breaking news
Malladi Venkata Krishna Crime Stories
-
తోడుదొంగ! నమ్మి రహస్యం చెబితే.. అదే వాళ్ల కొంపముంచింది!
నేను తిరిగి వచ్చేసరికి ఆయన నా గది ముందు నాకోసం వేచిచూస్తూ కనపడ్డాడు. నేను తలుపు తాళం తీశాక నన్ను పలకరించాడు.‘‘నీతో మాట్లాడాలి.’’ఆయనవంక తేరిపార చూశాను. ఏభై పైనే ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరం. ముప్పాతిక వంతు బట్టతల. ఐదు అడుగులు మించి లేడు. ఇన్ షర్ట్, టై.‘‘నాతో ఏం పని సార్?’’ సందిగ్ధంగా అడిగాను.‘‘నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు బయటకి వచ్చి ఇవాళ్టికి ఐదో రోజు. మొదటి రెండు రోజులూ నువ్వు గదిలోంచి బయటకి రాలేదు. నీ మిత్రుడే ఫేక్టరీకి వెళ్ళాడు. జైల్లో మూడేళ్ళు ఆల్కహాల్‌కి దూరంగా ఉన్నావు. ఆ అలవాటు ఉన్నవాళ్ళకి దాన్ని తాగాలని ఉంటుంది. అందుకు డబ్బు కావాలి.’’ ఆయన చిరునవ్వుతో చెప్పేది ఆపాడు.‘నా గురించి ఈయన ఇదంతా ఎలా తెలుసుకున్నాడు? నాతో ఏం అవసరం ఈయనకి’ అని ఆలోచించాను. తృప్తికరమైన జవాబు రాలేదు. గదిలోని ఏకైక కుర్చీని చూపించి, నేను గోడకి ఆనించి వేసిన పరుపు చుట్టమీద కూర్చున్నాను. ఆ బీదగదిని చూశాక ఆయన మొహంలో ఏవగింపు కనిపించింది.‘‘నీకో ఏభై వేల రూపాయలు ఇవ్వాలని వచ్చాను.’’ విషయంలోకి వస్తూ ఆయన సూటిగా వచ్చాడు.ఆయన వంక ప్రశ్నార్థకంగా చూశాను.‘‘నువ్వో ఏభై వేల రూపాయలని బేంక్ కేషియర్ నుంచి తీసుకుని, జేబులో పెట్టుకుని నడిచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నిన్నెవరూ అడ్డగించరు.’’‘‘ఏ బేంక్?’’‘‘ఇంపీరియల్ బేంక్.’’‘‘దానివల్ల మీకేం లాభం?’’‘‘అది నీకు అనవసరం. నెహ్రూ నగర్ బ్రాంచ్‌లోని ఆ బేంక్‌కి నువ్వు ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నరకి రా. లంచ్ సమయం కాబట్టి నువ్వు లోపలకి రాగానే తలుపుని అరగంటపాటు మూసేస్తారు. బేంక్ మేనేజర్ గదిలోకి వెళ్ళి రివాల్వర్ చూపించి బెదిరిస్తే ఆయన నగదున్న వాల్ట్‌ని తెరుస్తాడు. అందులో ఏభై వేలుంటాయి. దాంతో నువ్వు వెళ్ళిపోవచ్చు.’’‘‘లేదా పట్టుబడచ్చు. నేను బేంక్ దొంగని కాను.’’ చెప్పాను.‘‘జేబుదొంగవని తెలుసు. కాని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ నిన్నెవరూ అడ్డగించరు. జేబు కొట్టేస్తే పట్టుబడే రిస్క్ ఉంటుంది. జేబుదొంగతనం కన్నా ఇది రిస్క్ లేని చాలా తేలికైన పని.’’‘‘నా వృత్తికి రివాల్వర్ అవసరం లేదు. అది లేదు.’’ఆయన మౌనంగా జేబులోంచి ఓ రివాల్వర్ తీసి ఇచ్చాడు. అందుకుంటే తేలిగ్గా ఉంది. అచ్చం రివాల్వర్లా కనిపించే అది గట్టి నల్ల రబ్బర్‌తో చేసిన ఆటవస్తువని గ్రహించాను.‘‘నేను ఎప్పుడైనా మీ జేబు కొట్టేశానా? అందువల్ల మీకు తీవ్ర నష్టం వచ్చి నన్ను ఇరికించాలని పథకం వేశారా?’’ అడిగాను.ఆయన సన్నగా నవ్వి తల అడ్డంగా ఊపాడు.‘‘లేదు, ఇది పగకి చెందిన పథకం కాదు. జైల్ వార్డెన్ నా ఫ్రెండ్. నీలాంటి వారి గురించి అడిగితే, ఐదు రోజుల క్రితం విడుదలైన నీ గురించి చెప్పాడు.’’‘‘దీనివల్ల మీకు వచ్చే లాభం ఏమిటన్న ప్రశ్నకి నాకు జవాబు కావాలి. అంతదాకా నేను సరే అనలేను.’’ఆయన చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.‘‘అందులో పని చేసే కేషియర్ నా అల్లుడు. కొన్ని రోజులక్రితం ఆ వెధవ నిర్లక్ష్యంగా తీసుకున్న నోట్లు దొంగనోట్లు అని తెలిసింది. అంత పెద్ద మొత్తం నోట్లని అసలు వాటితో రీప్లేస్ చేసే అవకాశం మా కుటుంబంలో ఎవరికీ లేదు. దాంతో వాటిని దొంగిలిస్తే అది బయటపడదు. ఈ రోజు కేష్ని ట్రెషరీకి పంపాలి. పంపితే ఇది బయటపడి ఆ వెధవ జైలుకి వెళ్తాడు.’’‘‘కాని ఆ దొంగనోట్ల వల్ల నాకేం ప్రయోజనం? నేను మరోసారి జైలుకి వెళ్తాను.’’ఆయన సన్నగా నవ్వి చెప్పాడు.‘‘అందుకే ఏభై వేలు నీవి అన్నాను. అవి మంచి నోట్లు. మిగిలినవి తీసేస్తాడు.’’ఆయన చెప్పిందాని గురించి ఆలోచించాను. ఆయన ప్రవర్తన, మాటల తీరుని బట్టి నాకు ఎలాంటి అనుమానం కలగలేదు.‘‘సరే.’’ ఒప్పుకున్నాను.ఆయన నాతో కరచాలనం చేసి బయటకి వెళ్తూ చెప్పాడు.‘‘గుర్తుంచుకో. సరిగ్గా ఒకటిన్నరకి. రెండున్నరకి డబ్బుని ట్రెషరీకి పంపుతారు. మా వాడి ఉద్యోగాన్ని నిలబెట్టినందుకు నేను సర్వదా కృతజ్ఞుడ్ని.’’ నా చేతులు పట్టుకుని చెప్తూంటే ఆయన గొంతు డగ్గుత్తికైంది.‘‘నన్ను తోడుదొంగని చేస్తున్నారు.’’ నవ్వుతూ చెప్పాను.∙∙ సరిగ్గా పన్నెండున్నరకి ఇంపీరియల్ బేంక్ రీజనల్ మేనేజర్‌కి ఫోన్ చేసి నేను చెప్పదలచుకున్నది చెప్పాను. మర్నాడు దినపత్రికలో ఆ వార్త మొదటి పేజీలో వచ్చింది.‘ఇంటిదొంగ’నిన్న మధ్యాహ్నం ఒకటిన్నరకి ఇంపీరియల్ బేంక్, నెహ్రూనగర్ బ్రాంచ్ని ఆడిటర్స్ ఆకస్మికంగా తనిఖీ చేస్తే, ఏభై మూడు లక్షలు మాయమయ్యాయని తెలిసింది. సిబ్బంది ఇళ్ళని, వారి బంధువుల ఇళ్ళని వెదికితే మేనేజర్ వియ్యంకుడి తమ్ముడి ఇంట్లో ఆ సొమ్ము దొరికింది. దాన్ని ట్రెషరీకి తరలించి ఆ దొంగని, మేనేజర్ని అరెస్ట్ చేశారు. ఆర్నెలల్లో రిటైరయ్యే ఆ మేనేజర్ తన తప్పుని ఒప్పుకున్నాడు.ఆ వార్తతో ప్రచురించిన ఫొటోలోని తోడుదొంగ నా దగ్గరకి వచ్చినాయనదే!- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇదీ చదవండి: ఈ వారం కథ: నాచ్ కా ఘోడా.. నవరంగ్ కా బాజా! -
మా అమ్మానాన్నల విడాకుల కేస్ కోర్ట్‌లో నడుస్తోంది...
‘‘హలో. జస్ట్ మీ వాయిస్ విందామని చేశాను. వచ్చేప్పుడు తేగలు తెండి. ఇక్కడికన్నా రాజమండ్రిలో మంచి తేగలు దొరుకుతాయి.’’ సుదతి తన భర్తకి ఫోన్ చేసి చెప్పింది.‘‘గుర్తుంది. తెస్తాను. రేగుపళ్ళ గుజ్జుతో చేసే దాన్నేదో అంటారు. అదీ తెస్తాను.’’‘‘ఒరుగులు. అవి మనమ్మాయికి బాగా ఇష్టం.’’ఏభై ఒక్కేళ్ళ సుదతి ఆ కాల్ పూర్తయ్యాక భర్త పాత లుంగీని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది. దాన్ని ఆమె వృథా పోనీకుండా టవల్‌గా వాడుతోంది. స్నానం చేస్తూ ఆ పూట ఏం వండాలని ఆలోచిస్తూ ఫ్రిజ్‌లోని కూరగాయలని గుర్తుచేసుకోసాగింది.వంట చేసేప్పుడు ఇంగువ ఐపోయిందని గ్రహించింది. ఉదయం తొమ్మిదికి వంట పూర్తి చేసి, కాలేజ్‌కి వెళ్ళే కూతురికి కేరియర్ ఇచ్చింది. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం కాబట్టి హోటల్‌కి వెళ్ళడం ఆ కుటుంబంలోని ఎవరికీ అలవాటు లేదు.ఆమె వెళ్ళాక సుదతి సంచీ తీసుకుని పది నిమిషాల నడక దూరంలోని జయంట్ సూపర్ బజార్‌కి వెళ్ళింది. ఆవిడ సరాసరి ఆ ఐల్కి వెళ్ళి ఎల్.జి. ఇంగువ డబ్బాని తీసుకుంది. మరికొన్ని వస్తువులని కూడా తీసుకుని కూతురికి టెక్స్›్ట మెసేజ్ చేసింది. ఆవిడ చెక్ అవుట్ కౌంటర్లో ఉండగా కూతురు నుంచి ఫోన్ వచ్చింది.‘‘జయంట్లో ఉంటే శానిటరీ నేప్కిన్స్ తీసుకో. ఎర్రరంగు తిలకం కూడా. ఇంకేమైనా గుర్తొస్తే ఐదు నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను.’’ఆవిడ క్యూలోంచి బయటకి వచ్చి ఆ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకుని మళ్ళీ వచ్చి చెకౌట్ క్యూలో నిలబడింది. తన ముందు నిలబడ్డ పద్దెనిమిదేళ్ళ కుర్రాడిని చూసి, ‘ఈ రోజుల్లో గడ్డం పెంచడం మగాళ్ళకి ఫేషన్ ఐపోయింది’ అని అనుకుంది.ఆ కుర్రాడి కళ్ళు పదే పదే తన చేతికున్న బ్రేస్లెట్ వంక చూడటం గమనించాక సుదతికి అతను దొంగేమో అన్న ఆలోచన కలిగింది. కొంగుతో దాన్ని కప్పుకోవాలి అని అనుకుంటూండగా అతను ప్రశ్నించాడు.‘‘మీరు పాలేశ్వరావు భార్య కదా?’’ఆవిడకి ఆ ప్రశ్నకి కొద్దిగా ఆశ్చర్యం వేసింది.‘‘అవును. ఆయన నీకు తెలుసా?’’ వెంటనే అడిగింది.‘‘తెలుసు. మా నాన్నగారు, ఆయన కొలీగ్స్.’’‘‘నన్ను ఎలా గుర్తుపట్టావు? మా ఇంటికి వచ్చావా?’’‘‘లేదు. మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి.’’‘‘మరెలా గుర్తుపట్టావు?’’‘‘ఆ బ్రేస్లెట్ మీద మీ పేరుని చూసి. రావుగారు దాన్ని కొని మీకు ఇరవైయ్యవ మేరేజ్ ఏనివర్సరీకి సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చారని మా ఇంట్లో అందరికీ తెలుసు. ఆయన మా కుటుంబానికి ఎంతో సాయం చేశారు. నాకు ఎడ్యుకేషన్ లోన్ తిరస్కరిస్తే ఆయనే ఇప్పించారు.’’‘‘మా వారికి ‘పరోపకారి పాపన్న’ అనే ముద్దు పేరు పెట్టాము. ఎవరికైనా ఏదైనా అవసరం ఉందని తెలిస్తే ఆయన అంతట ఆయనే వాళ్ళింటికి వెళ్ళి సాయం చేస్తారు.’’ సుదతి నవ్వుతూ చెప్పింది.‘‘ఆయన రాలేదా?’’ అతను ఆవిడ బుట్టలోని సామానుని కౌంటర్ మీద పెడుతూ అడిగాడు.‘‘కేంప్‌కి వెళ్ళారు.’’అతను ఆవిడ కేరీ బేగ్ బయటకి మోసుకువచ్చాడు. అతనేదో చెప్పడానికి సందేహిస్తున్నాడని గ్రహించిన సుదతి అడిగింది.‘‘ఏమిటి?’’‘‘మీరు పాలేశ్వరరావుగారికి ఫెయిత్ఫుల్గా ఉంటానని ఆయనకి మాట ఇవ్వండి. ఆయన తిరిగి వచ్చాక మీ ప్రేమని వ్యక్తం చేస్తూండండి.’’ఆ మాటలకి ఆవిడ తుళ్ళిపడింది.‘‘నా వయసు ఎంతో తెలిస్తే ఆ మాట అనవు. వచ్చే ఏడు ఏభై రెండు వస్తాయి.’’‘‘గతంలో హంస రాయబారాలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. కాని నేడు ఆ పనిని వాట్సప్ చక్కగా చేస్తోంది. వివాహేతర సంబంధాలకి వయసు అడ్డురాదు. మా అమ్మ మీకన్నా ఓ ఏడాది పెద్దది. తన క్లాస్‌మేట్‌తో వాట్సాప్ ద్వారా టచ్‌లోకి వచ్చింది. అది ప్రేమగా అనను కాని కామంగా మారింది. ఆయనతో...’’ దుఃఖంగా ఆగాడు.సుదతి ఉలిక్కిపడింది.‘‘మా అమ్మానాన్నల విడాకుల కేస్ కోర్ట్‌లో నడుస్తోంది. మా అమ్మ చాపల్యం వల్ల ఓ చక్కటి కుటుంబం విడిపోయింది. మీరు మా అమ్మలా మీ కుటుంబానికి ద్రోహం చేయకండి అని చెప్పాలి అనిపించింది.’’ఆవిడ ఆ షాక్‌లోంచి తేరుకునేలోగా అతను తన సైకిల్ దగ్గరకి వెళ్ళిపోయాడు. ఆవిడకి తనతో ఆప్యాయంగా మాట్లాడే ఓ పాత క్లాస్మేట్ గుర్తుకి వచ్చాడు. వెంటనే మొబైల్ ఓపెన్ చేసి ఓల్డ్ స్కూల్ స్టూడెంట్స్ గ్రూప్‌లోంచి బయటకి వచ్చేసింది.ఆవిడ సామాను ఉంది కాబట్టి ఊబర్ ఆటోని బుక్ చేసింది. తర్వాత తన భర్తకి ఫోన్ చేసింది.‘‘ఏమిటి?’’ పాలేశ్వర్ అడిగాడు.‘‘ఐ లవ్ యు.’’‘‘ఇదేమిటి కొత్తగా?’’‘‘ఇప్పుడే మనకి మేలు చేసే ఓ ఆధునిక ఆర్తనాదం విన్నాను.’’ ఆవిడ నెమ్మదిగా చెప్పింది.- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇదీ చదవండి: మశూచితో చనిపోయి... మళ్లీ పుట్టాడు? అసలేం జరిగిందంటే? -
తలుపు: ‘మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం’.. నెలకే ఏమైంది?
పగడాలు కుటుంబం తూర్పు గోదావరి జిల్లా నుంచి హైద్రాబాద్‌కి వలస వచ్చింది. వారిది కొంకుదురు అనే చిన్న పల్లెటూరు. పగడాలు, ఆమె భర్త వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు.పగడాలు తమ్ముడు కొంకుదురు వచ్చినప్పుడల్లా ‘హైద్రాబాద్‌కి వెళ్తే బాగుపడని వారు లేరు. ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటాం’ అని ఆమెతో పదేపదే చెప్పడంతో, పగడాలు ఓ రోజు తన భర్తతో చెప్పింది.‘‘వెళ్ళి చూద్దాం. నచ్చకపోతే మళ్ళీ కోతల సమయానికి వచ్చేద్దాం.’’‘‘సరే, ఇక్కడ ఎటూ మనకి సంవత్సరం పొడుగూతా పని దొరకటం లేదు కదా.’’ అతను ఒప్పుకున్నాడు.అతని బావమరిది ఓ బిల్డర్ దగ్గర పని చేస్తున్నాడు. తన సూపర్వైజర్తో మాట్లాడి అక్కా బావలకి పని ఇప్పించాడు. ప్రతి శనివారం ఆ వారానికి చేసిన పనికి డబ్బు ముట్టడం ఆ దంపతులు ఇద్దరికీ నచ్చింది.వాళ్ళు ఓ స్లమ్‌లోని చిన్న గుడిసె అద్దెకి తీసుకుని దిగారు. రెండు సంవత్సరాల తర్వాత ఆ దంపతులకి సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచన వచ్చింది. స్వంత స్థలం కొనేంత డబ్బు వారికి లేదు. మిగిలిన కూలీలు చేసే పనే వాళ్ళూ చేశారు. ఓ రౌడీకి నెల నెలా అద్దె చెల్లిస్తున్నంత కాలం ఓ పోరంబోకు స్థలంలో యాభై చదరపు గజాల మేర ఏదైనా కట్టుకోవచ్చు. రైలు పట్టాల పక్కనే కొత్తగా విస్తరించిన పట్టణంలో, అపార్ట్మెంట్స్ బాగా అభివృద్ధి చెందే చోటది. అది పనికి కూడా దగ్గర్లోనే ఉంటుంది.పగడాలు, ఆమె భర్త కాగితాలు లేని, నోటి మాట మీద నడిచే ఓ యాభైమంది గల చిట్టీలో చేరి, అవసరమైన సొమ్ముని తీసుకున్నారు.తనకున్న నైపుణ్యంతో పగడాలు భర్త, అతని బావమరిది ఆ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. సిమెంట్ ఖర్చు కాబట్టి బంక మట్టిని ఉపయోగించి గోడలని లేపారు. పైన నల్లటి టార్పాలి¯Œ ని కప్పుగా వేశారు. ఆ ఇంటికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. తలుపుకి డబ్బు చాలక తెర కట్టారు. ఓ శుభముహూర్తంలో గృహప్రవేశం చేశారు.స్వంత ఇల్లు అనేది వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. క్రమంగా వాళ్ళు ఆ ఇంటిని అభివృద్ధి చేసుకోసాగారు. ముందుగా పగడాలు భర్త లోపలి మట్టి నేల మీద గచ్చు చేశాడు. తర్వాత వర్షాకాలంలో గోడలని కాపాడటానికి బయటివైపు సిమెంట్ చేశాడు. ఆ తర్వాత పైన టార్పాలిన్ స్థానంలో సెకండ్ హేండ్ ఇనుప రేకులను కొని కప్పాడు. వాటికున్న చిల్లుల్లోంచి వర్షం కారకుండా వాటిని సీసంతో మూసేశాడు.ఆ తర్వాత గోడల లోపలి వైపు సిమెంట్ చేశాడు. వారు కూలీకి వెళ్ళి చేసే ఈ పనులన్నీ తమ స్వంతానికి చేస్తూండటంతో ఆ పనులు మునుపు ఇవ్వని ఆనందాన్ని ఇవ్వసాగాయి.పగడాలు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి తన భర్తని ఇంటికి తలుపు పెట్టించమని అడుగుతూనే ఉంది. తెర తీసుకుని ఎవరైనా, ఎప్పుడైనా లోపలికి రావచ్చు. రాత్రి తాము నిద్రలో ఉండగా దొంగ చొరబడొచ్చు. కాని ప్రతిసారి తలుపు కన్నా చేయాల్సిన ఇతర పనులే ముఖ్యం అవడం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది.ఇంట్లోని మట్టి నేలలో జెర్రులు తిరుగుతూండటంతో ఆ నేలని గచ్చు చేయించాల్సి వచ్చింది. వర్షాకాలంలో ఇటుకల మధ్య ఉన్న మట్టి కారి గోడలు కూలకుండా సిమెంట్ చేయాల్సి వచ్చింది. అరబస్తా సిమెంట్ మిగలడంతో అది వృథా కాకుండా దాంతో ఇంట్లో వంటకి ఓ చిన్న గట్టుని కట్టాడు. వర్షానికి కప్పు మీంచి గోడల మీదకి కారే నీటిని ఆపటానికి పైకప్పు వేయించాల్సి వచ్చింది. ఇలా వాళ్ళా ఇంట్లోకి ప్రవేశించాక తలుపు కన్నా మిగిలినవే ముఖ్యమైనవి అయ్యాయి.అవన్నీ పూర్తయ్యాక పగడాలు భర్త ముందు గోడకి గుమ్మం తెచ్చి పెట్టాడు. తర్వాతి సంవత్సరం తలుపుని అమర్చాడు.‘‘నాలుగేళ్లకి ఇది కుదిరింది. ఇంక దొంగలు ఎవరూ చొరబడరు. మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం.’’ పగడాలు ఆ రాత్రి తలుపు లోపల టవర్ బోల్ట్ పెట్టి సంతృప్తిగా చెప్పింది.తలుపు అమర్చిన నెల రోజులకి పగడాలు భర్త పనిలో జరిగిన ప్రమాదంలో మరణించాడు. అతని మరణం అందరికీ షాక్.∙∙ ఆ రాత్రి స్పర్శకి పగడాలుకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే ఓ మగాడు తనని తడుముతూ కనిపించాడు. ఆమె ఒక్క ఉదుటున బయటికి దూకి, తలుపు బయట గొళ్ళెం పెట్టి దొంగ అని అరవసాగింది. క్షణాల్లో ఆడ, మగ చాలామంది పక్క గుడిసెల్లోంచి లేచి వచ్చారు.ఆ దొంగ ఆమె పక్కింటివాడు. ఆమె భర్త వయసున్న అతను చిత్తూరు జిల్లా నుంచి వలస వచ్చాడు. అంతా అతనికి దేహశుద్ధి చేసి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలని తీర్పు చెప్పారు.మర్నాడు పగడాలు తన మరదలితో చెప్పింది.‘‘ఇంతకాలం నేను తలుపే రక్షణ ఇస్తుంది అనుకున్నాను. కాదు. తెర ఉండగా ఎన్నడూ వాడు రాలేదు. అప్పుడు నా భద్రతకి మా ఆయన అనే బలమైన తలుపు ఉందని నాకు తెలీలేదు. ఆడదానికి నిజమైన తలుపు మగాడే.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇవి కూడా చదవండి: ఈ వారం కథ: 'ఆత్మబలం' -
భార్య హత్యకు పుస్తకంలో ప్లాన్.. మరదలి ట్విస్ట్‌తో కథ రివర్స్!
బ్రిటీష్ లైబ్రరీలో నాకు ‘ఫన్నీ లైఫ్’ అనే పుస్తకం కనిపించింది. అట్టమీది దృశ్యాన్ని బట్టి అది నాన్ ఫిక్షన్ అని, ఓ సర్కస్ బఫూన్ ఆత్మకథని గ్రహించాను. లోపల అక్కడక్కడా చదివితే అది ఇటలీకి చెందిన బీద భర్త, తన సంపన్న భార్యతో పడక పడ్డ అవస్థలు ఉన్నాయి.ఆమె అతన్ని సరిగ్గా నా భార్య నన్ను చూసేట్లుగా చూస్తోందని కూడా కొన్ని పేజీలు చదివాక తెలుసుకున్నాను. పాపం అతను కూడా నాలా టంగ్ క్లీనర్ కొనడానికి కూడా ఆర్థికంగా భార్య మీద ఆధారపడ్డవాడే.ఓ చిన్న అధ్యాయంలో ఆ బఫూన్ భర్త తన భార్యని చంపే పథకం గురించి ఉంది. భార్య మరణిస్తే మొదటగా పోలీసులు అనుమానించేది భర్తనే. కాబట్టి పట్టుబడని విధంగా భార్యని చంపాలని అనుకున్నాడు. ఆ అధ్యాయంలో దాని గురించి వివరంగా రాశాడు. నేను దాన్ని శ్రద్ధగా చదివాను.ఆ బఫూన్ ఓ లైబ్రరీలో ‘యురోపియన్ పాయిజన్స్’ అనే పుస్తకంలో పోస్ట్‌మార్టంలో బయటపడని ఓ విషం గురించి చదివాడు. పద్దెనిమిదో శతాబ్దంలో వెనిస్ నగరానికి చెందిన ఓ ఇటాలియన్ జిప్సీ మంత్రగత్తె ఎవరూ కనుక్కోలేని విషాన్ని కనిపెట్టి, తమ ఊళ్ళోని భర్తలని చంపాలనుకునే భార్యలకి అమ్మేది. వారు దాన్ని వై¯Œ లో కలిపి తమ భర్తలకి ఇచ్చి చంపేవారు. దాని పేరు ‘వెనీషియన్ విషం.’ అలా ఆమె ఆ విషాన్ని నూటముప్ఫై ఏడుమంది ఇల్లాళ్ళకి అమ్మింది! వారిలో వెనిస్ బయటి ఊరువాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ జీవించి ఉండగా అది బయటకి రాకపోవడానికి కారణం, తమ భర్తని చంపడానికి తాము ఆవిడ నుంచి విషం కొన్నామని ఎవరు చెప్తారు? ఆ విషం గురించి వారంతా రహస్యంగా ఉంచారు. ఆ మంత్రగత్తె మరణానంతరమే ఇది బయటపడింది. ఆవిడ మనవరాలు తన అమ్మమ్మ రాసుకున్న డైరీలని చదివినప్పుడు అందులో ఈ ఉదంతం, ఏ తారీకున ఎవరికి, ఎంతకి ఆ విషాన్ని అమ్మిందో వివరాలు రాసి ఉన్నాయి.బఫూన్ భర్తకి ఆ వివరాలు దొరకడంతో ఆ విషాన్ని తయారుచేసి తన భార్యని చంపాడు. ఆ విషం తయారీ పద్ధతి గురించి కూడా రాశాడు. తేలు విషం, మండ్రగబ్బ మాంసం, కరక్కాయ, తెల్ల ఉమ్మెత్త మొదలైనవి వాడాలి. నేనా పేజీని ఫొటో తీసుకున్నాను. దాన్ని శుభం దాకా జాగ్రత్తగా చదివాను. డాక్టర్స్ ఆ విషం గురించి పరిశోధన చేసి, అది పోస్ట్‌మార్టంలో కనుక్కోలేమని నిర్ధారించారని ఆ పుస్తకం చివర్లోని ఎపిలాగ్లో రాశారు. భార్య అనుమానాస్పదంగా మరణిస్తే పోలీసులు ముందుగా అనుమానించేది భర్తనే అని చెప్పాను కదా. అది చాలా క్రైమ్ నవలల్లో చదివాను. అదే నన్ను ఇంతకాలం ఆపింది. ఇప్పుడు నాకో దారి దొరకడంతో ఆ పుస్తకాన్ని యథాస్థానంలో ఉంచి ఆనందంగా బయటకి నడిచాను.∙∙ నేను ఆ వస్తువులన్నీ ఒకే షాప్‌లో, ఒకే రోజు, ఒకే ఊళ్ళో కొనలేదు. ఆ పుస్తకం రాసిన బఫూ¯Œ లా అనేక ఊళ్ళల్లోని అనేక షాపుల్లో కొన్నాను. వాటిని ఇంట్లో మా ఆవిడ చూడని రహస్య ప్రదేశంలో దాచాను. వంటగదిలోని పై షెల్ఫ్‌లో. ఆ షెల్ఫ్‌పై అర నేల నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ ఉన్నవి తీయాలంటే ఐదడుగుల అంగుళం ఎత్తుండే మా ఆవిడ నా మీదే ఆధారపడుతుంది. మా మధ్య ఎత్తులోని అడుగుకి నేను కాంప్రమైజ్ అవడానికి కారణం ఆమె సంపదే.అన్నీ సేకరించాక నేను ఫొటో తీసుకున్న పేజీలోని రెసిపీ ప్రకారం సరైన పాళ్ళల్లో, సరైన పద్ధతిలో, సరైన విరామాల్లో, సరైన టెంపరేచర్లలో వాటిని కలిపాను. తర్వాత దాన్ని డిలీట్ చేసేశాను. సంక్రాంతి రోజు తను చేసిన స్వీట్ పొంగల్‌లో మా ఆవిడ తినే బౌల్లో దాన్ని కలిపాను. అది తిన్న నలభై ఎనిమిది గంటల్లో మా ఆవిడ మరణించింది. అందులో రాసినట్లుగానే మరణానికి మునుపు వివిధ లక్షణాలని గమనించాను.ఇలాంటి కథల్లో ట్విస్ట్ చివర్లో వస్తుంది. నా కథలోని ట్విస్ట్ మా మరదలే. తన అక్కని నేను చంపి ఉండచ్చని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆమెది తేలు స్వభావం అని తెలుసు కాబట్టి ఇ¯Œ స్పెక్టర్ అది చెప్పినప్పుడు నేను పెద్దగా షాక్ అవలేదు.‘‘పరిశోధించండి. ఆమె చెప్పింది తప్పని ఆమెకి దయచేసి ఋజవు చెయ్యండి.’’ కోరాను.వాళ్ళు నా భార్య దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం చేశారు. నాకేం కాదనే ధీమాలో ఉన్న నాకు వాళ్ళు షాకింగ్ న్యూస్ చెప్పారు. పోస్ట్‌మార్టంలో నా భార్య విషప్రయోగంతో మరణించిందని తేలిందని పోలీస్ డాక్టర్ నిర్ధారించాడు! సీసీటీవీ కెమేరాలు పాడుగాను. ఆ విషానికి అవసరమైన పదార్థాలని నేను కొన్నాననే ఋజువులని కూడా సంపాదించారు. నా నేరం ఋజువయ్యాక నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. నా సెల్ గార్డ్‌కి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది.‘‘నీకు అవసరమైనప్పుడల్లా నన్ను అడిగితే టైం చెప్తాను.’’ నన్ను సెల్‌లోకి పంపాక తాళం వేస్తూ చెప్పాడు.∙∙ ఆ రోజు లైబ్రరీ అవర్‌లో జైల్ లైబ్రరీలో పుస్తకాల కోసం వెదుకుతూంటే నాకు ఆ బఫూన్ ఆత్మకథ పుస్తకం కనిపించింది. ఆ పుస్తకమే నన్ను జైలుకి పంపిందని జైలుకి వచ్చిన అక్కడున్న ఓ ఖైదీకి చెప్పాను. అతను దాన్ని చదవడానికి తీసుకున్నాడు.మర్నాడు లైబ్రరీ అవర్‌లో ఆ ఖైదీ నవ్వుతూ నాకు ఓ పేజీని చూపించాడు. శుభం తర్వాత నేను చదివిన పుస్తకంలో లేని ఓ కొత్త పేజీ కనిపించింది. అది పబ్లిషర్స్ నోట్. అందులో ఇలా ఉంది.హెచ్చరిక: వెనీషియన్ విషాన్ని ఎవరూ ప్రయత్నించకండి. అది కల్పితం కాదు. ఇప్పుడు పోస్టుమార్టంలో ఆ విషాన్ని కనుక్కోగలుగుతున్నారు.బ్రిటీష్ లైబ్రరీలో నేను చదివిన ఆ పుస్తకంలోని ఈ ఆఖరు కాగితాన్ని ఎవరు, ఎందుకు చింపారో నాకు తెలీదు. వాడివల్ల నేను జీవితఖైదు అనుభవిస్తున్నానని ఆ వెధవకి తెలీదు.- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇవి చదవండి: భాష మార్చలేదు.. తలవంచలేదు! నోబెల్ గెలిచిన రచయిత కథ! -
తైలవర్ణ చిత్రం.. 'మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో..'
