breaking news
marriage wedding
-
వీడియో: వెడ్డింగ్ ఫొటో షూట్లో మిస్ ‘ఫైర్’
ప్రస్తుత జనరేషన్లో ఏదీ చేయాలన్నా డిఫరెంట్‌గా ఉండాలని యూత్ కోరుకుంటున్నారు. అలా చేసి ప్రమాదాలను కోరి మరీ తెచ్చుకుంటున్నారు. వివాహా వేడుకలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయాలని ఢిఫరెంట్‌గా ఫొటో షూట్ (Photo Shoot) తీసుకుందామన్నారు. కానీ, ఆ నిర్ణయం వధువు పాలిట శాపమైంది. కలర్ బాంబ్ కారణంగా వధువు తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో భారత సంతతి పెళ్లి జంటకు చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. భారత సంతతి విక్కీ, ప్రియా జంట తమ వివాహం కోసం కెనడా (Canada) నుంచి స్వదేశానికి వచ్చారు. ఘనంగా వివాహ వేడుక జరుగుతోంది. ఈ వేడుకను తిలకించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో వివాహ వేడుక రోజున.. వధువరులిద్దరూ డిఫరెంట్‌గా ఫొటో షూట్ తీసుకోవాలనుకున్నారు. దీనికి ప్రత్యేకంగా కలర్ బాంబ్లను వాడాలని డిసైడ్ అయ్యారు. వీరిద్దరూ ఫొటోలు దిగుతుంటే అక్కడున్నంతా వారంతా ఎంజాయ్ చేస్తున్నారు.ఇంతలోనే వధువరులిద్దరూ వీడియో కోసం ఫోజులిస్తున్నారు.. అటు నుంచి కెమెరామెన్.. రెడీ.. అనగానే.. వధువును వరుడు ఎత్తుకున్న సమయంలో వారి పక్కనే స్పెషల్ ఎట్రాక్షన్ కోసం ఏర్పాటు చేసిన కలర్ బాంబ్ ఒక్కసారిగా పేల్చింది. సూపర్‌గా వచ్చింది అనుకునేలోపే.. బాంబు నుంచి మంటలు వచ్చి.. వధువును అంటుకున్నాయి. మంటల కారణంగా ఆమె జుట్టు.. వెనుక భాగం కాలిపోయింది. మంటలకు బాడీ కమిలిపోవడంతో వధువు విలవిల్లాడిపోయింది. దీంతో, ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, పెళ్లిళ్లలో బాణాసంచా పేల్చడం సహజమే. కానీ, జాగ్రత్తలు అవసరం.. ఏది శృతి మించినా అది ప్రమాదానికి దారి తీస్తుంది. తమలా ఎవరూ చేయవద్దని.. ఒకవేళ ఫొటోషూట్లు చేసుకున్నా జాగ్రత్తలు తీసుకోవాలని జంట విక్కీ, ప్రియా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను 22 మిలియన్ల మంది వీక్షించారు. ఆమె వెంటనే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని యథావిధిగా పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇక వీడియోను వీక్షించిన నెటిజన్లు.. వధువు పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని వివాహ బంధాన్ని ఆస్వాదించాలని కోరారు. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు. View this post on Instagram A post shared by Vicky & Piya ♡ Luxury Travel Couple (@viaparadise) -
ఛీ నువ్వు మోసగాడివి: ఆగిన పెళ్లి
► విదేశాల్లో ఉద్యోగాల పేరిట రూ.లక్షలు వసూలు చేసిన పెళ్లి కుమారుడు ► పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ► సమాచారం తెలుసుకొని గంట ముందు పెళ్లి నిరాకరించి వెళ్లిపోయిన వధువు, ఆమె తల్లిదండ్రులు ఒంగోలు క్రైం: విదేశాల్లో ఉద్యోగం.. నెలకు మూడు లక్షల జీతం. మంచి సంబంధం...బిడ్డ సుఖపడుతుందనుకున్నారు. భారీ కట్నం, అధిక మొత్తంలో లాంఛనాలు..వధువు, వరుడి తరఫు వారు అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శుక్రవారం ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లో ఖరీదైన కల్యాణ మండపంలో పెళ్లి. ఉదయం 11 గంటలకు ముహూర్తం. పెళ్లికి ఒక గంట ముందు ఎన్ఆర్ఐ అల్లుడి బాగోతం బట్టబయలైంది. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసి మోసగించిన అతని వ్యవహారం తెలుసుకొని వధువు తల్లిదండ్రులు విచారించుకున్నారు. వారికి వచ్చిన సమాచారం వాస్తవమేనని తెలుసుకొని ముందు ఇచ్చిన అడ్వాన్స్‌లు, లాంఛనాల సంగతి దేవుడెరుగు..ఆడపిల్ల భవిష్యత్తు ముఖ్యమనుకుని పీటల మీద పెళ్లిని అర్ధంతరంగా ఆపేసి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ నాలుగో లైన్లో నివాసం ఉంటున్న పులిచర్ల కళ్యాణ్‌రెడ్డి మలేషియాలో ఉద్యోగం చేస్తున్నానంటూ చీమకుర్తికి చెందిన ఓ యువతితో వివాహం కుదుర్చుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లోని ఓ కళ్యాణ మండలంలో వివాహం. అయితే గురువారమే పులిచర్ల కళ్యాణ్‌రెడ్డి సింగపూర్, మలేషియాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఐదుగురు వద్ద రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడంటూ ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో అదేరోజు సాయంత్రం వన్‌టౌన్ పోలీసులు కళ్యాణ్‌రెడ్డిని, అతని కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించారు. అతని పాస్‌పోర్ట్, ఏఏ దేశాలు తిరిగింది అన్ని వివరాలు ఒంగోలు వన్‌టౌన్ సీఐ ఎండ్లూరి రామారావు రాబట్టారు. బాధితుల్లో ఒంగోలుకు చెందిన మున్నా, శ్రీకాంత్, అశోక్ రెడ్డి, శ్యామ్యూల్, దౌలత్‌లు ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా బాధితులు ఉన్నారని అతని చేతిలో మోసపోయిన వారు చెబుతున్నారు. గురువారం నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే మరో గంటలోపే పెళ్లి ఉందనగా శుక్రవారం ఈ సమాచారం పెళ్లి మండపంలోని పెళ్లి కుమార్తెకు, ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. అప్పుడు హడావిడిగా అసలు ఏం జరిగిందోనని పోలీస్ స్టేషన్‌కు వచ్చి వధువు తండ్రి విచారించుకున్నారు. విషయం తెలుసుకుని పెళ్లి ఆపేసి కుమార్తెను తీసుకుని స్వగ్రామం చీమకుర్తికి వెళ్లిపోయారు. లక్షల రూపాయల డబ్బులిచ్చిన మోసపోయిన బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ నాయకులు నిలిచి వారికి న్యాయం చేయాలని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశారు.