Mango area
-
అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?
భారతదేశంలో దాదాపు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 200 కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది.ఇదీ చదవండి: సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?మామిడి తోట పెట్టడానికి కారణం1997లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకోవలసి వచ్చింది. అలాంటి సమయంలో అక్కడ మామిడి తోటను ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోటగా గుర్తింపు తెచ్చింది. ఈ మామిడి తోట ద్వారా ఏడాదికి రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. -
జార్ఖండ్‌లో చెలరేగిన హింస, కర్ఫ్యూ
జంషెడ్ పూర్: రాజస్థాన్‌లోని జంషెడ్‌పూర్‌లో అల్లర్ల చెలరేగడంతో కర్ఫూ విధించారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన బంద్ పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ అనుబంధ సంఘమైన రాష్ట్రీయస్వయం సేవక్ కార్యకర్తలు భారీ ఎత్తున గుమి గూడి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు , ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు వాహనాలను తగులెబట్టారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను ధ్వంసం చేశారు. స్థానికంగా విధ్వంసం సృస్టించిన ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులకు కర్ఫ్యూ విధించారు. ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వదంతులు వ్యాపించడంతో అల్లర్లు చెలరేగాయని పోలీస్ ఉన్నతాధికారి ప్రధాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. అయితే మత్తుమందులకు బానిసలైన కొంతమంది ఉన్మాదుల కారణంగా ఉద్రిక్తత చెలరేగిందని రాష్ట్ర సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు దీనిపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న ప్రదేశాలలో సీఆర్పీఎఫ్ దళాలను, 15 పారా మిలిటరీ దళాలను మోహరించారు. కాగా నగరంలోని మ్యాంగో ఏరియాలో సోమవారం రాత్రి ఈ అల్లర్లకు బీజం పడింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమా చూసి తిరిగి వస్తున్న అమ్మాయిలను వేధించారు. మూడు బైక్‌లపై వచ్చిన కొంతమంది యువకులు అమ్మాయిలపై దాడిచేసి , వారి ముసుగులను తాగేశారు. దీనిని ప్రశ్నించినవారిని కత్తులు, తుపాకీలతో బెదిరించారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలకుచెందిన వారు ఆందోళనకు దిగారు. బాధ్యులను అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ రోడ్లను దిగ్బంధించారు. ఈ సందర్భంగా పోలీసులు ఉద్రిక్తతలను చల్లార్చడానికి నిషేధాజ్ఞలను జారీ చేసినప్పటికి ఫలితం లేకపోయింది. వీరి ఆందోళనకు నిరసనగా భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు బంద్‌కు పిలుపునిచ్చారు.