breaking news
liquor effect
-
పచ్చని కాపురంలో మద్యం చిచ్చు
భర్త తాగుడు మానలేదని భార్య ఆత్మహత్య పుట్లూరు : ఓ పచ్చని సంసారంలో మద్యం మహమ్మారి చిచ్చుపెట్టింది. తన భర్త మద్యం తాగడం మానడం లేదన్న బెంగతో ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పుట్లూరు మండలం గొల్లపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గొల్లపల్లికి చెందిన గురుప్రసాద్, వెంకటరమణమ్మ(32)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం సజావుగా సాగుతున్న తరుణంలో రెండేళ్ల క్రితం నుంచి గురుప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. వెంకటరమణమ్మ భర్తకు ఎన్నిసార్లు చెప్పిచూసినా వినలేదు. చివరికి వారి కుటుంబంలో కలతలు రేగాయి. ఇదే విషయమై వారిద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భర్త మద్యం తాగి రావడంతో వెంకటరమణమ్మ అతడ్ని మందలించింది. ఎన్నిసార్లు చెప్పినా మద్యం సేవించడం మానలేదన్న మనస్థాపంతో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పపత్రికి తరలించినట్లు ఎస్ఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. వెంకటరమణమ్మకు గురుహేమంత్ (4), గురునిషితా (3) అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
80 రూపాయల కోసం స్నేహితుడి హత్య!
బీరు బాటిల్ కోసమో, బిర్యానీ పొట్లం కోసమో హత్యలు జరగడం చూశాం. కానీ దేశ రాజధాని ఢిల్లీలో కేవలం 80 రూపాయలు పంచుకునే విషయంలో గొడవ పడి ఓ వ్యక్తి తన స్నేహితుడిని చంపేశాడు. వినోద్ అనే వ్యక్తిని పీక పిసికి చంపేసిన కేసులో పప్పు యాదవ్ (27)ను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లిద్దరూ గత మూడు నాలుగేళ్లుగా కూలీలుగా పనిచేస్తున్నారు. వాళ్లు యమునా బజార్లో పాత ఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ నైట్ షెల్టర్‌లో ఉంటున్నారు. అక్టోబర్ 30న వాళ్లు జనక్‌పురిలో ఓ కార్యక్రమం జరిగితే అక్కడ పనిచేశారు. వాళ్ల పనితీరు నచ్చిన నిర్వాహకుడు శనివారం నాడు వాళ్లకు రూ. 100 ఇచ్చి పంచుకోమని చెప్పాడు. అందులో 20 రూపాయలతో మద్యం కొనుక్కుని అక్కడే తాగడం మొదలుపెట్టారు. మిగిలిన 8౦ రూపాయలు పంచుకోవాల్సి ఉంది. కానీ, తాగిన మత్తులో ఇద్దరూ ఆ మొత్తం కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ గొడవలో పప్పు ఓ తాడు తీసుకుని వినోద్ పీక పిసికి, అక్కడినుంచి పారిపోయాడు.