breaking news
mla aruri ramesh
-
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా ?
ఆర్టీసీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం పర్వతగిరి : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆర్టీసీ అధికారులపై ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కల్లెడలో పీఏసీఎస్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో తిరిగి హన్మకొండకు వెళ్తుండగా.. అటువైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌పై విద్యార్థులు ప్రయాణించడాన్ని గమనించి బస్సును నిలిపివేయించారు. ఇలా ఎందుకు ఎక్కారని విద్యార్థులను ప్రశ్నించగా, బస్సులు సమయానికి రావని, తమను ఆర్టీసీ అధికారులు చులకనగా చూస్తారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కొన్నిసార్లు బస్సు కూడా ఆపరని చెప్పారు. దీంతో ఆయన హన్మకొండ డీఎంతో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
రంగశాయిపేట(వరంగల్): వరంగల్ జిల్లా రంగశాయిపేట మండలంలోని శ్రీసాయినగర్‌కాలనీలో సీసీ రోడ్డు పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షల విలువైన రోడ్డు పనులను విడుదల చేయించినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఆ కాలనీలో నిర్వహించిన ముగ్గులు పోటీలు, ఆటల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా స్థానిక జడ్పీటీసీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.