breaking news
Liberation Organization
-
విమోచన దినంపై కాంగ్రెస్ వైఖరేంటి?: బండి సంజయ్
రసూల్‌పురా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జై తెలంగాణ అని నినదించి ఇపుడు ఎందుకని విమోచన దినోత్సవం జరపడం లేదో సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిజాం నవాబు, రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన అమరవీరుల విశేషాలను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు కేంద్ర సాంస్కృతిక, హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తు న్నామని తెలిపారు.ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రతీ ఒక్కరు చూడాలని భావిత రాలకు నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆకృత్యాల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు, అవమానాలు పడ్డారో, ఏయే ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయో ఫొటో ఎగ్జిబిషన్ తెలియజేస్తుందని చెప్పారు. గతంలో ఉన్న రజాకార్ల దళం నేడు ఎంఐఎం పార్టీగా మారిందని అలాంటి దళాన్ని నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొగుడుతున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ సమైక్యదినం అంటే కాంగ్రెస్ వాళ్లు ప్రజాపాలన అంటున్నారని ప్రజావంచన దినోత్సవం అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పాఠ్యాంశాల్లో తెలంగాణచరిత్ర చేర్చాలన్న ఆలోచన త్వరలో ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్. చింతల రామచంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీఎల్.శ్రీనివాస్ నగర నాయకులు పాల్గొన్నారు. -
ఆ నేడు సెప్టెంబర్ 13, 1993
కదిలింది శాంతిరథం... ఇజ్రాయెల్ ప్రధాని రాబిన్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ యాసర్ అరాఫత్‌లు వైట్‌హౌజ్‌లోని సౌత్‌లాన్‌లో జరిగిన కార్యక్రమంలో పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అంతకుముందు పాలస్తీనాకు పరిమితమైన స్వయంప్రతిపత్తికి మార్గం సుగమం చేసే ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగాయి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బిల్‌క్లింటన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘ఇప్పటి వరకు జరిగిన రక్తపాతం, కాలువలు కట్టిన కన్నీళ్లకు అడ్డుకట్టవేద్దాం’’ అన్నారు రాబిన్ ఆ సమావేశంలో. ‘‘ఈ ప్రక్రియ మా జీవితాల్లో అత్యంత కీలకమైనది’’ అన్నారు అరాఫత్. ‘‘భవిష్యత్ శాంతి చర్చలకు ఇదో పునాదిరాయిలాంటిది’’ అన్నారు రాజకీయ విశ్లేషకులు.అయిదు ఇరు వర్గాలలోని అతివాదులకు మాత్రం ఈ శాంతిప్రక్రియ బొత్తిగా నచ్చలేదు. ఈ శాంతికరచాలనం ఆ తరువాత కాలంలో ఏ మేరకు సత్ఫలితాలను ఇచ్చింది అనేది వేరే విషయంగానీ...పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రెండు వర్గాల ప్రతినిధులు ఆత్మీయంగా మాట్లాడుకోవడం, శాంతివచనాలు వల్లించడం...ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సమావేశం ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయింది.