breaking news
Luxury sports
-
జేఎల్ఆర్ ఇవోక్.. కొత్త వేరియంట్.
ముంబై: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ) రేంజ్ రోవర్ ఇవోక్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. భారత్‌లో అసెంబుల్ చేసిన ఈ వేరియంట్ ధరలు రూ.47.1 లక్షల నుంచి రూ.63.2 లక్షల రేంజ్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. లగ్జరీ, స్టైల్, టెక్నాలజీల కలబోతగా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించామని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి చెప్పారు. ఈ కొత్త వేరియంట్‌తో ఇవోక్ జైత్రయాత్ర కొనసాగుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. గత ఏడాది 2,700 లగ్జరీ వాహనాలు విక్రయించామని, ఈ ఏడాది ఈ సంఖ్య 3,000కు మించుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త ఇవోక్ వేరియంట్ ను 2.2 లీటర్ల నాలుగు-సిలిండర్ల టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందించామని, నాలుగు వేరియంట్లలో లభిస్తుందని తెలిపారు. ప్రత్యేకతలు..: చిన్న ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్స్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్-లిప్ స్పాయిలర్, ఎల్ఈడీ బ్రేక్ లైట్, ఇన్‌కంట్రోల్ టచ్ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 17 స్పీకర్ల 825 వాట్స్ మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హెడ్ అప్ డిస్ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి. -
ఫెరారీ నుంచి హైబ్రీడ్ సూపర్‌కారు
అబుదాబి: లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు ప్రసిద్ధి చెందిన ఫెరారీ సంస్థ తొలిసారి హైబ్రీడ్ సూపర్‌కారు ఎఫ్ఎక్స్ఎక్స్ కె కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అబుదాబిలోని యాస్ మరీనా సర్క్యూట్లో ఆదివారం ఈ కారును ఆవిష్కరించనున్నారు. తమ వార్షిక రేసింగ్ ఈవెంట్ ఫెరారీ మోండియాలి చాలెంజ్ కార్యక్రమం సందర్భంగా ఈ కారును విడుదల చేస్తారు. ఇటలీకి చెందిన ఫెరారీ 21 ఏళ్ల తర్వాత తమ వార్షిక ఈవెంట్‌ను యూరోప్ ఆవల నిర్వహించడం ఇదే ప్రథమం. తమ కొత్త కారును టెస్ట్ డ్రైవ్ చేసేందుకు ఎంపిక చేసిన అతి కొద్దిమందికి మాత్రమే ఫెరారీ కంపెనీ ఆహ్వానం పంపించింది. పరిమితంగానే తయారు చేయనున్న ఈ హైబ్రీడ్ సూపర్‌కారు ధర ఒక్కోటి 25 లక్షల యూరోలు (రూ. 19 కోట్లు) ఉంటుందని సమాచారం.