‘‘మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో చంబాకి బదిలీ అయింది.’’ సుధీర చెప్పింది. ‘‘అయ్యో! అంత దూరమా?’’ ఆమె తండ్రి వెంటనే చెప్పాడు. సాయంత్రం ఆయన సుధీరకి ఫోన్ చేసి చెప్పాడు.‘‘మీ మామయ్య దుర్గ గుడిలో అకౌంటెంట్ కదా. ఆయనకి మీ బదిలీ సంగతి చెప్తే, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, హిమాచల్‌ప్రదేశ్‌లో మంత్రతంత్రాలు తెలిసిన చాలామంది ఉన్నారని చెప్పారు. వాళ్ళు మనుషుల్ని వశీకరణ మంత్రాలతో ఆకర్షించి డబ్బు, బంగారం తీసుకోగలరట. ముఖ్యంగా నల్ల బట్టలు ధరించే అఘోరీలని అసలు నమ్మద్దని చెప్పమన్నారు. వాళ్ళ దగ్గర చాలా దుష్ట మంత్రశక్తులు ఉంటాయట.’’తన భర్త ఇంటికి రాగానే సుధీర ఆ సంగతులన్నీ చెప్పింది.‘‘అయితే మనం జాగ్రత్తగా ఉండాలి.’’ అతను చెప్పాడు.రెండు వారాల తర్వాత వాళ్ళు వరంగల్ నించి చంబాకి బయలుదేరారు.∙∙ సుధీర భర్త కొత్త బ్రాంచ్‌లోని సిబ్బందితో మాటల్లో తన మామగారు చెప్పింది చెప్పి అడిగాడు.‘‘అది నిజమా?’’‘‘అవును. ఎవరైనా పోయారని తెలిస్తే వచ్చి ఆ రాత్రికి శవాన్ని ఇవ్వమంటారు. సాధువుల్లా కనపడే కాషాయరంగు దుస్తులవాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. క్షుద్రపూజలో వారికి శవం అవసరం అవుతుంది.’’∙∙ చంబాకి వచ్చిన రెండేళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి చేదు అనుభవం కలగకపోవడంతో క్రమంగా భయంపోయింది.రోజూ రాత్రి ఎనిమిదిలోగా ఇంటికి వచ్చే సుధీర భర్త ఓరోజు బ్రాంచ్ నించి రాత్రి పదకొండైనా రాలేదు. పదకొండుకి బ్రాంచ్‌కి ఫోన్ చేస్తే సెక్యూరిటీ గార్డ్ ఆన్సర్ చేశాడు.‘‘ఎవరూ లేరు మేడం. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు.’’ చెప్పాడు.తెల్లవారుజామున మూడు దాకా ఆమె మేలుకునే ఉంది. తన భర్త రాకపోవడంతో ఉదయం పదిన్నరకి బేంక్‌కి ఫోన్ చేసింది. రాలేదని తెలిశాక పోలీసులకి ఫిర్యాదు చేసింది.ముందుగా పోలీసులు అతని బ్రాంచ్‌కి వెళ్ళి కేష్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకున్నారు. ఉందని తెలిశాక అతని కోసం వెదికారు. అతని జాడ తెలీలేదు.మర్నాడు మధ్యాహ్నం ఓ కాన్ స్టబుల్ వారింటికి వచ్చి అడిగాడు.‘‘మీవారి స్కూటర్ రోడ్ మీద ఎవరి ఇంటి ముందో ఉందట. అది దొంగిలించబడిందనే అనుమానంతో ఒకరు ఫోన్ చేశారు. చంపావతి నగర్లో మీకు బంధుమిత్రులు ఉన్నారా?’’ ‘‘లేరండి. అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటారు?’’ సుధీర ఆదుర్దాగా చెప్పింది. ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని చూసి ఎదురింట్లోంచి ఫిర్యాదు చేసిన ముసలాయన బయటికి వచ్చి చెప్పాడు.‘‘రాత్రి నించి ఇది ఇక్కడే ఉండటంతో ఎవరో దొంగిలించి ఇక్కడ వదిలారని అనుమానించాను.’’ ‘‘మీ ఎదురింట్లో ఎవరు ఉంటారు?’’ స్కూటర్ ఆ ఇంటివైపు పార్క్ చేసి ఉండటంతో పోలీస్ కానిస్టేబుల్ అడిగాడు. ‘‘అది ఖాళీ. అందులో ఎవరూ లేరు. అక్కడో సంఘటన జరిగాక ఎవరూ అద్దెకి రాలేదు.’’ ఆయన నెమ్మదిగా చెప్పాడు. ‘‘ఏమిటది?’’ సుధీర వెంటనే అడిగింది. ‘‘నాలుగైదేళ్ళ క్రితం ఆ ఇంటావిడ అకస్మాత్తుగా నెత్తురు కక్కుకుని మరణించింది. రాత్రుళ్ళు మగాళ్ళు ఆ ఇంటి పక్కనించి వెళ్తూంటే రమ్మని ఇంట్లోంచి ఆడవాళ్ళ పిలుపు వినిపిస్తుంది.’’కాన్ స్టబుల్ ఓ అపార్ట్మెంట్కి వీధివైపున్న సీసీటీవీ కెమెరాని గమనించి దాన్ని చెక్ చేస్తే, రెండు రోజుల క్రితం చీకటి పడుతూండగా సుధీర భర్త దాని డోర్ బెల్ నొక్కడం, తలుపు తెరుచుకున్నాక లోపలికి వెళ్ళడం కనిపించింది. తర్వాత రికార్డ్ అయినదంతా చెక్ చేశారు కాని, ఆ ఇంట్లోంచి సుధీర భర్త మళ్ళీ బయటకి రావడం కనిపించలేదు. ‘‘సందేహం లేదు. ఆయన ఏ కారణంగానో లోపలే ఉన్నారు.’’ సుధీర కంగారుగా చెప్పింది. ‘‘అదెలా జరుగుతుంది? దాని తాళంచెవులు నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మా బాబాయి కొన్నారు.’’ ముసలాయన ఆశ్చర్యంగా చెప్పాడు. తాళం తెరిచి అంతా లోపలికి వెళ్ళగానే సుధీర గట్టిగా అరిచింది.‘‘ఏమండీ? ఉన్నారా?’’ పాతికేళ్ళ క్రితం కట్టిన ఆ ఆరు గదుల ఇంట్లోని ప్రతీ గదిని వెతికారు. బూజు. ఎవరూ లేరు. కాన్ స్టబుల్ ప్రతి అల్మరా తలుపులు తెరిచి చూస్తే లోపలా లేడు. పడక గదిలో గోడకి వేలాడే తైలవర్ణచిత్రంలో జలతారు చీరలోని అందమైన ఏభై ఏళ్ళ స్త్రీ కనిపించింది.‘‘ఆ తైలవర్ణచిత్రం మరణించిన ఆవిడది... అరే. ఈ బొమ్మలోకి కొత్తగా ఎవరో వచ్చారే? దీన్ని ఈ బొమ్మలో ఎవరు గీశారో?’’ ఎదురింటి ఆయన సంభ్రమంగా చెప్పాడు. ‘‘అది మా వారే.’’ సుధీర కెవ్వున అరిచి చెప్పింది.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
గొలుసు ఉత్తరం..
ఒకప్పటి కాలం ఉత్తరాల కాలం. అప్పట్లో చాలా ఉత్తరాలు వచ్చేవి. కాని జాగృత్ ఆ కాలానికి సంబంధించినవాడు కాదు. ఉత్తరాల అవసరం ఆగిపోయిన, ఎలక్ట్రానిక్ కాలానికి చెందినవాడు. అతను నివసించే అపార్ట్మెంట్లో అతని మెయిల్ బాక్స్‌లో అరుదుగా ఉత్తరాలు పడుతూంటాయి. చిట్‌ఫండ్ కంపెనీ ఇంటిమేషన్, ఎల్.ఐ.సి. రసీదులు, రిమైండర్స్, నవరాత్రులలో పూజకి డబ్బు పంపమని అతని గ్రామ పూజారి నుంచి ప్రింటెడ్ బ్రోచర్ లాంటివి.ఆరోజు అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక, అలవాటుగా తన మెయిల్ బాక్స్ ట్రా¯Œ ్సపరెంట్ అద్దం తలుపులోంచి చూస్తే లోపల ఓ కవర్ కనిపించింది. తాళం తెరిచి దాన్ని తీసుకుని చూశాడు. అది ఐదు రూపాయల పోస్టల్ కవర్. ఫ్రమ్ అడ్రస్ లేదు. టు అడ్రస్ అందమైన చేతిరాతలో ఉంది.అతను దాన్ని తీసుకుని లిఫ్ట్‌లో ఆరో అంతస్తులోని తన అపార్ట్మెంట్కి చేరుకుని దాన్ని బల్ల మీద పడేశాడు. రాత్రి పడుకోబోయే ముందుదాకా అతని దృష్టి దాని మీద పడలేదు. పడుకోబోయే ముందు దాన్ని అందుకుని చింపి చదివాడు. అది చేతిరాతలో ఉన్న ఓ హెచ్చరిక. ఆ ఉత్తరాన్ని అది చదివిన 24 గంటల్లోగా మొత్తం కాపీ చేసి కనీసం ఒకరికి పంపాలని, దాన్ని కాపీ చేసి పంపకపోతే ఒకతని భార్య ఆత్మహత్య చేసుకుందని, మరొకరికి ఆస్తి నష్టం వచ్చిందని, కాబట్టి ఆ చై¯Œ ని బ్రేక్ చేయొద్దని దాని సారాంశం. అందులో షిరిడీ బాబా చెప్పిన పన్నెండు బోధనలు ఉన్నాయి.జాగృత్ కొలిచేది ఒక్క షిరిడీ సాయినే. ప్రతి ఉగాదికి షిరిడీకి వెళ్తాడు. ప్రతి నవరాత్రులలో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర చదువుతాడు. అయితే అతనిది మూఢ భక్తి కాదు. దేన్నయినా హేతువాదంతో ఆలోచిస్తాడు. తను ఆ చై¯Œ ని బ్రేక్ చేస్తే ఆపద వాటిల్లుతుందని జాగృత్ క్షణకాలం కూడా నమ్మలేదు. ఓ మనిషికి కీడుని కలిగించే గొప్ప శక్తి ఆ గొలుసు ఉత్తరానికి ఉండదని అతని స్థిరనమ్మకం.