breaking news
Manmohan vydya
-
సామాజిక పరివర్తనే సంఘ్ లక్ష్యం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపితమై నూరేళ్లకు చేరువవుతోంది. అప్పటి నుంచీ అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తూనే ఉంది. నేడు సంఘ్ కార్యకలాపాలు ‘శాఖ’ రూపంలో 90 శాతం బ్లాకులకు చేరుకున్నాయి. 35కు పైగా సంస్థలు సమాజ జీవనానికి చెందిన వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నాయి. ‘దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో స్వయంసేవక్‌ను అయ్యాను’ అనే ప్రతిజ్ఞను స్వయంసేవక్ చేస్తారు. సంఘ్ కార్యాచరణ దిశగా ముందుకు సాగుతూ సంఘ్ కార్యాన్ని సంపూర్ణత్వం వైపుకు తీసుకువెళ్ళడమే శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఉపకరించే ఉత్తమ మార్గం అవుతుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపన జరిగి 100 సంవత్సరా లకు చేరువ అవుతున్నది. 1925లో నాగపూర్‌లో సంఘ్ స్థాపన జరిగింది. ఈ సంవత్సరం విజయదశమి నాటికి సంఘ్ ప్రారంభమై 97 సంవత్సరాలు పూర్తవుతాయి. కార్యకర్తల కృషి, త్యాగం, బలి దానాల ఫలితంగా... అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తున్నది. ఈ కారణంగానే అంతటా సంఘ్ గురించిన చర్చ జరుగుతున్నది. సంఘ్ తన శతాబ్ది వేడుకలను ఎలా జరుపుకుంటుందనే ఆసక్తి సైతం ప్రజల్లో నెలకొంది. నిజానికి సంఘ్ శతాబ్ది వేడుకలు నిర్వహించాలనే ఆలోచన లేదు. సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ దృష్టి చాలా స్పష్టమైనది. సంఘ్ సమాజంలో ఒక సంస్థ మాత్రమే కాదు, యావత్ సమాజాన్ని సంఘటితం చేసేది. సంఘ్ ఒక సంపూర్ణ సమాజం. సంఘ్ సాధనను సమాజమంతటా విస్తరింపజేయడం లక్ష్యంగా ఉండాలి. సంఘ్ రజ తోత్సవం సైతం జరుపుకోరాదని హెడ్గేవార్ చెబుతుండేవారు. అంతకుమునుపే కార్యాన్ని పూర్తి చేయాలనే ఆశయంతో పూర్తి శక్తి యుక్తులతో నిమగ్నమయ్యారు. కానీ వారికి కేవలం 15 సంవత్సరాల సమయం మాత్రమే లభించింది. కనుక శతాబ్ది సంవత్సరానికి ముందే సంఘ్ కార్యాన్ని పూర్తి చేయడమే లక్ష్యమై ఉండాలి. సంఘ్ కార్య విస్తరణ యాత్రలో నాలుగు దశలు ఉన్నాయి. సంఘ్ స్థాపన నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు మొదటి దశగా భావిం చాలి. ఈ దశలో ఏక చిత్తంతో, ఏకాగ్రతతో కేవలం ‘సంఘటన’పై మాత్రమే దృష్టి పెట్టింది. ఎందుకంటే హిందూ సమాజం సంఘటి తమవుతుంది; ఒకే మనస్సుతో, ఒకే స్వరంతో భారత్ గురించి, హిందుత్వ గురించి మాట్లాడగలము అనే ఒక విశ్వాసాన్ని పాదు గొల్పడం అప్పుడు ముఖ్యం. అందుకనే ఆ లక్ష్యం కోసమే యావత్ కార్యం సాగింది. ‘స్వ’ ప్రేరణగా కొనసాగిన స్వరాజ్య ఉద్యమం ఆధారంగా... విద్య, విద్యార్థి, రాజకీయం, కార్మికులు, వనవాసీ సమాజం, వ్యవసాయం తదితర రంగాల్లో భారతదేశపు శాశ్వతమైన జాతీయ దృక్పథానికి ప్రభావితమై వివిధ సంస్థలు ఆవిర్భవించాయి. నేడు సంఘ్ కార్యకలాపాలు ‘శాఖ’ రూపంలో 90 శాతం బ్లాకులకు చేరుకున్నాయి. 35కు పైగా సంస్థలు సమాజ జీవనానికి చెందిన వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నాయి. సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్రలో మూడవ దశ డాక్టర్ హెడ్గేవార్ జయంతి శతాబ్దిని పురస్కరించుకొని 1990లో ఆరంభ మైంది. యావత్ సమాజం ఆత్మీయత, ప్రేమ ప్రాతిపదికన సంఘ టితం కావాలి. అందుకు సమాజంలో వంచితులు, దుర్బలులు, వెనుకబడిన వర్గాలు, కనీస సౌకర్యాలకు నోచుకోకుండా జీవించే వారిని చేరుకొని వారికి సహాయం, సేవ చేయడాన్ని ఒక బాధ్యతగా భావించాలి; వారి సమగ్రాభివృద్ధి ధ్యేయంగా 1990లో ‘సేవా విభాగ్’ ఆరంభమయ్యింది. ‘దేశపు సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో స్వయంసేవక్‌ను అయ్యాను’ అనే ప్రతిజ్ఞను స్వయంసేవక్ చేస్తారు. ఈ సర్వతోముఖాభివృద్ధి కార్యాన్ని కేవలం స్వయంసేవక్‌లు మాత్రమే చేయడం లేదు; వారితో మాత్రమే అది సాధ్యం కాదు; సమాజంలోని అనేక మంది ప్రభావశీలురు, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఆకాంక్షించేవారు కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. సమా జంలో అలాంటి ప్రభావశీలుర లక్షణాలు, వారి క్రియాశీలత లాంటి సమాచార సేకరణకు... సంఘ్ భావజాలం, కార్య కలాపాల గురిం చిన సమాచారాన్ని వారికి చేరవేసే దిశగా 1994లో ‘సంపర్క్ విభాగ్’ ఆరంభమైంది. సంఘ్‌లో సభ్యులు కాకున్నా కొన్ని విషయాల్లోనైనా మాతో సారూప్యం ఉన్నవారిని కలిసి ఆలోచనలను పంచుకుంటాం. 2008–09 మధ్యకాలంలో ‘గో–గ్రామ యాత్ర’ మొదలైనప్పుడు అనేక ప్రాంతాల్లోని సర్వోదయ కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. అన్ని విషయాల్లోనూ సంఘ్ భావజాలం, దృక్పథంతో ఏకీభవించక పోయినా అంశాలవారీగా సంఘ్ కార్యకలాపాల్లో పాలుపంచు కుంటున్నారు. అదే విధంగా వివిధ ప్రసార మాధ్యమాలను వినియోగించడం ద్వారా సంఘ్ జాతీయ భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేయడం కోసం, సంఘ్‌పై జరుగుతున్న దుష్ప్రచారానికి దీటుగా జవాబు చెప్పడం కోసం, సంఘ్‌కు చెందిన సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం, సంఘ్ సత్ కార్యాలను సమాజానికి తెలియపరిచే ఉద్దేశ్యంతో 1994లో ‘ప్రచార్ విభాగ్’ ఆరంభమయ్యింది. సంఘ్‌కు చెందిన ఈ మూడు విభాగాలూ (సేవ, సంపర్క్, ప్రచార్) సుదూర ప్రాంతాల ప్రజలకు సంఘ్‌ను చేర్చడం ద్వారా సమాజాన్ని మేల్కొ లిపే కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇదే సమయంలో ‘ధర్మజాగరణ్ విభాగ్’ ద్వారా హిందూ సమాజాన్ని వేరే మతంలోకి మార్చడాన్ని అడ్డుకోవడంతో పాటుగా, మత మార్పిడికి గురైన ప్రజలకు తిరిగి వారిదైన సంస్కృతిలోకి తీసుకు రావడానికీ కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వంపై ఆధాపడకుండా ప్రజలందరూ కలిసికట్టుగా తమ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసుకునే లక్ష్యంగా ‘గ్రామ్–వికాస్’ కార్యక్రమం కూడా ఆరంభమైంది. ఏకత్వంతో కూడుకున్న హిందూ సమాజం వివిధ కులాలుగా మనుగడ సాగిస్తున్నందున... వారిలో అందరూ ఒకటే అనే భావాన్ని తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశ్యంతో ‘సామాజిక్ సద్భావ్’ పేరిట వరుస సమావేశాలు ప్రారంభమయ్యాయి. మన సమాజంలోని అంటరానితనం పేరిట కొన్ని వర్గాలకు విద్య, సౌకర్యాలు, గౌరవ మర్యాదలు దురుదృష్టవశాత్తూ తిరస్కరణకు గురయ్యాయి. ఇది చాలా అన్యాయమైనది. ఈ అన్యాయాన్ని నివారించి, అందరినీ కలిసి కట్టుగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా ‘సామాజిక్ సమరసత’ పని మొదలైంది. భారతీయ దేశీ గోవుల నుంచి మనం పొందే ఉత్పత్తుల్లో ఔషధీయ విలువల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, భారతీయ దేశీ గోవుల సంరక్షణ, సంవర్ధనతోపాటూ ఆవు పేడ ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేపట్టే దిశగా రైతుల శిక్షణ, పర్యవేక్షణ కోసం ‘గోసేవ–గోసంవర్ధన్’ కార్యక్రమం కూడా విజయ వంతంగా సాగుతున్నది. భారతీయ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ‘నేను నుంచి మనం వరకు సాగించే ప్రయాణంలో’ కుటుంబానిది తొలి అడుగు అవుతుంది. వారానికి ఒకసారైనా కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చొని సంస్కృతి వారత్వాలు, సామాజిక పరిస్థితులను జాతీయ దృక్కోణంలో విశ్లేషించుకుని... తమ కర్తవ్యాన్ని నిర్ణయిం చుకోవడానికి సహకరించే ‘కుటుంబ్ ప్రబోధన్‘ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ప్రజల భాగస్వామ్యాన్ని వృద్ధి చేయడం ద్వారా దెబ్బ తిన్న ప్రకృతి సంతులతను పునరుద్ధరించడానికి ‘పర్యావరణ్ సంర క్షణ్’ కార్యక్రమం ప్రారంభమైంది. స్వయంసేవక్‌లు ఈ పనులన్నిం టినీ ‘గతివిధి’ పేరుతో సమాజం ముందుంచి ఆరంభించారు. సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర మూడవ దశలో ఇది ఒక భాగం. ప్రస్తుతం సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర నాల్గవ దశ సాగుతున్నది. దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి స్వయం సేవక్... సంఘ్ కార్యకర్తగా పనిచేస్తాడు. అందువల్ల ప్రతి ఉద్యోగి స్వయంసేవక్ సామాజిక మార్పు కోసం తన ఆసక్తి, సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా రంగంలో సామాజిక పరివర్తన, మార్పు కోసం చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించడమైనది. ప్రస్తుతం ప్రతి ఒక్క స్వయంసేవక్ సమాజ పరివర్తనలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలి. వీటన్నింటి ద్వారా సంఘ్ కార్యాచరణ దిశగా ముందుకు సాగుతూ సంఘ్ కార్యాన్ని సంపూర్ణత్వం వైపుకు తీసుకువెళ్ళడమే శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఉపకరించే ఉత్తమ మార్గం అవుతుంది. వ్యాసకర్త సహ సర్ కార్యవాహ, ఆర్ఎస్ఎస్ -
ఏకాత్మక మానవతా ధర్మమే ధ్యేయం
► ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 2 తీర్మానాలు ► రెండోరోజు భేటీకి హాజరైన బీజేపీ చీఫ్ అమిత్ షా ఘట్కేసర్: ఏకాత్మక మానవతా ధర్మ సాధన, కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తల రాజకీయ హత్యలను ఖండిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సోమవారం రెండు తీర్మానాలు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడలో జరుగుతున్న మూడు రోజుల సమావేశాల్లో రెండోరోజు భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. సమావేశంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 400 మంది ఆరెస్సెస్ ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశ వివరాలను ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య, అఖిల భారతీయ ప్రచార సహప్రముఖ్, కేసరి మలయాళ వారపత్రిక ఎడిటర్ నందకుమార్‌జీ, కేరళ ప్రాంత సహ సంచాలక్ బల్‌రాంజీ విలేకరులకు వెల్లడించారు. ఏకాత్మక మానవతా ధర్మంపై చేసిన తీర్మానం గురించి వారు మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన వనరులను కాపాడుకోకపోతే మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమా దం ఉందన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అవసరాలకు మించి వనరులను కొల్లగొడుతున్నారని, దీనివల్ల ప్రకృతి సమతౌల్యత లోపించి భూతాపం పెరుగుతోందన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవడం హిందూ జీవన విధానంలో ఉందని, దాన్ని ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యా య ఏకాత్మక మానవతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి 51 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దానికి ప్రాధాన్యత ఇస్తూ తీర్మానం చేశామన్నారు. ఏకాత్మక మానవ ధర్మ సాధనకు కృషి చేస్తామన్నారు. మైనారిటీ ఓట్ల కోసమే హత్యలు... కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తల హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని నందకుమార్‌జీ చెప్పారు. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకును కొల్లగొటెందుకు అక్కడి ప్రభుత్వాలు ఆరెస్సెస్ కార్యకర్తలపై దాడులను పట్టించుకోవట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ కార్యకర్తలపై భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నా ప్రభుత్వాల జోక్యంతో అతితక్కువగా కేసు లు నమోదవుతున్నాయని, ఇప్పటివరకు కేవలం 55 కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. 1962 నుంచి కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తలపై సీపీఎం హత్యాకాండ కొనసాగుతుందన్నారు. సీపీఐ సైతం గతంలో దాడులు చేసిందన్నారు. కన్నూర్ జిల్లాలో తమ వారిపై ఎక్కువగా హత్యలు జరిగాయన్నారు. గతంలో ఆరెస్సెస్ కార్యకర్తలను హత్య చేసిన వ్యక్తే ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దాడులను ఆపేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రయత్నిస్తున్నామన్నారు.