు తమ స్పేస్ ఎక్స్‌తో 2019లో 152 మంది చితాభస్మాల్ని అంతరిక్ష వైతరణిలో నిమజ్జనం చేశారు.మూన్ డస్ట్ ఫీవర్ప్రస్తుతానికి ఎవరు పడితే వారు ఎప్పుడంటే అప్పుడు వెళ్లడానికి చంద్రుడేమీ పిక్నిక్ స్పాట్ కాదు. మామూలు వ్యక్తులు చంద్రుడి మీదకి వెళ్లడం సాధ్యం కాదు. అక్కడ ఉండే దుమ్మూధూళికి మూన్ డస్ట్ అని పేరు. అది పీల్చడం ఎంతో ప్రమాదకరం. స్పేస్ సూట్ తొడుక్కుని వెళ్లినా బట్టల్లోకి చేరిపోతుంది. అది ‘లూనార్ హే ఫీవర్’ అనే సమస్యకు దారితీస్తుంది. దీన్నే మూన్ డస్ట్ ఫీవర్ అని కూడా అంటారు.ధారాసింగ్ ముందే అడుగు పెట్టాడు‘ఇదెలా సాధ్యం!’ అనుకోవద్దు. సినిమాల్లో ఏదైనా సాధ్యమే కదా! విషయంలోకి వస్తే....1967లో హిందీలో ‘చాంద్ పర్ చడాయి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా లో ప్రఖ్యాత రెజ్లర్ ధారాసింగ్ వ్యోమగామి ఆనంద్ ΄ాత్రలో నటించాడు. తన అసిస్టెంట్ ‘భాగు’తో కలిసి చంద్రుడిపై అడుగు పెట్టిన ఆనంద్ అక్కడ మాన్స్టర్లతో వీరోచితంగా ΄ోరాడుతాడు. ఈ ఫైటింగ్ విషయం ఎలా ఉన్నా ‘చంద్రయాన్’ లాంటి సందర్భాలలో ఈ సినిమాలోని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో ΄ోస్ట్ చేస్తుంటాడు అతడి కుమారుడు విందు ధారాసింగ్. -
అదొక అద్భుత ఘట్టం.. లైవ్‌లో చూపించినా నమ్మరెందుకు?
చరిత్రలో అదొక అత్యంత ముఖ్యమైన ఘట్టం. సాంకేతికతను పుణికిపుచ్చుకున్న మనిషి, అప్పటిదాకా రోదసీ యాత్రలతోనే సరిపెట్టుకున్న మనిషి.. ఏకంగా చందమామ కలను సాకారం చేసుకున్న క్షణాలవి. 1969 జులై 20 నాసా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ ‘ఈగిల్ లునార్ మాడ్యుల్’ నుంచి కిందకి దిగగా.. ఆ ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను సగర్వంగా ఎగరేశారు. అమెరికా నాసా ‘అపోలో’ ప్రయోగం ద్వారా సుసాధ్యమైన ఈ ఘటనకు ఇవాళ్టికి 52 ఏళ్లు పూర్తైంది. అంతేకాదు ఆ ఘట్టానికి గుర్తుగా ఇవాళ ‘మూన్ డే’ కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఆ ఫీట్ నిజమేనా అనే అనుమానాలు ఎందుకు వినిపిస్తాయో తెలుసా? సాక్షి, వెబ్‌డెస్క్: మొత్తం 24 బిలియన్ల డాలర్ల(ఇప్పటి లెక్కల ప్రకారం.. అది వంద బిలియన్ల డాలర్లపైనే ఉండొచ్చు) ఖర్చుతో నాసా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్ వీ రాకెట్ ద్వారా ‘అపోలో 11 స్పేస్ ఫ్లైట్’ ఫ్లోరిడా మారిట్ ఐల్యాండ్‌లోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. కమాండర్‌గా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, లునార్ మాడ్యూల్ పైలెట్ బజ్ అల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లయిట్లో పయనం అయ్యారు. రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్క్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో. ఉద్వేగభరిత క్షణాలవి.. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్ ఉండగా.. మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయ్యింది ఈగిల్. ఆ విషయాన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్‌కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. సుమారు ఐదు గంటల తర్వాత లునార్ మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్‌స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. “That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET). బజ్ అల్డ్రిన్ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్‌స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. #50thAnniversary 🌚👨🏼🚀👨🏼🚀👨🏼🚀 "That's one small step for man, one giant leap for mankind." ... and #Jump Happy #MoonDay 🌚 &#WorldJumpDay#50thanniversaryofthemoonlanding#LunarLanding#ManOnTheMoon 👨🏼🚀👨🏼🚀👨🏼🚀 pic.twitter.com/t7Ut0ogSN5 — Miguel Velasco (@_miguelvelasco) July 20, 2019 మూన్డేగా గుర్తింపు ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్క్విలిటీ బేస్’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్‌తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అఛీవ్మెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్‌టైం’. ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ మధురక్షణాలకు గుర్తింపు ఉండాలని ప్రత్యేకంగా ఆ రోజును ‘మూన్ డే’గా ప్రకటించారు. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు.. కట్టుకథ.. కౌంటర్లు బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్.. జులై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు. చాలామందికి కలిగిన కామన్ డౌన్ ఏంటంటే.. మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్క్ష్మంగా ఉన్నాయని నాసా వివరణ ఇచ్చింది. ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్ లెన్ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్‌తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన. ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్‌ల్లో ఉన్న వాటి శాంపిల్స్, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్ రీ కన్నియసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికిల్స్ సేకరించిన సాక్క్క్ష్యాలు.. అన్నింటికి మించి రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సాక్క్ష్యం ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట.