వార్డెన్లు స్థానికంగా ఉండాలి
మోతె: హాస్టళ్ల వార్డెన్లు స్థానికంగా ఉండాలని సూర్యాపేట ఏఎస్డబ్లూ్యఓ శంకర్‌నాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో బీసీ వెల్ఫేర్హాస్టల్ను ఆయన సందర్శించారు. హాస్టల్లో మౌలికSవసతులను పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఎందుకు ఉందని వార్డెన్ చంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్లు స్థానికంగా పిల్లలకు అందుబాటులో ఉన్నప్పుడే విద్యార్థుల సంఖ్యపెరుగుతుందన్నారు.మండలంలో ప్రతి గ్రామానికి వెళ్లి వంద మంది విద్యార్థులను హాస్టల్లో చేరేటట్లుగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట వార్డెన్, సిబ్బంది ఉన్నారు.