breaking news
low water level
-
చిన్నబోయిన కృష్ణమ్మ!
సాక్షి, అమరావతి: నిండా నీటితో పరుగులు తీసే కృష్ణమ్మ ఈ ఏడాది చిన్నబోయింది. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన పాయతోపాటు కృష్ణా ఉప నదులైన కోయినా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, వేదవతి, భీమాలలోనూ వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరింది. బేసిన్లో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన నికర జలాల లభ్యతలో ఈ ఏడాది సగం కూడా లభించడం లేదు. నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో నీటికి కటకట ఏర్పడింది. సాగునీటికే కాదు తాగునీటికీ ఇబ్బందులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ పర్వత శ్రేణుల్లో పురుడు పోసుకునే కృష్ణమ్మ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ మీదుగా 1,400 కి.మీ. పొడవున ప్రవహించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ చరిత్రలో రెండో కనిష్ట ప్రవాహం కృష్ణా నదిలో ఏటా సగటున 75 శాతం లభ్యత (నికర జలాల) ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసింది. అందులో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల (ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299) చొప్పున కేటాయించింది. కానీ.. ఈ ఏడాది కృష్ణా బేసిన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రధాన పాయతోపాటు ఉప నదుల్లో వరద ప్రవాహం పెద్దగా రాలేదు. దాంతో నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకుంది. మహారాష్ట్రలో కృష్ణా ప్రధాన పాయ, కోయినా, దూద్గంగ, భీమా వంటి ఉప నదుల ద్వారా ఇప్పటివరకు ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి 298 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కర్ణాటకలో కృష్ణా ప్రధాన పాయతోపాటు ఘటప్రభ, మలప్రభ, వేదవతి, తుంగభద్ర ద్వారా ప్రాజెక్టుల్లోకి 427 టీఎంసీల ప్రవాహం వచ్చింది. బేసిన్లో దిగువన గల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల్లోకి కృష్ణా ప్రధాన పాయతోపాటు మూసీ, పాలేరు, మున్నేరు వంటి ఉప నదుల ద్వారా ఇప్పటివరకు కేవలం 157 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంది. శ్రీశైలంలోకి 120 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చింది. ఇది ఆ ప్రాజెక్టు చరిత్రలో రెండో కనిష్ట ప్రవాహం కావడం గమనార్హం. 2015–16లో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన 58.69 టీఎంసీలే ఆ ప్రాజెక్టు చరిత్రలో కనిష్ట ప్రవాహం. కృష్ణా బేసిన్లో 2019–20 నుంచి 2022–23 వరకూ నాలుగేళ్లూ సమృద్ధిగా వర్షాలు కురవడంతో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికంటే అధికంగా జలాలు లభించాయి. ఈ ఏడాది నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో బేసిన్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. -
తక్కువ నీటి వినియోగ పంటలపై దృష్టి
న్యూఢిల్లీ: ఎక్కువ లాభదాయకత, తక్కువ నీటి వినియోగం వంటి సౌలభ్యతలున్న చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వైపు దృష్టిని మళ్లించేలా రైతులను ప్రోత్సహించాలని నాబార్డ్‌కు ఆరి్థకశాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు కీలక ఉపన్యాసం చేశారు. గ్రామీణ ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు స్థానికంగా సమర్ధత పెంపొందడానికి, చక్కటి ఫలితాలను అందించడానికి కృషి చేయాలని అగ్రి–ఫైనాన్స్ సంస్థకు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’’ను పురస్కరించుకుని ’శ్రీ అన్న’ ఉత్పత్తి, మార్కెటింగ్‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే తృణధాన్యాల కింద ఉన్న భూమి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే తృణ ధాన్యాలను పండిస్తున్న రైతుల ఆరి్థక ప్రయోజనాల పరిరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నేడు చింతన్ శిబిర్... కాగా, కేంద్ర బడ్జెట్, అలాగే ఫ్లాగ్íÙప్ పథకాల నుండి నిధులు సమకూర్చిన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి, ఆయా అంశాల సమీక్షకు జూన్ 17న ’చింతన్ శిబిర్’ నిర్వహించినట్లు ఆరి్థక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో తెలిపింది. -
శ్రీశైలంలో బయటపడ్డ పురాతన మండపం
శ్రీశైలం: ఆంధ్ర, తెలంగాణా ప్రజల తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశయం జలాశయంలో మునిగి ఉన్న మండపం పూర్తిస్థాయిలో బయటపడింది. ఈ మండపాన్ని క్రీ.శ. 1393-96 మధ్య కాలంలో విఠలాంబ నిర్మించినట్లు చారిత్రక అధారాలు ఉన్నాయి. ఒకప్పుడు పాతాళగంగలో భక్తులు స్నానాలాచరించడానికి వీలుగా మెట్ల మార్గాన్ని విఠలాంబా నిర్మించిందని, అలాగే పాతమెట్ల మార్గాన్ని రెడ్డిరాజులు నిర్మించారని... ఎంతో లోతైన ప్రదేశం కావడం వల్ల మార్గమధ్యంలో విశ్రమించడానికి వీలుగా ఈ మండపాలను నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. సుమారు 20 ఏళ్ల తరువాత మండపం పూర్తిస్థాయిలో బయటపడింది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 780 అడుగులకు చేరుకుంది.