ఎన్డీ దళ నేత గణేష్ అరెస్ట్?
ఇల్లెందు : న్యూ డెమోక్రసీ(ఎన్డీ) అజ్ఞాత దళ నేత గణేష్ అలియాస్ కొమురం వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టు చేశారా? విశ్వసనీయ వర్గాలు ‘ఔను’ అని చెబుతున్నాయి. ఆ వర్గాలు తెలిపిన ప్రకారం..
చిరకాలంగా అజ్ఞాత జీవితం గడుపుతున్న గణేష్.. పోలీసులకు లొంగిపోయి, సాధారణ జీవితం గడపాలనుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వంతో చెప్పారు. అక్కడి నుంచి అనుమతి పొందారు. గత నెల 25న లొంగిపోవాలనుకున్నారు. అనివార్య కారణాలతో అది వాయిదా పడింది. కాచనపల్లి సమీపంలో గణేష్ తండ్రి పోడు వ్యవసాయం చేస్తున్నారు. గణేష్ కొన్నాళ్లుగా తన భార్య, పిల్లలతో కలిసి కాచనపల్లి సమీపంలోని లక్ష్మీదేవిపల్లి వద్ద ఉంటున్నారు. మూడు నెలలుగా పార్టీకి, దళానికి గణేష్ దూరంగా ఉన్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు.. పక్కా సమాచారంతో బాటన్న నగర్ వద్ద అరెస్ట్ చేశారు. గణేష్ అరెస్టును పోలీసులు నేడో రేపో ప్రకటించే అవకాశముంది.