breaking news
Mobile police station
-
చైన్ స్నాచర్స్, ఈవ్ టీజర్లకు చెక్!..'శక్తి స్క్వాడ్' ఎంట్రీ
జార్ఖండ్: దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. ఇదే అదనుగా చేసుకుని ఈవ్ టీజర్లు, చైన్ స్నాచర్స్, పోకిరి వెధవలు రెచ్చిపోతుంటారు. అందుకోసం అని ఈ పండుగ సందర్భంగా మహిళల రక్షణ కోసం 'శక్తి స్క్వాడ్' ఏర్పాటు చేస్తున్నట్లు జంషేడ్‌పూర్ పోలీసు అధికారులు తెలిపారు. మహిళలను నిర్భయంగా పూజలు నిర్వహించునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా 'శక్తి స్క్వాడ్' పేరుతో మహిళా మొబైల్ పోలీసు బలగాలు నగరమంతా మోహరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ పోలీస్ ప్రభాత్ కుమార్, జిల్ మెజిస్ట్రేట్ నందకుమార్ శుక్రవారం మహిళల భద్రత కోసం లాంఛనంగా ఈ శక్తి స్క్వాడ్‌ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ శక్తి స్క్వాడ్ సుమారు 25 పింక్ స్కూటీలతో ఈ పండగ సీజన్లో నగరమంతా గస్తీ కాస్తారని అన్నారు. ముఖ్యంగా దుర్గా పూజ కోసం మహిళలు నిర్భయంగా దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో, వారి భద్రత కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఏదైన సమస్య తలెత్తితే పింక్ స్కూటీ పెట్రోలింగ్ సభ్యులు 100కి డయల్ చేయడం లేదా సీనియర్ అధికారులను సంప్రదిస్తారని తెలిపారు. అవసరమనుకుంటే మరింతమంది సిబ్బందిని రంగంలోకి దింపుతామని కూడా చెప్పారు. ఈ పండుగ సీజన్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేగాదు తాము సోష్ల్ మీడియాపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. ఎవరైన అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లు పెట్టడం లేదా ఫార్వార్డ్ చేయడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. (చదవండి: మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు) -
న్యూజిలాండ్ లో తొలి మొబైల్ పోలీస్ స్టేషన్
వెల్లింగ్టన్: ఆ దేశంలో ఏదైనా అన్యాయం జరిగితే అక్కడి ప్రజలు ఇకపై తమ సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషనే ప్రజల చెంతకు వచ్చింది. న్యూజిలాండ్‌లో తొలి మొబైల్ పోలీస్ స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ విషయాన్ని సోమవారం అక్కడి మీడియా వెల్లడించింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా వాహనంలోనే మొబైల్ పోలీస్ స్టేషన్ ప్రజల వద్దకు వెళుతోంది. ఈ మొబైల్ పోలీస్ స్టేషన్.. అందరికి అందుబాటులో ఉంటూ ప్రజాసేవలకు సులభంగా ఉంటుందని సీనియర్ అధికారి డెరక్ ఆర్చెడ్ పేర్కొన్నారు. వెల్లింగ్టన్ వ్యాప్తంగాఈ మొబైల్ పోలీస్ స్టేషన్ నుంచి సేవలు అందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అలాగే ఇలాంటి మరికొన్ని మొబైల్ పోలీస్ స్టేషన్లను ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పారు. ఇక మొబైల్ పోలీస్ విభాగం వెల్లింగ్టన్కు భారీ సంపద లాంటిదని, దాంతో ప్రజలతో మమేకం కావడమే కాకుండా వారికి తక్షణమే సేవలు అందించే సౌలభ్యం ఉంటుందని చెప్పారు. మొబైల్ పోలీస్ స్టేషన్ ప్రక్రియకు సంబంధించి పనులు గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయనీ, అయితే అది ఇప్పటికీ పూర్తి కార్యరూపం దాల్చిందని తెలిపారు. ఇకపై ఎక్కడి వెళ్లాలంటే అక్కడికి వెళ్లి ప్రజలతో మమేకమై, వారి అవసరాలు తీర్చగలమని చెప్పారు. ఇలాంటి మొబైల్ పోలీస్ సేవలు న్యూజిలాండ్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అయినా దీనిపై మరింత విజయం సాధిస్తామని తాము ఆశిస్తూన్నట్టు ఆర్చెడ్ తెలిపారు.