బస్టాండ్లో 5జీ వై-ఫై
విజయవాడ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పొంతలు తొక్కుతున్న తరుణంలో ఇంటర్నెట్ వినియోగం కూడా నిత్య అవసరంగా మారింది. దాంతో ఎక్కడైనా నెట్ వినియోగించుకోనేందుకు వీలుగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. తక్కువ ధరకే వై-ఫై ఫీచర్లతో మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ 2జీ, 3జీ, 4జీ వైఫై సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా 5జీ వైఫై సేవలను అందుబాటులోకి తేచ్చేందుకు ఏపీయస్ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. అందులోభాగంగానే విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో 5జీ వైఫై సేవలను ప్రారంభించారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు సోమవారం పండిట్ నెహ్రూ బస్టాండ్లో 5జీ వైఫే సేవలను ప్రారంభించారు. ప్రతి వినియోగదారుడు తొలి 15 నిమిషాలు వరకు వైఫై సేవలను ఉచితంగా వినియోగించునే సదుపాయాన్ని కల్పించినట్టు తెలిపారు.