breaking news
macharla MLA PINNELLI INDIAN NATIONAL Ramakrishna
-
అన్నదాతలు బాబును నమ్మే స్థితిలో లేరు
రెంటచింతల: పలుమార్లు హామీలు ఇచ్చి మోసం చేసిన సీఎం చంద్రబాబును నమ్మే పరిస్థితిలో అన్నదాతలు లేరని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్‌నగర్‌కాలనీలో రూ.24లక్షలతో నిర్మించే సిసి రోడ్డుకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాజధానికి బలవంతంగా రైతుల నుంచి భూములు తీసుకోవడానికి ప్రయత్నించడం అమానుషమన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్దత ఉందా అని ప్రశ్నించారు. సన్నకారు, పేదరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికోసం భూసేకరణకు సంబంధించి రెవెన్యూ మంత్రి కె.కృష్ణమూర్తిని పక్కనపెట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అన్నదాతలను ఆదుకొనేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టిన దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వడం వలనే రాష్ట్రప్రభుత్వం పీకలలోతు ఆర్థిక భారంతో కుంగిపోయిందన్నారు. పలనాడుకు ప్రత్యేకప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. గురజాలను జిల్లాగా ప్రకటించడంతో పాటు భారీగా నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో జడ్పిటిసి సభ్యుడు నవులూరి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ గుర్రాల రాజు, ఎంపిటిసి సభ్యుడు రోజర్ల రామారావు, పాస్టర్ ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠభరితంగా కోడిపోరు
కారంపూడి : పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోడిపోరు సోమవారం వీరులగుడి ఆవరణలో జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ తదితరులు బ్రహ్మనాయుడు పక్షాన చిట్టిమల్లు పుంజును, నాగమ్మ వేషంలో ఉన్న ఆచారవంతుడు ముక్కంటి తదితరులు నాగమ్మ పక్షాన శివంగిడేగను పందేనికి వదిలారు. వీరవిద్యావంతులు కృష్ణమూర్తి, నరసింహ, చిన్నప్ప కోడిపోరు క థాగానాన్ని ఆలపించారు. వేలాదిగా వీరాచారవంతులు, తిరునాళ్లకు వచ్చిన జనం కోడిపోరు ను వీక్షించారు. తొలుత గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వస్తున్నారనే సమాచారంతో చాలాసేపు పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ పందేలను ఆపారు. వారు రావడం ఆలస్యమవుతుందనే సమాచారంతో ఎమ్మెల్యే పీఆర్కే, ఇతర పెద్దలతో పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తయిన కొద్దిసేపటికి ఎమ్మెల్యేలు యరపతినేని, జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. వీరులగుడిలో పూజలు జరిపి మళ్లీ కోడిపోరుకు సిద్ధమయ్యారు. తిరిగి పీఠాధిపతిని, ఆచారవంతులను పిలిపించి కోడిపందేలు నిర్వహించారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పల్నాటి ఉత్సవాల్లో ఇలా రెండోసారి కోడి పోరు జరపడం ఇదే ప్రథమమని ఆచారవంతులు తెలిపారు. అరుదైన పల్నాటి వీరాచారాన్ని పరిరక్షించాలి: ఎమ్మెల్యే పీఆర్కే పల్నాటి వీరాచారం గొప్పదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఏ ఉత్సవాలకు లేనివిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న వీరాచారవంతులు పల్నాటి ఉత్సవాలకు రావడం విశేషమన్నారు. ఈ చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోడిపోరు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వపరంగా ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పల్నాటి చరిత్ర అభివృద్ధికి, ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.