breaking news
Male Artist
-
‘మగవారిని కూడా ‘బోల్డ్ యాక్టర్’ అనగలరా’
ఫ్లోరా షైనీ (ఆశా షైనీ).. ‘చాలా బాగుంది, సర్దుకుపోదాం రండి, నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ఆ ఇంట్లో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైన ఫ్లోరా షైనీ గందీ బాత్, మెయిడ్ ఇన్ ఇండియా వంటి వెబ్ సిరీస్‌ల్లో నటించారు. ఈ క్రమంలో తనను బోల్డ్ యాక్ట్రెస్ అని పిలవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు ఫ్లోరా షైనీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు, మీడియా చాలా ఎదగాలని నా అభిప్రాయం. ఎందుకంటే వారు నేను ఎంచుకునే పాత్రలను, జానర్లను పట్టించుకోకుండా కేవలం బోల్డ్ యాక్ట్రెస్‌గా మాత్రమే గుర్తిస్తున్నారు. మరి అలాంటి సన్నివేశాల్లో నాతో పాటు నటించే నటులను కూడా బోల్డ్ అనాలి. మరి మీడియాకు, జనాలకు మగ నటులను అలా పిలిచే ధైర్యం ఉందా’ అని ప్రశ్నించారు. ‘కేవలం మహిళననే సాకుతో నన్ను ఇలా పిలవగల్గుతున్నారు. లింగవివక్షకు ఇదే అసలైన నిదర్శనం. ఇలాంటి మైండ్ సెట్ మారాలి. మనం ఎదగాలి.. మన సమాజం కూడా లింగవివక్షకు తావులేకుండా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అన్నారు. అంతేకాక ‘నేను పోషించిన ప్రతి పాత్ర పట్ల చాలా గర్వంగా ఫీలవుతాను. కేవలం బోల్డ్ పాత్రలనే కాకుండా అన్ని రకాల పాత్రలు నేను చేయగలను. భవిష్యత్తులో కూడా నాలోని నటిని వెలికితీసే మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నాను’ అన్నారు. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో హర్రర్ కామెడీగా తెరకెక్కిన స్త్రీ చిత్రంలో ఫ్లోరా నటించారు. -
హిలరీ ఎటాక్!
ఎందుకో గానీ... ఉన్నట్టుండి హీరోలపై ఎటాక్ చేసింది హాలీవుడ్ భామ హిలరీ శ్వాంక్. మేల్ యాక్టర్లు ఫిమేల్ యాక్టర్ల కంటే పది రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారంటూ అక్కసు వెళ్లగక్కింది. ‘ఇద్దరం కలసి నటించినా మేల్ ఆర్టిస్ట్‌కు నా కంటే పది రెట్లు అధికంగా పే చేశారు. మగ, ఆడ... అన్నింటా సమానమని చెప్పినా ఇంకా అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. మగవారికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఫిమేల్ ఆర్టిస్టులకు ఇవ్వరు. ఇద్దరి పని ఒకటే అయినా... పేమెంట్‌లో ఈ తేడాలెందుకు’ అంటూ కడిగేసిందీ ‘బాయ్స్ డోంట్ క్రై’ నటి.