breaking news
MLA Marri Janardhan Reddy
-
గుడిపల్లి లిఫ్ట్–3 మోటార్లు ప్రారంభం
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్/ వనపర్తి : ఎగువ కృష్ణ మ్మ పరవళ్లు తొక్కుతున్న సందర్భంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నీటిని తోడిపోసుకునేందుకు కేఎల్ ఐ (మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథ కం)లో భాగంగా గురువారం గుడిపల్లి థర్డ్ లిఫ్ట్ మోటార్లను ప్రారంభించారు. రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మ ర్రి జనార్దన్‌రెడ్డి, చిన్నారెడ్డి హాజరై మోటార్లను ప్రా రంభించారు. ఈసందర్భంగా నిరంజన్‌రెడ్డి మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఫలితంగానే ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగు నీరు అందించగలుగుతున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆశీస్సులు అం దించాలని కోరారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కావటానికి భారీ నీటి పారుదల శా ఖా మంత్రి హరీశ్‌రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు రాత్రివేళ ఇక్కడే బసచేశారని, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేశారని పేర్కొన్నారు. గతంలో కేఎల్‌ఐకి 25టీఎంసీల నీటి కేటాయింపులే ఉంటే ప్రస్తుతం 40 టీఎంసీలకు పెంచి వరద జలాలు వినియోగించుకునేలా 2015 సెప్టెంబర్‌లో జీఓ తెచ్చామని అన్నారు. వరద జలాలపై ఆధారపడిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నికర జలాలు వినియోగించుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. న్యాయబద్ధంగా కృష్ణానికర జలాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు వంద టీఎంసీలతో పాలమూరు ఎత్తిపోతలను నిర్మించామని అన్నారు. 46వేల చిన్న నీటి చెరువులను నీటితో నింపి సాగునీరు అందిస్తామన్నారు. ఈ ఏడాది కేఎల్ఐ కింద రైతులు రెండు పంటలు వేసుకునే అవకాశం ఉందన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయంపై ప్రేమ ఉందని, గతంలో ప్రాజెక్టులను ఎవరూ పట్టించుకోలేదని, రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు చొరవతో కేఎల్ఐ త్వరితగతిన పూర్తయిందని అన్నారు. కార్యక్రమంలో కేఎల్ఐ ఎస్ఈ భద్రయ్య, ఈఈ రమేష్‌జాదవ్, ఏఈఈ సందీప్‌రెడ్డి, మహ్మద్‌గౌస్, నరేష్, గోపాల్పేట ఎంపీపీ జానకిరాంరెడ్డి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు
-
రేవంత్ అక్రమాస్తులు బయటపెడతాం: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అక్రమాస్తులను బయటపెడతామని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధిననే కనీస ఇంగితజ్ఞానం లేకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తామన్నారు. అలాకాకుండా వ్యక్తిగత ఆరోపణలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడన్నారు. ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో కంపోజర్‌గా ఉండే రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. నిందితుడు భానుకిరణ్‌తో రేవంత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని గువ్వల బాలరాజు ఆరోపించారు.