breaking news
Lions Gujarat
-
ఐపీఎల్, ట్వంటీ20 చరిత్రలోనే తొలిసారిగా..
రాజ్‌కోట్: గత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ లలో ప్రత్యర్థి గుజరాత్ లయన్స్ చేతిలో వారి గడ్డపైనే ఘోరంగా విఫలమైన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)... ఐపీఎల్-10లో ఆడిన తొలి మ్యాచ్ లోనే ట్వంటీ20 లలో ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్ లో మాత్రమే కాదు ట్వంటీ20 చరిత్రలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా కోల్ కతా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. శుక్రవారం రాత్రి ఇక్కడి ఎస్సీఏ మైదానంలో జరిగిన మ్యాచ్ లో తొలుత నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 4 వికెట్లకు 183 పరుగులు చేయగా, ఛేదనకు దిగిన కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్, కెప్టెన్ గౌతమ్ గంభీర్ లు అజేయ అర్ధ శతకాలతో చెలరేగడంతో 14.5 ఓవర్లలోనే విజయం సాధించింది. ఓ వైపు బ్యాటింగ్ ప్రమోషన్ లో ఓపెనర్ గావచ్చిన క్రిస్ లిన్ (41 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊచకోతకు కెప్టెన్ గంభీర్ (48 బంతుల్లో 76 నాటౌట్; 12 ఫోర్లు) సొగసైన ఇన్నింగ్స్ తోడవడంతో సొంత మైదానంలో లయన్స్ ఘోరంగా విఫలమైంది. క్రిస్ లిన్, గంభీర్ తమ విజృంభణతో కేకేఆర్ కు ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లిన్‌కు దక్కింది. వీరి విధ్వంసాన్ని రైనా బృందం ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. వీరి ధాటికి లయన్స్ బౌలర్లు కులకర్ణి 2.5 ఓవర్లలో 40 పరుగులు, మన్ ప్రీత్ గోని రెండు ఓవర్లలో 32 పరుగులు, డ్వేన్ స్మిత్ ఒక్క ఓవర్ వేసి 23 సమర్పించుకున్నారు. The highest total ever chased down in T20 cricket without a wicket being lost! https://t.co/Eulvx5Hexo #IPL #GLvKKR pic.twitter.com/6sHHs8qcdJ — ESPNcricinfo (@ESPNcricinfo) 7 April 2017 -
కోల్‌కతా కుమ్మేసింది
-
లయన్స్ గర్జన
► తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం ► 5 వికెట్లతో పంజాబ్ చిత్తు ► బ్రేవోకు నాలుగు వికెట్లు ► చెలరేగిన ఫించ్, దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్‌కు ఘనమైన ఆరంభం లభించింది. ముందు బౌలింగ్‌లో ఆ తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన ఆ జట్టు లీగ్‌లో విజయంతో బోణీ చేసింది. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ అయిన రైనా, ఇప్పుడు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. వోహ్రా, మురళీ విజయ్‌ల శుభారంభం తర్వాత పంజాబ్‌ను లయన్స్ బౌలర్లు కట్టడి చేశారు. ‘చాంపియన్’ బ్రేవో రెండు ఓవర్లలో రెండేసి వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బతీయగా... ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఫించ్ మెరుపులు, చివర్లో దినేశ్ కార్తీక్ దూకుడు గుజరాత్‌ను గెలిపించాయి. మొహాలి: ఐపీఎల్లో మొదటిసారి బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ జట్టు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో లయన్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మురళీ విజయ్ (34 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బ్రేవో 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం గుజరాత్ లయన్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్ (47 బంతుల్లో 74; 12 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. ఆకట్టుకున్న ఓపెనర్లు.. ఓపెనర్లు విజయ్, వోహ్రా దూకుడుగా ఆడి కింగ్స్ ఎలెవన్‌కు శుభారంభం అందించారు. ఫాల్క్‌నర్ వేసిన ఓవర్లో వోహ్రా