breaking news
Mitchell
-
కోహ్లికి సాంట్నర్ సవాల్ పైచేయి ఎవరిది?
-
కాలి వేలే.. చేతి వేలైంది..
సిడ్నీ: ఆస్ట్రేలియా వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఓ వ్యక్తి ప్రమాదంలో చేతి బొటన వేలు కోల్పోగా అతని కాలి బొటన వేలును చేతి బొటన వేలుగా అతికించారు. పెర్త్‌కు చెందిన జాక్ మిచెల్(20) పశువుల కాపరి. అతను పనిచేస్తున్న ఫౌంహౌస్‌లో ప్రమాదవశాత్తు వేలును కోల్పోయాడు. వేగంగా దూసుకొచ్చిన ఎద్దు మిచెల్‌ను ఢీకొట్టింది. ఆ దాటికి అతని బొటన వేలు ఊడి కిందపడింది. ఇక అతని స్నేహితులు ఊడిన వేలుని ఐస్ మధ్య ఉంచి అతన్ని ఆసుపత్రికి తరలించారు. పెర్త్ డాక్టర్లు అతని వేలు అతికించడానికి శత విధాల ప్రయత్నించారు. రెండు సర్జరీలు కూడా చేశారు. అయినా ఆ వేలు అతకపోవడంతో తదుపరి చికిత్సకు సిడ్నీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని సూచించారు. అవసరమైతే కాలి బొటన వేలిని చేతికి అతికించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి మిచెల్ అంగీకరించడంతో సిడ్నీ డాక్టర్లు విజయవంతంగా కాలి వేలిని చేతికి అతికించారు. -
జాన్సన్ స్థానంలో స్టార్క్
సిడ్నీ: తొడ కండరాల గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ స్థానంలో మిషెల్ స్టార్క్ ను తీసుకున్నారు. ఈ ఒక్క మార్పుతోనే ఆసీస్ జట్టు బరిలోకి దిగనుందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత వారం జరిగిన మూడో టెస్టులో 33 ఏళ్ల జాన్సన్ గాయపడ్డాడు. ఉదర సమస్యతో బాధపడుతున్న ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కోలుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-0తో గెల్చుకున్న సంగతి తెలిసిందే.