ఏపీ నర్సు కిడ్నాప్?
కేకే నగర్ (చెన్నై): తమిళనాడులోని నీలాంగరైలో విహార యాత్రకు వెళ్లిన ఓ నర్సు అదృశ్యం కావడంతో ఆమె అపహరణకు గురైందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలకు చెందిన మెర్సీసాయి (23) చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న హాస్టల్లో బస చేసి ఉంటోంది.
వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో హాస్టల్లో బసచేసిన యువతులు 90 మంది ముట్టుకాడు తదితర ప్రాంతాలకు విహార యాత్రకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వారిలో మెర్సీ కనిపించలేదు. వెంటనే కానత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.