breaking news
MLA Katasani
-
జగన్ను కలిసిన ఎమ్మెల్యే కాటసాని
-
జగన్ను కలిసిన ఎమ్మెల్యే కాటసాని
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డిని ఈరోజు చంచల్గూడ జైలులో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కలిశారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ సిపిలో చేరిన తర్వాత తొలిసారి జగన్ను కలిశారు. అనంతరం కాటసాని విలేకరులతో మాట్లాడుతూ సమైక్యాంధ్రకు కట్టుబడి పనిచేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ను ప్రజలు జగన్ రూపంలో చూసుకుంటున్నారన్నారు. వైఎస్ పథకాలు ప్రజలకు అందాలంటే అది జగన్ వల్లే సాధ్యం అని చెప్పారు.