అయినా, జాగృత్ కాగితం, కలం తీసుకుని ఆ ఉత్తరాన్ని కాపీ చేశాడు. అందుకు కారణం, కొత్తవాళ్ళకి ఆ ఉత్తరం అందితే వారి దృష్టిని తను కొలిచే సాయి మీదకి మళ్ళించినవాడు అవుతాడు. వాళ్ళు సాయి భక్తులు కాకపోతే ఇప్పుడు అయ్యే అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో దాన్ని కాపీ చేశాడు.మర్నాడు దాన్ని ఆఫీస్‌కి తీసుకెళ్ళాడు. అది ఎవరికి పంపాలా అని ఆలోచించాడు. లంచ్ అవర్‌లో అతను తిరిగి తన సీట్‌కి వస్తూంటే, ఆ మల్టీస్టోరీడ్ కమర్షియల్ ఆఫీస్ బిల్డింగ్ లోని ఓ ఆఫీస్ తలుపు బయట ఆ కంపెనీ ఫైనాన్షియల్ మేనేజర్ పేరు కనిపించింది. జాగృత్ తన సీట్‌కి వెళ్ళాక ఆఫీస్ కవర్ తీసుకుని, ఆ కవర్ మీద అతని పేరు, డిజిగ్నేషన్, అతని ఆఫీస్ చిరునామా రాశాడు. మధ్యాహ్నం మూడున్నరకి బాత్రూమ్కి వెళ్ళడానికి లేచినప్పుడు డిస్పాచ్ క్లర్క్‌కి ఆ కవర్ ఇచ్చి చెప్పాడు.‘‘దయచేసి దీన్ని పోస్ట్ చెయ్యి.’’జాగృత్ ఆ సంగతి అంతటితో మరిచిపోయాడు.∙∙ కొన్ని వారాల తర్వాత జాగృత్ దగ్గరకి ఓ కొత్త వ్యక్తి వచ్చి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అడిగాడు.‘‘ఈ ఆదివారం ఫ్రీగా ఉంటారా?’’‘‘ఏమిటి విశేషం?’’ అతను అడిగాడు.‘‘ఈ ఆదివారం మా ఇంట్లో సాయి భజన జరుగుతుంది. ఎందుకో మిమ్మల్ని పిలవాలని అనిపించింది.’’‘‘నేను సాయి భక్తుడిని. తప్పకుండా వస్తాను. లొకేషన్ షేర్ చేయండి.’’ జాగృత్ చిరునవ్వుతో అంగీకరించాడు.‘‘నెహ్రూ నగర్లో ఇండియన్ బ్యాంక్ తెలుసుగా. దాని పక్కన ఫస్ట్ ఫ్లోర్. కాబట్టి తేలిగ్గా రాగలరు.’’జాగృత్ ఆదివారం కొబ్బరికాయ, పూలున్న కేరీ బ్యాగ్‌తో ఆ ఇంటికి చేరుకున్నాడు.‘‘ఇంకా ఎవరూ రాలేదు. ఐదు నిమిషాల్లో అంతా ఇక్కడ ఉంటారు. ఈలోగా మీరు దీన్ని తాగండి. అందరికీ కలిపాను.’’జాగృత్ రూహఫ్జా తాగాక అతను చెప్పాడు.‘‘మీరో ఘోరమైన పొరపాటు చేశారు.’’‘‘పొరపాటా? నేనా? ఏమిటది?’’ జాగృత్ ఆశ్చర్యంగా అడిగాడు.అతను జాగృత్ పంపిన గొలుసు ఉత్తరాన్ని చూపించాడు.‘‘ఇదే మీరు చేసిన ఘోరమైన పొరపాటు.’’‘‘ఏం పొరపాటు?’’ జాగృత్ అర్థం కాక అడిగాడు.‘‘నేను ఒరియావాడిని. నాకు తెలుగు చదవడం వచ్చి, అప్పుడే దీన్ని చదివి ఉంటే ఇరవై నాలుగు గంటల్లో ఈ ఉత్తరాన్ని కాపీచేసి పంపేవాడిని. కాని నిన్నటి దాకా ఇందులో ఏముందో నాకు తెలీదు. నిన్న మా ఇంటికి వచ్చిన తెలుగు తెలిసిన ఓ బంధువు చదివి చెప్పారు. ఇది అందిన నాలుగో రోజున నా భార్య ఆత్మహత్య చేసుకుంది.’’‘‘అయ్యో. ఐ యాం వెరీ సారీ.’’‘‘ఆ తర్వాత రెండు రోజులకి ఊళ్ళోని మా ఉమ్మడి ఆస్తిలోంచి నా జ్ఞాతులు నా భాగాన్ని కొట్టేశారు.’’‘‘అరెరే.’’‘‘నన్ను నా మానాన బతకనివ్వకుండా నువ్వు అనవసరంగా నా జీవితంలో జోక్యం చేసుకున్నావు. ఈ ఉత్తరం ద్వారా నాకు నష్టాన్ని కలిగించావు.’’ అతను కోపంగా చెప్పాడు.‘‘కాదు. నేను దీన్ని నమ్మలేదు. సరదాకి దీన్ని పంపాను. ఈ ఉత్తరానికీ, మీకు జరిగిన నష్టాలకి ఎలాంటి సంబంధం లేదు. హేతువాదంతో ఆలోచించండి.’’‘‘నాకు జరిగిన నష్టాలకి నేను ఆవేదనతో కుమిలిపోతూండగా, ఈ ఉత్తరం నువ్వు పంపావని తెలిసి నా మనసు కుతకుతలాడిపోతోంది. కవర్ మీద నీ ఆఫీస్ ఎడ్రస్ పైన కేరాఫ్ అని నీ పేరు రాసి ఉండటంతో నిన్ను తేలిగ్గా కనుక్కున్నాను. అందుకే భజన నెపంతో నిన్ను ఇక్కడికి రప్పించాను. నువ్వు తాగిన రూహఫ్జాలో విషం ఉంది. ఇంకో పావుగంట తర్వాత నువ్వు జీవించవు.’’డిస్పాచ్ క్లర్క్ కవర్ మీద తన పేరు రాసి ఉంటాడని స్పృహ తప్పేముందు జాగృత్కి తోచింది. - మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
బుల్లెట్
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 30 ‘‘నేనది నమ్మలేదు’’ కెప్టెన్ క్లెటిస్ వెంటనే చెప్పాడు. ‘‘కాని సాక్ష్యం మాత్రం ఇన్స్పెక్టర్ థియోడోర్ ఆ హత్య చేశాడని చెప్తోంది’’ ఎల్లరీ చెప్పాడు. క్లెటిస్ వెంటనే అడిగాడు. ‘‘మన పోలీస్ శాఖలో ఎవరైనా థియోడోర్ హంతకుడని నమ్ముతున్నారా?’’ ‘‘నాతో సహా ఎవరూ నమ్మట్లేదు.’’ ‘‘అసలేం జరిగిందో మరోసారి చెప్పు’’ క్లెటిస్ ఇన్స్పెక్టర్ని ప్రశ్నించాడు. ‘‘ఇంటర్నల్ అఫైర్స్ నించి వచ్చిన ఓ డిటెక్టివ్ పోలీసు శాఖలోని లంచగొండి తనం మీద పరిశోధిస్తున్నాడు. అతను కొన్ని విషయాలని కనుగొన్నాడు. ఫలితంగా ఒకరిద్దరు జైలుకి వెళ్లచ్చు. అందుకని ఆ డిటెక్టివ్ తన రిపోర్ట్‌ని పై అధికారులకి సమర్పించక మునుపే అతన్ని ఇన్స్పెక్టర్ థియోడోర్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపాడు.’’ ‘‘అందుకు సాక్ష్యం?’’ ‘‘హతుడిని చంపిన రివాల్వర్ గుండు మీద గుర్తులు. అది థియోడోర్ సర్వీస్ రివాల్వర్ లోంచే వెలువడిందని బాలిస్టిక్ నిపుణులు నిర్ధారించారు.’’ ‘‘అసలు థియోడోర్ రివాల్వర్ బుల్లెట్ గుర్తులతో ఆ బుల్లెట్ మీది గుర్తులని ఎందుకు పోల్చి చూశారు?’’ ‘‘ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఆ గుండు థియోడోర్ సర్వీస్ రివాల్వర్ నించే వెలువడిందని ఉప్పందించారు. మీకు తెలుసుగా? మన శాఖలో ఎవరికైనా సర్వీస్ రివాల్వర్ని జారీ చేసే ముందు దాన్ని పేల్చి, ఆ గుండు మీది గుర్తులని నమోదు చేసుకుంటారు. ఇందువల్ల పోలీస్ రివాల్వర్ నించి వెలువడ్డ గుండుని ఎవరు పేల్చారన్నది తేలిగ్గా తెలుసు కోవచ్చు. ఆ ప్రకారం బాలిస్టిక్ నిపుణులు పోల్చి చూసి ధృవీకరించారు. కాని థియో డోర్ ఆ హత్య జరిగిన సమయంలో తన రివాల్వర్ తన దగ్గరే ఉందని గట్టిగా చెప్తున్నాడు.’’ ‘‘ఇందులో ఏదో రహస్యం ఉంది. దాన్ని మనం ఛేదించాలి’’ క్లెటిస్ చెప్పాడు. ‘‘అందుకే మీ దగ్గరికి వచ్చింది. మన శాఖలో ఆ పని చేయగల సమర్థత ఒక్క మీకే ఉంది. థియోడోర్ లాంటి వజ్రాన్ని మనం పోగొట్టుకోకూడదని అంతా నిశ్చయించారు. పైగా అసలు హంతకుడు తప్పించుకోకూడదు. ఇది థియోడోర్ ఇచ్చిన స్టేట్మెంట్.’’ ఎల్లరీ ఇచ్చిన ఆ ప్రింటవుట్‌ని క్లెటిస్ జాగ్రత్తగా చదివాడు. ‘నా రివా ల్వర్‌తో నేను హత్య చేశానని చెబుతోన్న ముందు రోజు షూటింగ్ రేంజ్లో కొద్ది సేపు షూటింగ్ ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత నించి రివాల్వర్ నాతోనే ఉంది. మళ్లీ దాన్ని పేల్చలేదు. నా కుటుంబం ఊరు వెళ్లడంతో మా ఇంట్లో నేనొక్కడ్నే ఉన్నాను. కాబట్టి నాకు తెలీకుండా దాన్ని ఎవరో దొంగిలించే అవకాశం కూడా లేదు. హత్య జరిగిన సమయంలో నేను ఒంటరిగా ఇంట్లో నిద్రపోతున్నాను. ఇంతకు మించి నాకేం తెలీదు.’ ‘‘కనీసం ఆ సమయంలో టీవీ చూసినా ఆ కార్యక్రమం మీద ప్రశ్నించి, సరైన సమాధానాలు ఇస్తే కొంతదాకా రక్షించగలిగేవాళ్లం’’ క్లెటిస్ చెప్పాడు. ఎల్లరీ మాట్లాడలేదు. క్లెటిస్ కొన్ని క్షణాలు థియోడోర్ షూటింగ్ రేంజ్లో ప్రాక్టీస్ చేసే దృశ్యాన్ని ఊహించుకున్నాడు. ఈ విజువల్ ఇమాజినేషన్ అతను నేర పరిశోధనలో ఉపయోగించే ఓ టెక్నిక్. వెంటనే కళ్లు తెరిచి చెప్పాడు. ‘‘హత్యకి మోటివ్ ఎవరికి ఉంటుంది? ఎవరు లంచగొండులో వారికే.’’ ‘‘అవును. థియోడోర్ లంచగొండి కాదు. కాబట్టే మన శాఖ అతనికి మద్దతుగా ఉంది.’’ ‘‘షూటింగ్ రేంజ్లో పని పూర్తయ్యాక పేల్చిన గుళ్లు ఏమవుతాయి?’’ ‘‘వాటిని సేకరించి ఓ డబ్బాలో వేస్తారు. ఆ లోహపు ముక్కల్ని రీసైక్లింగ్ ప్లాంట్‌కి పంపుతారు.’’ ‘‘పద. థియోడోర్ని ఓ ప్రశ్న అడగాలి’’ క్లెటిస్ చెప్పాడు. ‘‘అవును. నేను పేల్చిన అన్ని గుళ్లనీ సేకరించి వాటిని రీసైక్లింగ్ డబ్బాల్లో వేసే వెళ్ళాను’’ థియోడోర్ జవాబు చెప్పాడు. ‘‘షూటింగ్ రేంజ్లోంచి మధ్యలో బయటికి వెళ్లారా?’’ క్లెటిస్ ప్రశ్నించాడు. ‘‘నాకు ఫోన్ వచ్చిందని అక్కడి ఉద్యోగి చెప్తే వారి ఆఫీసు గదిలోకి ఓసారి వెళ్లా. కాని అప్పటికే అవతలివాళ్లు లైన్ కట్ చేసేశారు. మళ్లీ వచ్చి ప్రాక్టీస్‌ని కొనసాగించాను.’’ ‘‘మీతో పాటు ఆ సమయంలో ఎవరు ప్రాక్టీస్ చేశారు?’’ ‘‘మీకు తెలుసుగా. కింది అధికారుల ముందు పై అధికారులు షూటింగ్ ప్రాక్టీస్ చేయరు. తమ గురి సరిగ్గా లేదని కింది వాళ్లు గ్రహిస్తే వారికి అది నామర్దా. అందు వల్ల పై అధికారులెవరూ లేరు. ఇన్స్పెక్టర్ వైస్ ఒక్కడే నాతో కలిసి ప్రాక్టీస్ చేశాడు.’’ ‘‘అతను మీరు మొదలెట్టిన కాసేప టికి వచ్చాడు. మీరు మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు కూడా వైస్ ఉన్నాడు కదా?’’ ‘‘అవును. మీకెలా తెలుసు?’’ ‘‘మళ్లీ మీకు ఫోన్ వచ్చి లైన్ డిస్కనెక్ట్ అయి ఉండాలి. లేదా మరే కారణంగానో మీరు బయటికి వెళ్లి ఉండాలి.’’ ‘‘అవును. మళ్లీ ఫోన్ వస్తే అలాగే జరిగింది. ఇది మీకెలా తెలుసు?’’ థియోడోర్ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. ‘‘ఇన్స్పెక్టర్ వైస్ మిమ్మల్ని అక్కడ్నించి బయటికి పంపించడానికి కారణం మీ రివాల్వర్ బేరల్ని తస్కరించి, ఆ స్థానంలో తన రివాల్వర్ బేరల్ని మీ రివాల్వర్‌కి అమర్చడానికే. ఒకే కంపెనీ తయారీ చేసిన ఆటోమేటిక్ రివాల్వర్ల బేరల్స్‌ని ఒకదానిది మరొక దానికి అమర్చ వచ్చు. మీ బేరల్ అమర్చిన తన రివాల్వర్‌తో హత్య చేశాడు. దాంతో ఆ గుండు మీద మీ బేరల్ నించి వచ్చిన గుర్తులు కనిపించాయి. మళ్లీ మీరు ప్రాక్టీస్‌కి వచ్చినప్పుడు ఎవరి బేరల్స్‌ని వారి రివాల్వర్స్కి గుట్టు చప్పుడు కాకుండా అమర్చేశాడు. తర్వాత అజ్ఞాత వ్యక్తిగా ఇంటర్నల్ అఫైర్స్ శాఖకి ఫోన్ చేసి దృష్టి బేరెల్ మీదకి మళ్లించాడు. దాంతో హతుడికి తాకిన గుండు మీద మీ రివాల్వర్ బేరల్ గుర్తులు కనిపించాయి. అంతా ఆ రివాల్వర్‌తో మీరే అతన్ని చంపారనుకుంటారు.’’‘‘కరెక్టే. అందుకు ఇంతకుమించి మరో మార్గం లేదు’’ థియోడోర్ మొహంలో ఉత్సాహం తొంగి చూసింది. ‘‘కాని ఇది జడ్జి నమ్మాలి. దీనికి సాక్ష్యులు లేరు’’ ఇన్స్పెక్టర్ క్లెటిస్ ఆలోచనగా చెప్పాడు. ‘‘అవును. కనీసం మన శాఖలోని వారు ఇది నమ్ముతారు. వాళ్ల దృష్టిలో నేను హంతకుడ్ని కాను.’ ‘‘బాలిస్టిక్ రిపోర్ట్ ఇంకా గోప్యంగానే ఉంది. కాబట్టి మీరు ఓ అబద్ధం ఆడాలి. వైస్‌తో మాట్లాడాలని పిలిపించండి. రివాల్వర్ బేరల్స్‌ని అతను మార్చడం మీరు చూశారని, అతని బేరల్ గల మీ రివాల్వర్‌తో వైస్ హత్య చేశాడని అతనితో చెప్పండి. మేం వైస్‌తో అతని బేరల్ గుర్తులు హతుడి శరీరంలో దొరికిన గుండుతో సరిపోయాయి అని అబద్ధం చెప్తాం. ఆ నేరం మీ మీదకి వస్తుందని అతను తను చేసింది ఒప్పుకుంటాడు. అతని చేతే జరిగింది చెప్పిస్తే కాని ఇందులోంచి మీరు బయటపడలేరు.’’ ‘‘ఇది తెలివైన ఆలోచన. థాంక్యూ’’ థియోడోర్ ఆనందంగా చెప్పాడు. ‘‘కాని వైస్ లంచగొండి కాదు కదా? అతను దేనికీ హత్య చేశాడు?’’... కాసేపాగి అమానంగా అడిగాడు. ‘‘లంచగొండులైన పై అధికాల ప్రాపకం కోసం’’... చెప్పాడు క్లెటిస్. వైస్కి శిక్ష పడింది. (ఆర్.టి.లాటన్ కథకి స్వేచ్ఛానువాదం) -
ఎవర్నీ నమ్మక!
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 13 దొంగలు ఎందుకు పట్టుబడతారో కొన్ని కారణాలని నెల్సన్ వెస్ట్ అన్వేషించాడు. ఒకరి కంటే ఎక్కువమంది దొంగలు భాగస్వాములుగా ఉంటే, ఒక్కడు పట్టుబడ్డా మిగిలినవారి పేర్లు చెప్తాడు. దొంగతనాన్ని ఒక్కడే చేయాలి. లేదా తోటివాళ్లు మోసం చేసే అవకాశం ఉంది. లోభం కూడా కూడదు. కొంతతో తృప్తి చెందాలి. తన ఈ ఆదర్శాల వల్ల వెస్ట్ ఇంతదాకా నేరం చేయలేదు. చివరకి ఓ రోజు అతనికి ఆ అవకాశం వచ్చింది. ‘గ్రేటర్ ఆరిజోనా రియాల్టీ కంపెనీ’లో నెల్సన్ వెస్ట్ సేల్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆ రోజు దాని యజమాని సిమ్సన్ వెస్ట్‌ని పిలిచి, కొత్త ఫోర్డ్ కారు తాళం చెవి ఇచ్చి చెప్పాడు. ‘‘ఓ కోటీశ్వరుడు దీన్ని కొనడానికి బయట వేచి ఉన్నాడు. ట్రయల్ రన్‌గా ఎడారిలో దీన్ని నడపాలని కోరాడు. ఎడారిలోని క్రిస్టియన్ మోనాస్ట్రీకి ఈ కారుని బహూకరిస్తాట్ట. అంతేకాక ఇక్కడ ఉన్న మంచి బేంక్ పేరు అడిగితే చెప్పాను. ఇంకో మంచి బేంక్ పేరు కూడా అడిగాడు. బేంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా తీసుకెళ్లు.’’ ‘‘అలాగే’’ వెస్ట్ చెప్పాడు. హాథ్‌వేని ఫోర్డ్ కారులో ఎక్కించుకుని ఎడారిలోకి బయలుదేరాడు వెస్ట్. దారిలో హాథ్‌వే, తను ఈస్ట్నించి అక్కడికి కొత్తగా వచ్చానని, తనకి బంధుమిత్రులు ఎవరూ లేరని, ఒంటరివాడినని చెప్పాడు.‘‘ఈస్ట్ నించి ఇక్కడికి వచ్చి సెటిలవుతున్నారా? ఇది మంచి రాష్ట్రం’’ వెస్ట్ చెప్పాడు.‘‘ముందుగా ఏదైనా మంచి బేంక్ ముందు కారు ఆపు. నా దగ్గర చాలా డబ్బుంది. రెండు బేంక్‌లకి తీసుకెళ్లు. రెండు లక్షల డాలర్లని ఒక్క బేంక్లోనే నమ్మి ఉంచలేం’’... హాథ్‌వే కోరాడు. ‘అంత డబ్బే!’ అని వెస్ట్ మనసులో ఆశ్చర్యపోయాడు. ‘‘అలాగే. ఇక్కడికి దగ్గరలో నీసా అనే చోట ఓ మంచి బేంక్ ఉంది. దాని బ్రాంచ్‌లు రాష్ట్రం అంతటా ఉన్నాయి. మొత్తం అందులో డిపాజిట్ చేసి, రేపు మీరు కొంత మొత్తం ఇంకో బేంక్‌కి బదిలీ చేయచ్చు’’ వెస్ట్ సూచించాడు. నీసాలోని ఓ బేంక్ ముందు కారుని ఆపాడు. హాథ్‌వే లోపలికి వెళ్లాక వెస్ట్ ఆట వస్తువులు అమ్మే ఓ దుకాణంలోకి వెళ్లి ఒక గేలన్ పట్టగల మ్యూరియాటిక్ ఏసిడ్ జగ్గులు ఐదు కొన్నాడు. ఆ ఏసిడ్‌ని స్విమ్మింగ్ పూల్ కడగడానికి ఉపయోగిస్తారు. హాథ్‌వే తిరిగి బేంక్‌లోంచి బయటికి వచ్చేసరికి వెస్ట్ సిద్ధంగా ఉన్నాడు. తర్వాత ఎడారిలోని మోనాస్ట్రీ వైపు ఫోర్డ్ని పోనిచ్చాడు. సగం దూరం వెళ్లాక గ్లవ్ కంపార్ట్మెంట్ తెరిచి వెస్ట్ అందులోంచి రివాల్వర్ తీసి, హాథ్‌వేని రెండుసార్లు కాల్చాడు. చుట్టుపక్కల ఇరవై మైళ్లదాకా అంతా నిర్మానుష్యంగా ఉంటుందని అతనికి తెలుసు. కారుని ఆపి, హాథ్‌వే జేబులు వెదికాడు. నీసా బేంక్ బ్రాంచ్ ఇచ్చిన చెక్ బుక్, రెండు లక్షలకి డిపాజిట్ స్లిప్ కూడా కనిపించాయి. కనపడినవన్నీ తీసుకున్నాడు. హాథ్‌వే శవాన్ని బయటికి లాగి రాళ్ల వెనక పడేశాడు. తర్వాత ఏసిడ్‌తో అతని మొహాన్ని కాల్చేశాడు. భవిష్యత్తులో ఎవరైనా అతని శవాన్ని కనుగొన్నా అతన్ని గుర్తించలేరు. తర్వాత ఖాళీ జగ్గులని కారులో పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. ‘‘హాథ్‌వే ఫోర్డ్ విషయంలో ఏమన్నాడు?’’ సిమ్సన్ ప్రశ్నించాడు. ‘‘కొనేట్టుగానే ఉన్నాడు.’’ హాథ్‌వే జేబులో దొరికిన వాటిలో న్యూయార్క్ డ్రైవర్స్ లెసైన్స్, సోషల్ సెక్యూరిటీ కార్డు మొదలైనవి ఉన్నాయి. తను వచ్చిన చోట ఎవరితోనైనా సంబంధం ఉందని సూచించే కాగితాలేవీ దొరకలేదు. ఒంటరివాడు అన్నది నిజమేనని అనిపించింది.కొద్దిసేపు అతను హాథ్‌వే సంతకాన్ని ప్రాక్టీస్ చేశాడు. సరిగ్గా చేశాననే తృప్తి కలిగాక మూడు వేల డాలర్స్‌కి గ్రేటర్ ఆరిజోనా రియాల్టీ కంపెనీ పేరుమీద చెక్ రాసి, హాథ్‌వే సంతకం చేసి ‘ఫోర్డ్ కారు కోసం’ అని దాని వెనక రాసి, దాన్ని సిమ్సన్కి పోస్ట్ చేశాడు. మర్నాడు సిమ్సన్ ఆ చెక్ తెచ్చి చూపించి చెప్పాడు. ‘‘వింత మనిషి! చెక్ పంపాడు. ఉత్తరం కానీ, ఫ్రం అడ్రస్ కానీ లేదు. ఎక్కడ ఉంటున్నాడు?’’ ‘‘నాకు తెలీదు. చెక్ వచ్చింది కాబట్టి అతనే కాంటాక్ట్ చేస్తాడు.’’ సిమ్సన్ లంచ్‌కి వెళ్ళొచ్చాక ఆయనతో వెస్ట్ చెప్పాడు. ‘‘మీరన్నట్లు అతను వింత మనిషే. ఇందాక ఫోన్ చేసి, కొన్ని వారాలు ఊరు వదిలి వెళ్తున్నానని, వచ్చాక ఫోర్డ్ని తీసుకుంటానని చెప్పాడు.’’ ‘‘డబ్బు ముట్టింది. తర్వాత అతని ఇష్టం’’ సిమ్సన్ చెప్పాడు. గ్లెండేల్‌లో మరో బేంక్‌లో హాథ్‌వే పేరున వెస్ట్ అకౌంట్‌ని తెరిచాడు. తనకి హాథ్‌వే జేబులో దొరికిన చెక్ బుక్, పాస్ బుక్‌లని ప్రూఫ్‌గా చూపించాడు. గ్లెండేల్ బ్రాంచ్‌కి ఎనభై ఐదు వేల డాలర్లు బదిలీ చేయడానికి చెక్‌ని ఇచ్చాడు. ఐతే ఆ డబ్బుని అతను ముట్టుకోలేదు. తర్వాతి రెండు వారాలు నీసా బ్రాంచ్ మీద అనేక చెక్స్ రాసి, గ్లెండేల్ బ్రాంచ్‌లో నగదు తీసుకున్నాడు. అలా ఏభై వేల డాలర్లు తీసుకున్నాక ఇక ఆపేశాడు. ఇంకా గ్లెండేల్ బ్రాంచ్‌లో ఎనభై ఐదు వేల డాలర్లు, నీసా బ్రాంచ్‌లో అరవై రెండు వేల డాలర్లు మిగిలి ఉన్నాయి.హాథ్‌వే బేంక్ చెక్ బుక్‌లని, ఇతర కాగితాలని వెస్ట్ కాల్చేశాడు. బేంక్‌లో సేఫ్ డిపాజిట్ బాక్స్‌ని తెరిచి అందులో డబ్బుంచాడు తప్ప తన అకౌంట్లో డిపాజిట్ చేయలేదు.వెస్ట్ తను అనుకున్న అన్ని నియమాలనీ ఈ నేరంలో పాటించాడు. తోడు దొంగని తీసుకోలేదు. లోభానికి పోలేదు. మాయమైన హాథ్‌వే గురించి ఎవరైనా ప్రశ్నించినా అతనితో చివరగా మాట్లాడింది తను కాదు. గ్లెండేల్ బేంక్ కేషియర్ ఆఖరివాడు అవుతాడు. మాయమైన హాథ్‌వేకి, తనకి సంబంధాన్ని పోలీసులు కనుక్కోలేరు. తనకి, గ్లెండేల్ బ్రాంచ్‌కి కూడా ఎలాంటి సంబంధం లేదు. కొన్ని వారాల తర్వాత ఓ రోజు సిమ్సన్... వెస్ట్‌ని ప్రశ్నించాడు. ‘‘హాథ్‌వే ఫోర్డ్ని తీసుకోవడం ఏమైంది?’’ ‘‘నాకు తెలీదు.’’ ‘‘అతను దొంగని నీకు తెలుసా?’’ ‘‘ఏమిటి?!?’’ ‘‘ఈస్ట్‌లో తను పనిచేేన బేంక్‌లోంచి రెండు లక్షల డాలర్లని దొంగిలించి ఇక్కడికి పారిపోయి వచ్చాడు. ఆ చెక్‌ని డిపాజిట్ చేయడానికే నన్ను బేంక్ గురించి అడిగాడు.’’‘‘మీకిదంతా ఎలా తెలుసు?’’ వెస్ట్ ఆశ్చర్యంగా అడిగాడు.‘‘ఎఫ్బీఐవాళ్లు అతని కోసం వెదుకుతూ ఇక్కడికి వచ్చారు. ఇటీవల హాథ్‌వేని చూసింది నువ్వు, నేను, గ్లెండేల్ బ్రాంచ్ కేషియర్. అతన్ని కూడా పిలిచారు. ఐతే అతని పేరు హాథ్‌వే కాదు. అది దొంగ పేరు మాత్రమే. అసలు పేరు జడ్సన్ లాంటిదేదో. కేషియర్, ఎఫ్‌బీఐ వాళ్లు నా గదిలో ఉన్నారు. మనం ముగ్గురం ఎఫ్బీఐవాళ్లు తెచ్చిన జడ్సన్ ఫొటో హాథ్వేదో, కాదో గుర్తించాలి. పద’’ అన్నాడు.తనని కేషియర్ హాథ్వేగా గుర్తిస్తాడని గ్రహించిన వెస్ట్‌కి అనిపించింది, నేరస్తుడు ఎవర్నీ నమ్మకూడదన్నది సత్యం అని. తన బాధితుడ్ని కూడా నమ్మకూడదని తను ఆలస్యంగా తెలుసుకున్నాడని. (లాటన్ ఓ కోనర్ కథకి స్వేచ్ఛానువాదం)


