breaking news
love attck
-
కృష్ణాజిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లి, ముగ్గురు కూతుళ్లపై కత్తితో దాడి..
కృష్ణా: తన ప్రేమని తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపైనా విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా మొవ్వ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్ఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. మొవ్వ అంబేద్కర్ నగర్‌కు చెందిన బల్లారపు నాగరాజ్యంకు ముగ్గురు కుమార్తెలు. భర్త నాగేశ్వరరావు 2013లో మృతి చెందాడు. 22 ఏళ్ల పెద్ద కుమార్తెను అదే కాలనీకి చెందిన నాగదేసి జోయల్ సంవత్సర కాలంగా ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఆమె తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో గురువారం రాత్రి కత్తి తీసుకుని యువతి ఇంటికి వచ్చాడు. ముందుగా ఇంటి బయట ఉన్న ఆమె చిన్న సోదరిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి చొరబడి తల్లి, మరో సోదరిపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితుల కేకలు విని ఇరుగుపొరుగు రావడంతో జోయల్ పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత కుటుంబాన్ని స్థానికులు హుటాహుటిన మొవ్వ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడు అరెస్టు పామర్రు: తనను ప్రేమించలేదనే కక్షతో యువతిని ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసిన నిందితుడు జోయల్‌ను అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచామని గుడివాడ డీఎస్పీ సత్యానంద్ పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిపై కూచిపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కూచిపూడి ఎస్ఐ కె.దుర్గాప్రసాద్ బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వారి స్టేట్మెంట్ రికార్డు చేశారని చెప్పారు. మొవ్వ జేఎఫ్‌సీఎం, కోర్టు వారి వద్ద రిమాండ్ నిమిత్తం హాజరు పరిరామన్నారు. -
ప్రేమికుడి తల్లిపై దాడి.. ఇంటికి నిప్పు
ఘంటసాల: ప్రేమించుకున్న జంట పోలీసులను ఆశ్రయించారనే ఆగ్రహంతో ప్రియురాలి తండ్రి, బంధువులు కలిసి ప్రియుడి తల్లిపై దాడిచేయడంతో పాటు, వారి ఇంటిపై పెట్రోలుపోసి తగులబెట్టారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం శివారు గొల్లపాలెంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గొల్లపాలెం దళితవాడకు చెందిన పెయింటర్ గూడపాటి నాగరాజు, అదే ప్రాంతానికి చెందిన నాయుడుపాటి దీప్తి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను వ్యతిరేకించిన దీప్తి తండ్రి అర్జునరావు ఏడాది కిందట కుటుంబ సభ్యులతో సహా విజయవాడకు మకాం మార్చారు. కుమార్తెకు వివాహ సంబంధాలు చూడటం ముమ్మరం చేయడంతో నాగరాజు, దీప్తి పెళ్లి చేసుకోవాలని భావించి శుక్రవారం రాత్రి చిట్టూర్పులోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం ఘంటసాల పోలీసులను ఆశ్రయించి తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న అర్జునరావు పది మంది అనుచరులు, బంధువులను వెంటపెట్టుకుని గొల్లపాలెం వచ్చారు. వచ్చీ రావడంతోనే నాగరాజు తల్లి సముద్రాలుపై అర్జునరావు, అతని చెల్లెలు సుధ కర్రతో దాడిచేశారు. ఈ దాడిలో సముద్రాలు చెంప నుంచి నోటిలోకి కర్ర దిగబడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. అంతటితో ఆగని అర్జునరావు, అతని అనుచరులు ఆ ప్రాంతంలో వీరంగం చేసి వెంట తీసుకువచ్చిన పెట్రోలును నాగరాజు ఇంటిపై పోసి నిప్పంటించారు. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన పరిసర ప్రాంతవాసులపై దౌర్జన్యం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సినీఫక్కీలో సుమారు గంటపాటు వీరంగం చేసిన అర్జునరావు, అతని అనుచరులు అనంతరం అక్కడి నుంచి వచ్చిన ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ప్రాణ రక్షణ కల్పించాలి... తామిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఒకే కులమైనప్పటికీ పెద్దలు అంగీకరించకుండా తమపై దాడిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రేమికులు నాగరాజు, దీప్తి పోలీసులకు చెప్పారు. తాము మేజర్లయినందున పెద్దల సమక్షంలో వివాహం జరిపించి, రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు చల్లపల్లి సీఐ దుర్గారావు, ఎస్ఐ టీవీ వెంకటేశ్వరరావు గొల్లపాలెంలోని నాగరాజు ఇంటిని పరిళీలించారు. అనంతరం అవనిగడ్డలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సముద్రాలు నుంచి వివరాలు సేకరించారు.