breaking news
Mohammed Pervez
-
సైనికాధికారిణిని బెదిరించిన ఐఎస్ఐ ఏజెంట్
న్యూఢిల్లీ: మహిళా సైనికాధికారిని వేధిస్తున్నాడనే ఫిర్యాదుతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తేలటంతో అప్రమత్తమయ్యారు. మహ్మద్ పర్వేజ్(30)అనే వ్యక్తి గత కొంతకాలంగా కల్నల్ స్థాయి అధికారిణికి మార్ఫింగ్ చేసిన అసభ్యకర ఫొటోలను పంపిస్తున్నాడు. బాధిత అధికారిణి సెల్‌ఫోన్ వాట్సాప్‌కు రెండు వేర్వేరు నంబర్లతో పంపిస్తున్నాడు. తనతో మాట్లాడకుంటే వాటిని సోషల్ మీడియాలో ఉంచుతానని బెదిరించాడు. దీంతో ఆమె ఆ రెండు నంబర్లను బ్లాక్‌లో పెట్టింది. అయితే, ఆ వ్యక్తి బాధితురాలి కుమార్తె సెల్‌కు అసభ్యకర మెసేజ్‌లు, మార్ఫింగ్ ఫొటోలు పంపటం మొదలుపెట్టాడు. బెదిరింపులు తీవ్రం కావడంతో బాధితురాలు ఈ నెల 13వ తేదీన ద్వారక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఫేస్బుక్ ప్రొఫైల్, రెండు సిమ్ల ఆధారంగా పర్వేజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పలుమార్లు పాకిస్తాన్‌కు వెళ్లివచ్చినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక విభాగానికి ఈ కేసును అప్పగించారు. ప్రత్యేక విభాగం అధికారులు అతడిని విచారించగా.. పలు దఫాలుగా పాకిస్తాన్ వెళ్లివచ్చానని, కొన్ని సిమ్ కార్డులను పాకిస్తానీయులకు కూడా ఇచ్చానని అంగీకరించాడు. దీంతో అతడికి గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని భావిస్తున్నారు. సైనిక సంబంధ సమాచారం రాబట్టడానికే మహిళా సైనికాధికారిణిని బెదిరింపులకు గురి చేశాడని అనుమానిస్తున్నారు. దీనిపై మరింత పక్కాగా దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ కిరాతకులను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: నగరంలో కలకలం సృష్టించిన కిరాతక స్నేక్ గ్యాంగ్ నిందితులును పోలీసులు పీడీ యాక్టు కింద గురువారం అరెస్ట్ చేశారు. పరీదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక నేరాలకు పాల్పడిన మహమ్మద్ పర్వేజ్(25), తాయబ్ బసాలామా(20)లకు కోర్టు బెయిల్ నిరాకరించింది. స్నేక్ గ్యాంగ్ యువతులను పాములతో బెదిరించి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు 37 మంది యువతులపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పహాడీ షరీఫ్ షాహీన్‌నగర్‌లో స్నేక్ గ్యాంగ్ అనేక అకృత్యాలకు పాల్పడింది. పర్వేజ్ పరీదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో నిందితుడు. తాయబ్ అదే పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసుల్లో ప్రధాన నిందితుడు. నగరంలో అత్యంత ప్రమాదకరమైన నిందితులుగా భావించే వీరిని పీడీ యాక్టు ద్వారా సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.