breaking news
Minister harisrao
-
ఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాలుడే..
- ఉప ఎన్నికకు అభ్యర్థి ప్రకటన - భూపాల్‌రెడ్డి పేరు ఖరారు - కార్యకర్తల భేటీలో మంత్రి హరీశ్‌రావు ప్రకటన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ‘కారు’ దూకుడు పెంచింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఏకగ్రీవం చేసుకొని జోరు మీదున్న టీఆర్ఎస్.. వచ్చే నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.భూపాల్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. గురువారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కల్హేల్ మండలం సత్యపూర్ చౌరస్తా వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడతూ.. భూపాల్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పార్టీకి విశ్వాసపాత్రుడు వచ్చే నెల (కొత్త సంవత్సరం) మొదటి, రెండో వారాల్లో శాసనసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని రాజకీయ పార్టీల అంచనా. ఈ మేరకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో నారాయణఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన భూపాల్‌రెడ్డి 14746 ఓట్ల తేడాతో దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డిపై ఓటమి పాలయ్యారు. కిష్టారెడ్డికి 62,347 ఓట్లు రాగా, భూపాల్‌రెడ్డికి 47,601 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం భూపాల్‌రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కిష్టారెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ టికెట్ టికెట్ కోసం టీఆర్ఎస్ నుంచి పలువురు పోటీపడ్డారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకొని ఉన్న భూపాల్‌రెడ్డిపైనే మంత్రి హరీశ్‌రావు విశ్వాసం ప్రకటించారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా భూపాల్‌రెడ్డికే మరోసారి అవకాశమివ్వాలని హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. పేరు: మహారెడ్డి భూపాల్‌రెడ్డి పుట్టిన తేదీ: 7.5.1960 స్వగ్రామం: ఖానాపూర్ (కె)- (కల్హేర్ మండలం) విద్యార్హతలు: బీఎస్సీ, హైదరాబాద్ ఏ.వీ కళాశాల (ప్రాథమిక స్థాయి నుంచి హైదరాబాద్‌లోనే విద్యాభ్యాసం) తల్లిదండ్రులు: స్వర్గీయ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే- ఎం.శకుంతల, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ భార్య, సంతానం: భార్య జయశ్రీరెడ్డి, కుమారుడు రోషన్ మహారెడ్డి, కుమార్తె శ్రేయారెడ్డి నిర్వహించిన పదవులు.. 1990 నుంచి కల్హేర్ మండలం కృష్ణాపూర్ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా రెండుసార్లు ఎన్నిక. డీసీసీబీ డెరైక్టర్‌గా, డీఎంఎస్ వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు టీడీపీ కల్హేర్ మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు 2008లో టీడీపీ నుండి టీఆర్ఎస్లో చేరి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న ఈయన సివిల్ కాంట్రాక్టర్ -
గుంతలేంది...
- మిషన్ కాకతీయ పనులపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం - చెరువు పూడికతీక పనుల పరిశీలన - గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన దుగ్గొండి/నర్సంపేట/గీసుకొండ/నెక్కొండ/చెన్నారావుపేట : చెరువులో గుంతలేంది.. పాత గుంతలు కలిపేశారా.. మొరం కోసం తీసిన భారీ గుంతలను ఎందుకు పూడ్చలేదు. గుంతల్లో పడి ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే బాధ్యులెవరూ.. తూముకు సరిగ్గా ప్లాస్టరింగ్ చేయలేదు..కారణం ఏమిటంటూ అధికారులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గుంతలు పూడ్చి సమానం చేయాలని ఆదేశించారు. దుగ్గొండి, నర్సంపేట, గీసుకొండ, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువుల అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నర్సంపేటలో జరిగిన కార్యక్రమంలో ఐబీ రాష్ట్ర అధికారులు వుురళీధర్, ఎస్ఈ పద్మారావు, డీఈ సుదర్శన్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆర్డీఓ రావుకృష్ణారెడ్డి, తహసీల్దార్ జివాకర్‌రెడ్డి, రారుుడి రవీందర్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నారుుని నర్సయ్యు, కావుగోని శ్రీనివాస్, దార్ల రవూదేవి, గుంటి కిషన్, గుడిపూడి అరుణారాంచందర్, వేవుులపల్లి ప్రకాశ్‌రావు, వేల్పుల లింగయ్యు పాల్గొన్నారు. గీసుకొండలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పోలీస్ ధర్మారావు, పూండ్రు జయపాల్‌రెడ్డి, అర్బన్ కమిటీ అధ్యక్షుడు చింతం సదానందం, వైస్ ఎంపీపీ కామని భాస్కర్, మండల నాయకులు గోలి రాజయ్య, మాధవరెడ్డి, వీరాటి రవీందర్‌రెడ్డి, వెంకట్రాజం, సర్పంచ్‌లు జక్కు మురళి, కొంగర చంద్రమౌళి పాల్గొన్నారు. నెక్కొండలో జరిగిన కార్యక్రమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ దొనికెన సారంగపాణి, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ ఇబ్రహీం, షేక్ అబ్దుల్నభి, నెక్కొండ సర్పంచ్ కందిక విక్టోరియా, ఎంపీటీసీ బానోత్ ధాని, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుంటుక సోమయ్య, యూత్ అధ్యక్షుడు బొడ్డుపల్లి అజయ్, పట్టణ అధ్యక్షుడు రావుల నర్సింహారెడ్డి, నాయకులు తాళ్ళూరి లక్ష్మయ్య, మారం రాము, కర్పూరపు సంపత్‌కుమార్, తాటిపల్లి శివకుమార్, గరికపాటి క్రిష్ణారావు, పలుసం విశ్వనాధం, చల్లా వినయ్‌రెడ్డి, రామారపు భద్రయ్య, పుండరీకం, విద్యాసాగర్, మూసిని మాధవ్, పొడిశెట్టి సత్యం, జమన్జ్యోతి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. చెన్నారావుపేటలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ బొవ్మునపెల్లి గణేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వూజీ వుంత్రి తాటికొండ రాజయ్యు, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, కలెక్టర్ వాకాటి కరుణ, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, జెడ్పీ చైర్పర్సన్ పద్మ, ఆర్టీఓ రావుకృష్ణారెడ్డి, డీఎస్పీ వుురళీధర్, కంది కృష్ణారెడ్డి, ఎంపీడీఓ లక్ష్మీప్రన్న, తహసీల్దార్ ఆంజనేయుులు, డీఈ సుదర్శన్‌రావు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్నొన్నారు. కాగా, చెరువుల అభివృద్ధి విరాళం అందజేసిన దొడ్డ మోహన్‌రావును వుంత్రి ఘనం గా సన్మానించారు.