ఆ కిరాతకులను అరెస్ట్ చేసిన పోలీసులు | Tayab and Pervez in Snake gang Arrest | Sakshi
Sakshi News home page

ఆ కిరాతకులను అరెస్ట్ చేసిన పోలీసులు

Jan 23 2015 3:22 AM | Updated on Sep 2 2017 8:05 PM

స్నేక్ గ్యాంగ్

స్నేక్ గ్యాంగ్

నగరంలో కలకలం సృష్టించిన కిరాతక స్నేక్ గ్యాంగ్ నిందితులును పోలీసులు పీడీ యాక్టు కింద గురువారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: నగరంలో కలకలం సృష్టించిన  కిరాతక స్నేక్ గ్యాంగ్ నిందితులును పోలీసులు పీడీ యాక్టు కింద గురువారం అరెస్ట్ చేశారు. పరీదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక నేరాలకు పాల్పడిన మహమ్మద్ పర్వేజ్(25), తాయబ్ బసాలామా(20)లకు కోర్టు బెయిల్ నిరాకరించింది. స్నేక్ గ్యాంగ్ యువతులను పాములతో బెదిరించి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు 37 మంది యువతులపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 పహాడీ షరీఫ్ షాహీన్‌నగర్‌లో స్నేక్ గ్యాంగ్ అనేక అకృత్యాలకు పాల్పడింది. పర్వేజ్ పరీదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో నిందితుడు. తాయబ్ అదే పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసుల్లో ప్రధాన నిందితుడు. నగరంలో అత్యంత ప్రమాదకరమైన నిందితులుగా భావించే వీరిని పీడీ యాక్టు ద్వారా సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement