breaking news
mishel obama
-
‘మేడమ్ ఎక్కడా!!’?
స్త్రీ పక్కన ఉంటే పురుషుడికి లభించే గౌరవమే వేరు! సీఎం అయినా, పీఎం అయినా, చక్రవర్తే అయినా. అంతవరకు ఎందుకు.. మనం వెళ్లే ఫంక్షన్లలోనే చూడండి.. అతను కనిపించి ఆమె జాడ లేకుంటే... ఠపీమని ‘అమ్మాయేదీ!’ అంటారు. ‘మేడమ్ ఎక్కడా!!’ అని చుట్టుపక్కలకు చూస్తారు. అమెరికా అధ్యక్షుడు కొద్ది గంటల్లో ఇండియాలో దిగుతున్నారు. ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది. సతీమణితో పాటు వస్తున్నారు కనుక సంపూర్ణ గౌరవం ఉంటుంది. ఇప్పటివరకు ఇలా జంటగా కలిసి ఇండియా వచ్చి, భర్తకు అపారమైన గౌరవ మర్యాదలను ప్రసాదింపజేసిన అమెరికా ప్రథమ మహిళల సందర్శన సమయాలు, సందర్భ చిత్రాలు... క్లుప్తంగా, మీ కోసం. 1962 జాక్వెలీన్కెన్నడీ సతీమణి జాక్వెలీన్ 1962లో ఇండియా వచ్చారు. ఇండియాను సందర్శించడం తన కల అని కూడా అన్నారు! ఇండియాలో హోలీ కూడా ఆడారు. 1969 పాట్ రిచర్డ్ నిక్సన్ సతీమణి పాట్ నిక్సన్ 1969లో ఇండియా వచ్చారు. ఒకే రోజు ఉన్నారు. పెద్దగా పర్యటనలేం చెయ్యలేదు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులు అర్పించారు. 1978 రోసలీన్జిమ్మీ కార్టర్ సతీమణి రోసలీన్ కార్టర్ 1978లో ఇండియా వచ్చారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ముగ్ధులయ్యారని అంటారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలను కలిశారు. 1995-1997 హిల్లరీబిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ 1995లో, 1997లో ఒక్కరే ఇండియా వచ్చారు. మొదటిసారి కూతురు చెల్సీతో కలిసి వచ్చారు. రెండోసారిమదర్ థెరిసాఅంత్యక్రియలకువచ్చారు. 2006 లారా జార్జి బుష్ సతీమణి లారా బుష్ 2006లో ఇండియా వచ్చారు. నోయిడాలోని ఫిల్మ్‌సిటీని సందర్శించారు. మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీలో కొంత సమయం గడిపారు. హైదరాబాద్ కూడా వచ్చారు. 2010- 2015 మిషెల్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా 2010లో, 2015లో ఇండియా వచ్చారు. మహిళా సంక్షేమం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను సందర్శించారు. బాలలతో కలిసి డాన్స్ చేశారు. -
మిషెల్ కోసం వంద బెనారస్ చీరలు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజక వర్గం వారణాసి ఎదురుచూస్తోంది. ప్రధాని విజ్ఞప్తి మేరకు అక్కడి ప్రజలు మిషెల్ ఒబామా కోసం 100 చీరెలను సిద్ధంగా ఉంచారు. చీరల రూపకర్తల్లో ఒకరైన ఆసిఫ్.. మిషెల్ ఒబామా కోసం లక్షా ఇరవై అయిదువేల విలువచేసే చీరను రూపొందించారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్వయంగా పర్యవేక్షణలో వీటిని రూపొందించారు.