breaking news
the minister
-
అలీసాగర్, గుత్ప వైఎస్ చలువే
మల్లన్నసాగర్ నిర్మాణం ఆచరణలో అసాధ్యం ప్రభుత్వం భేషజాలకు పోవద్దు భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి బోధన్ : వైఎస్ హయాంలోనే అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పనులు చేపట్టడం జరిగిందని, నా ఆలోచనతోనే అలీసాగర్ బ్యాక్‌వాటర్ పథకాన్ని రూపకల్పన చేశానని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బోధన్ ప్రజలకు తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించాలని గోదావరి జలాలను బెల్లాల్ చెరువుకు మళ్లించే పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. శనివారం మండలంలోని అమ్దాపూర్ శివారులో నిజాంసాగర్ ప్రాజెక్టు డి–40, చింతకుంట వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టు మెయిన్ కాలువ వద్ద డి–40 కాలువ నీటి మళ్లింపు పాయింట్లను మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితి వల్ల గోదావరి నదిలో నీళ్ల లేక ఈ పథకం ద్వారా నీటి సరఫరా జరగలేదన్నారు. ప్రసుత్తం వర్షాలు కురిసి గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ప్రవహించడంతో ఎత్తిపోసిన నీటిని అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా బెల్లాల్ చెరువుకు తొలిసారిగా నీటి సరఫరా ఐదు రోజులుగా కొనసాగుతోందన్నారు. అలీసాగర్బ్యాక్వాటర్ ద్వారా బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యంతో పాటు ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా నిజామాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా అవుతున్నాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలు చేపట్టడం జరిగిందని, అలీసాగర్ కింద 53 వేల ఎకరాలు, గుత్ప పథకం కింద 38 వేల ఎకరాలకు సాగునీరందుతోందన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే నిజాంసాగర్ కాలువల ఆధునికీకరణకు రూ. 500 కోట్లు మంజూరు కాగా పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోవద్దు బోధన్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ అంశంలో ప్రభుత్వం భేషజాలకు, ఒంటెద్దు పోకడలకు వెళ్లొదని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ప్రాజెక్టు పనుల్లో రాజకీయాలొద్దన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరుతో జిల్లా రైతాంగాన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. గోదావరి జలాల వినియోగంలో నీటి నిపుణులు, మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపుతామనే ప్రభుత్వ ఆలోచన సరైంది కాదన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 112 కిలో మీటర్ల దూరంలో ఎత్తు ప్రాంతంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కడెం ప్రాజెక్టుకు సుమారు 40 టీఎంసీ నీళ్లు వెళ్తున్నాయని, కడెం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని మళ్లిస్తే అతి తక్కువ ఖర్చుతో సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. -
కోట్లకు అధిపతి కాకూడదా?
నగర కార్యదర్శి, నగర పాలక సంస్థ చైర్పర్సన్లు వంద కోట్ల మేరకు ఆస్తి కలిగి ఉంటే తమ అధినేత్రి జయలలిత కోట్లకు అధిపతి ఎందుకు కాకూడదంటూ మంత్రి కేసీ వీరమణి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అవినీతి తాండవం చేస్తోందని, ప్రతి పనికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఏకంగా మంత్రులు ఏ మేరకు అక్రమార్జన సాగిస్తున్నారో చిట్టాలను సైతం ప్రకటిస్తూ వస్తున్నాయి. మరికొన్ని పార్టీలు అయితే ఫలాన అధికార పక్షం నేతకు వద్ద ఇన్ని కోట్లు ఉన్నాయని, ఫలాన నేత ఈ నాలుగేళ్లలో ఇన్ని కోట్లు సంపాదించాడని ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బాధ్యత కల్గిన పద విలో ఉన్న మంత్రి ఏకంగా ప్రతిపక్షాల ఆరోపణల్ని సమర్థించే రీతిలో కోట్లు, అధిపతి అంటూ ప్రస్తావించడం అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. గుడియాత్తంలో అన్నాడీఎంకే సర్కారు నాలుగున్నరేళ్ల ప్రగతిని చాటుతూ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గుడియాత్తం నగర కార్యదర్శి జెకేఎన్ పళని నేతృత్వంలో అక్కడి బస్టాండ్ ఆవరణలో సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి కేసీ వీరమణి, పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ హాజరయ్యారు. కేసీ వీరమణి మాట్లాడుతూ గుడియాత్తం నగర పార్టీ కార్యదర్శి జేకే ఎన్ పళని, నగర చైర్ పర్సన్ అముదాలు వంద కోట్ల ఆస్తిపరులుగా పేర్కొనడంతో సభలో ఒక్కసారిగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్యదర్శి, చైర్పర్సన్లే వంద కోట్ల ఆస్తి పరులుగా ఉంటే తమ అధినేత్రి, అమ్మ జె జయలలిత కోట్లకు అధిపతిగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఇంతలో నాంజిల్ సంపత్ అందుకుని వంద కోట్ల ఆస్తి పరుడు ఇక్కడ కార్యదర్శిగా పార్టీకి సేవల్ని అందించడం బట్టి చూస్తే ఏ మేరకు వారు దోపిడీకి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రి కేసీ వీరమణి వ్యాఖ్యలను అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణిం చాయి. ఈ వ్యాఖ్యలపై అమ్మ ఎలా స్పందిస్తారనే చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో అతనిపై చర్యలు తప్పవని అంటున్నారు.