breaking news
Lizaad Williams
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా తదుపరి సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానాన్ని బాష్ భర్తీ చేస్తున్నాడు. 30 ఏళ్ల బాష్‌ను ముంబై ఇండియన్స్ తమ హ్యామిలీలోకి ఆహ్వానించింది. రైట్ హ్యాండ్ బ్యాట్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేసే బాష్ సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్, 2 వన్డేలు ఆడాడు. బాష్ గతేడాది డిసెంబర్లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు.బాష్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 81 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందు బాష్ అదే పాకిస్తాన్‌పైనే వన్డే అరంగేట్రం చేశాడు. బాష్ ఇప్పటివరకు 2 వన్డేలు ఆడి 2 వికెట్లు సహా 55 పరుగులు చేశాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లో బాష్ 44 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే అతనికి వన్డేల్లో అత్యధిక స్కోర్. బాష్ తన రెండో వన్డేను కూడా పాక్‌తోనే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్‌లో బాష్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆడాడు.అంతర్జాతీయ అరంగేట్రం అనంతరం బాష్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది బాష్ ఎంఐ కేప్‌టౌన్ తరఫున బరిలో నిలిచాడు. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్ తమ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.బాష్ సౌతాఫ్రికా 2014 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాడు పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బాష్ 4 వికెట్లు తీశాడు. బాష్ తన కెరీర్లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటివరకు 2500కు పైగా పరుగులు చేసి 150కిపైగా వికెట్లు తీశాడు. బాష్ టీ20ల్లో 86 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తీశాడు. బాష్ చేరికతో ముంబై ఇండియన్స్‌లో ఆల్‌రౌండర్ల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్, విల్ జాక్స్, అర్జున్ టెండూల్కర్ తదితర ఆల్‌రౌండర్లు ఉన్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్
ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొత్తగా మరో ఫాస్ట్ బౌలర్ చేరాడు. వ్యక్తిగత కారణాల చేత ప్రస్తుత సీజన్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజాడ్ విలియమ్స్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. విలియమ్స్‌ను డీసీ 50 లక్షల బేస్ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. కాగా, ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది. తాజాగా (ఏప్రిల్ 7) ముంబై చేతిలో ఓటమిపాలైంది. ఢిల్లీ దారుణ ప్రదర్శనకు ఆ జట్టు బౌలింగే ప్రధాన కారణం. ఈ జట్టులోని బౌలర్లు ప్రతి మ్యాచ్‌లో పోటాపోటీపడి పరుగులు సమర్పించుకుంటూ వరుస ఓటములకు కారకులవుతున్నారు. ముఖ్యంగా పేసర్ అన్రిచ్ నోర్జే చాలా దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. డీసీ యాజమాన్యం ఈ సఫారీ పేసర్‌పై భారీ అంచనాలు పెట్టుకుంటే, అతను మాత్రం సాధారణ బౌలర్ కంటే హీనంగా బౌలింగ్ చేస్తూ తుస్సుమనిపిస్తున్నాడు. నోర్జే ప్రతి మ్యాచ్‌లో 12కు పైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకుంటున్నాడు. డీసీ మేనేజ్మెంట్ లిజాడ్ విలియమ్స్‌ను ఎంపిక చేసుకోవడానికి నోర్జే వరుస వైఫల్యాలే కారణమని తెలుస్తుంది. నోర్జే స్థానాన్ని లిజాడ్ విలియమ్స్‌తో భర్తీ చేయాలని డీసీ భావిస్తుంది. ఈ సీజన్లో నోర్జే ప్రదర్శనలు ఇలా ఉన్నాయి.. రాజస్థాన్‌పై 4-0-48-1 సీఎస్కేపై 4-0-43-0 కేకేఆర్‌పై 4-0-59-3 ముంబై ఇండియన్స్‌పై 4-0-65-2 ఇదిలా ఉంటే, నిన్న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. 235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది.