breaking news
Malala Yousuf Joy
-
ఐరాస శాంతిదూతగా మలాలా
-
ఐరాస శాంతిదూతగా మలాలా
ఆ హోదా పొందిన పిన్నవయస్కురాలు ఐక్యరాజ్యసమితి: బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్(19)కు మరో అత్యున్నత గౌరవం లభించింది. ఆమెను ఐక్యరాజ్యసమితి శాంతిదూతగా ఎంపిక చేసినట్లు యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. యూఎన్ శాంతిదూతగా నియమితురాలైన అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా నిలిచారు. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆమెకు ఈ హోదా ఇవ్వనున్నారు. ‘‘మహిళలు, యువతులు, ప్రజల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతూ మలాలా అసాధారణ నిబద్ధత కనబరుస్తున్నారు. అందుకే ఆమెను శాంతిదూతగా ఎంపిక చేశాం. బాలికల విద్యా హక్కు కోసం మలాలా ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారు. శాంతిదూతగా మలాలాను ఎంపిక చేయడం వల్ల మహిళలకు మరింత మేలు చేకూరుతుంది’’ అని గుటెరస్ అన్నారు. ఐరాస కార్య కలాపాలను ప్రచారం చేసేందుకు ప్రముఖులను శాంతిదూతగా ఎంపిక చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. -
మలాలాకు ప్రపంచ బాలల అవార్డు
స్టాక్హోమ్: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయ్ మరో ప్రతిష్టాత్మక బహుమతి దక్కించుకున్నారు. బాలల నోబెల్ బహుమతిగా పేర్కొనే ప్రపంచ బాలల అవార్డు(వరల్డ్ చిల్ట్రన్స్ ప్రైజ్)కు ఆమె ఎంపికయ్యారు. లక్షలాది మంది బాలలు ఓటింగ్లో పాల్గొని ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. బహుమతి కింది అందే మొత్తాన్ని ఆమె బాలల సంక్షేమం కోసం వినియోగించాల్సి ఉంటుంది.