breaking news
mds Counseling
-
ఎండీఎస్ కౌన్సిలింగ్‌పై హైకోర్టు ఆదేశాలు
-
ఎండీఎస్ కౌన్సిలింగ్‌పై హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్: ఎండీఎస్ కౌన్సిలింగ్‌పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎండీఎస్ కీలో తప్పులపై విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. కీలో 7 ప్రశ్నలకు తప్పుడు జవాబులిచ్చినట్లు విద్యార్థులు కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ లేదా విజయవాడలో ఉన్న ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు కీని నివేదించాలని కోర్టు ఆదేశించింది. సంబంధిత ప్రొఫెసర్ లేదా హెచ్ఓడీలతో మరోసారి అభ్యంతరాలను పరిశీలించాలని కోర్టు తెలిపింది. ఈ వ్యవహారం తేలాకే కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రేపటి నుంచి జరగవలసిన ఎండీఎస్ రెండో విడత కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. -
ఎస్టీ ఫస్ట్ ర్యాంకర్‌కు దక్కని సీటు
సీమాంధ్రకు చెందిన మూడో ర్యాంకర్‌కు ఉస్మానియాలో సీటు ఎండీఎస్ కౌన్సెలింగ్‌లో వివాదం విజయవాడ/హైదరాబాద్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎండీఎస్ కౌన్సెలింగ్‌పై ఆరోపణలు మొదలయ్యాయి. ఎస్టీ కేటగిరీలో తొలి ర్యాంక్ సాధించిన విద్యార్థినికి సీటు రాకపోవడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే మెడికల్ పీజీ పరీక్ష, కౌన్సెలింగ్ విషయంలో అనేక అపవాదులు మూటగట్టుకున్న వర్సిటీ అధికారులు.. తాజాగా ఎండీఎస్ కౌన్సెలింగ్ విషయంలోనూ నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. గత నెల 27, 28 తేదీల్లో విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎండీఎస్ కౌన్సెలింగ్ జరిగింది. ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో మొదటి స్థానంలో ఉన్న డాక్టర్ ప్రవీణ నాయక్ ప్యూరో డాంటిస్ట్రీ కోర్సులో సీటును ఆశించారు. అయితే అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఆ సీటును మరొకరితో భర్తీ చేయడంతో.. ఆంధ్రా వర్సిటీ పరిధిలో ప్రవీణకు సీటు ఇవ్వడానికి కౌన్సెలింగ్ అధికారులు నిరాకరించారు. ఆంధ్రావర్సిటీ పరిధిలో ఎస్టీ కేటగిరీలో సీటు ఉన్నప్పుటికీ దాన్ని ఇప్పటికే స్థానిక విద్యార్థికి కేటయించామని.. నాన్‌లోకల్ అయిన ప్రవీణకు సీటు ఇవ్వడం కుదరదని వారు తేల్చిచెప్పారు. మరోవైపు ఉస్మానియా పరిధిలోనూ ఎస్టీ కేటగిరీలో మూడో ర్యాంకర్‌కు, అదీ సీమాంధ్ర విద్యార్థికి సీటు కేటాయించారని, తన కన్నా తక్కువ ర్యాంకు వచ్చిన వారికి ఎలా అడ్మిషన్ ఇస్తారంటూ ప్రవీణ అభ్యంతరం తెలిపారు. తనకు న్యాయం చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మంగళవారం కలిసి వేడుకున్నారు.