పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే లోపే..
బహదూర్‌పురా(హైదరాబాద్): భర్తతో గొడవ పడిన ఓ మహిళ నెహ్రూ జూలాజికల్ పార్కులోని మీరాలం చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన మోసీనా పర్వీన్(40), అబ్దుల్ అన్నాన్ దంపతులు. కొన్ని సంవత్సరాలుగా మోసీనా పర్వీన్‌తో భర్త అబ్దుల్ అన్నాన్ ‘అంటిముట్టనట్లు’గా ఉంటున్నాడు.
దీనిపై కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శనివారం స్టేషన్‌కు వచ్చింది. ఫిర్యాదును విన్న పోలీసులు భర్తతో కలిసి ఉండాలంటూ సర్ది చెబుతూ కౌన్సెలింగ్ ఇచ్చే లోపు పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి వెళ్లి నేరుగా జూపార్కు చెరువుకు వెళ్లింది. అక్కడ చెరువులో దూకేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న జూ సిబ్బంది అప్రమత్తమై పర్వీన్‌ను బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. దీంతో పర్వీన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.