మూడు ఫోర్లు బాదడంతో జోరు పెరిగింది. అదే ఓవర్లో బ్రేవో క్యాచ్ వదిలేయడంతో వోహ్రా బతికిపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు విజయ్, వోహ్రా 50 బంతుల్లో 78 పరుగులు జోడించిన అనంతరం జడేజా ఈ జోడీని విడదీశాడు. వోహ్రా, కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే విజయ్ను కూడా జడేజా బౌల్డ్ చేశాడు. ఈ రెండు వికెట్ల తర్వాత లయన్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. బ్రేవో తన రెండో ఓవర్లో చెలరేగి రెండు కీలక వికెట్లు తీశాడు. అతని స్లో బంతులకు మ్యాక్స్‌వెల్ (2), మిల్లర్ (15; 1 ఫోర్, 1 సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ దశలో స్టొయినిస్ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు), సాహా (25 బంతుల్లో 20) పంజాబ్‌ను ఆదుకున్నారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు ఐదో వికెట్‌కు 45 బంతుల్లో 55 పరుగులు జత చేశారు. చివరి ఓవర్లో బ్రేవో మళ్లీ సత్తా చాటి సాహా, స్టొయినిస్‌లను పెవిలియన్ పంపించాడు. కీలక భాగస్వామ్యాలు... తొలి ఓవర్లోనే గుజరాత్‌కు షాక్ తగిలింది. సందీప్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన మెకల్లమ్ (0) స్టంపౌటయ్యాడు. అయితే ఫించ్ దూకుడుగా ఆడగా, ఉన్న కొద్దిసేపు రైనా (9 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించడంతో జట్టు ఇన్నింగ్స్‌లో వేగం తగ్గలేదు. వీరిద్దరు రెండో వికెట్‌కు 27 బంతుల్లోనే 51 పరుగులు జోడించడం విశేషం. రైనా వెనుదిరిగినా... మరో ఎండ్‌లో ఫించ్ 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి దినేశ్ కార్తీక్ అండగా నిలిచాడు. ఫించ్, కార్తీక్ 38 బంతుల్లోనే 65 పరుగులు జత చేశారు. ఈ దశలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఫించ్ స్టంపౌట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత జడేజా (8) రనౌట్‌తో పాటు, కిషన్ (11) వెనుదిరగడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరో 14 బంతులు మిగిలి ఉండగానే కార్తీక్ మ్యాచ్‌ను ముగించాడు. ►1 బ్రెండన్ మెకల్లమ్ 42 ఇన్నింగ్స్‌ల తర్వాత ఐపీఎల్లో మరోసారి డకౌట్ అయ్యాడు. తొలి నాలుగు సీజన్లలో మెకల్లమ్ 35 ఇన్నింగ్స్‌లో నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు ► 4/22 ఐపీఎల్లో డ్వేన్ బ్రేవో తన వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ► 300 టి20 క్రికెట్లో డ్వేన్ బ్రేవో 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 299 వికెట్లతో మలింగ రెండో స్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (బి) జడేజా 42; వోహ్రా (సి) కార్తీక్ (బి) జడేజా 38; మిల్లర్ (బి) బ్రేవో 15; మ్యాక్స్‌వెల్ (బి) బ్రేవో 2; సాహా (సి) జడేజా (బి) బ్రేవో 20; స్టొయినిస్ (సి) ఫించ్ (బి) బ్రేవో 33; అక్షర్ పటేల్ (నాటౌట్) 4; జాన్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-78; 2-91; 3-101; 4-102; 5-157; 6-157. బౌలింగ్: ప్రవీణ్ 4-0-25-0; సాంగ్వాన్ 2-0-21-0; ఫాల్క్‌నర్ 4-0-39-0; లడ్డా 2-0-21-0; జడేజా 4-0-30-2; బ్రేవో 4-0-22-4. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (స్టంప్డ్) సాహా (బి) సాహూ 74; మెకల్లమ్ (స్టంప్డ్) సాహా (బి) సం దీప్ 0; రైనా (సి) జాన్సన్ (బి) స్టొయినిస్ 20; కార్తీక్ (నాటౌట్) 41; జడేజా (రనౌట్) 8; ఇషాన్ కిషన్ (సి) శర్మ (బి) జాన్సన్ 11; బ్రేవో (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1-1; 2-52; 3-117; 4-133; 5-151. బౌలింగ్: సందీప్ 3-0-21-1; జాన్సన్ 4-0-35-1; మోహిత్ 2.4-0-24-0; స్టొయినిస్ 2-0-27-1; అక్షర్ పటేల్ 2-0-17-0; సాహూ 4-0-35-1.