breaking news
lap tap thiefs
-
గోదావరిఖని చర్చిలో తొలి చోరీ మొదలుపెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్ సిటీ) : 45 దొంగతనాలు.. 11 పోలీస్ స్టేషన్లు.. 11 నాన్‌బెయిలబుల్ వారెంట్లు.. పదిసార్లు జైలు శిక్ష.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌ను అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశాలతో కూడిన ఎన్బిడబ్ల్యూ వారెంట్.. ఎన్నిసార్లు జైలుకెళ్లినా, ఎన్నిసార్లు పోలీసులకు పట్టుబడ్డా తీరుమార్చుకోకుండా జల్సాలకు అలవాటుపడ్డాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ల్యాప్‌టాప్ దొంగగా పేర్గాంచిన దొంగను గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు ఇన్స్పెక్టర్ పూర్ణచందర్రావు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ముత్తు, ఎస్ఐ డీ శ్రీను నిందితుడి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ పాఠశాల వెనుకాల నివసించే నిట్టూరి స్నేహిత్‌రాజ్ అలియాస్ అభినవ్‌రాజు అలియాస్ అభిరామ్(28) నల్లకుంట సమీపంలోని తిలక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. 2004లో గోదావరిఖనిలో చర్చిలో మైక్‌లు దొంగతనానికి పాల్పడి అప్పటి నుంచి వరుసగా దొంగతనాలు చేస్తూ పలుమార్లు పట్టుబడి జైలుకు వెళ్లాడు. బ్యాచిలర్స్ రూమ్స్ టార్గెట్‌గా చేసుకొని ల్యాప్‌టాప్‌లు దొంగిలించడంలో సిద్దహస్తుడయ్యాడు. ల్యాప్‌టాప్ రిపేర్ వర్కర్ కావడంతో ఆయా ల్యాప్‌టాప్‌లను దొంగిలించి ఏ మాత్రం అనుమానం రాకుండా మార్చి ఓఎల్ఎక్స్లో పెట్టి విక్రయించేవాడు. గోదావరిఖని, భూపాలపల్లి, హుజూరాబాద్, మంచిర్యాల, గచ్చిబౌళి, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మీర్‌పేట, మాదాపూర్, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేస్తూ పలుమార్లు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 9 ల్యాప్‌టాప్‌లు, ఒక టూ వీలర్, మొబైల్‌ఫోన్‌ను కూడా రికవరీ చేశారు. -
ల్యాప్‌టాప్ దొంగల ముఠా ఆటకట్టు
హైదరాబాద్ సిటీ: చూడటానికి ఎగ్జిక్యూటీవ్‌లా ఉంటారు... తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ ధరించి పేపర్ వేసుకుంటారా అంటూ పొద్దు పొద్దునే ఇళ్లలోకి చొరబడుతారు. ఆదమరిచి నిద్రిస్తుంటే అదును చూసి ఇంట్లో ఉన్న ల్యాప్‌టాప్‌లు, నగదును దోచుకెళ్తారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఉప్పల్‌లో అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. తమిళనాడుకు చెందిన గురుమూర్తి గోపాల్(20), తిప్పా కలియప్ప(25), పెరిమాళ్ గణేష్(25), నంజప్పన్ వీరేంద్రన్(25)లతో పాటు మరో ఆరుగురు ముఠాగా ఏర్పడి మీర్‌పేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. వీరు ఇద్దరు ఇద్దరుగా విడిపోయి ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో ఓ దిన పత్రిక చేతపట్టుకుని పేపర్ సర్య్కూలేషన్ చేసే ఎగ్జిక్యూటివ్‌లా సంచరిస్తుంటారు. అదును చూసి ఇంట్లో ఉన్న ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, నగదును తీసుకొని పారిపోతారు. ఇలా నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య తమ పనిని చక్కపెట్టుకొని వెళ్లిపోతారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో గత కొన్ని రోజులుగా ల్యాప్‌టాప్‌లు పోతున్నాయని ఫిర్యాదులు అందడంతో నిఘా పెట్టిన క్రైం పోలీసులు, ఫిర్యాదుదారులు చెప్పిన ఆనవాళ్లతో అనుమానం వచ్చిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. వీరి వద్ద నుంచి 13 ల్యాప్‌టాప్‌లు, రూ.2లక్షల నగదును స్వాధీనం చేసుకొని సోమవారం రిమాండ్‌కు తరలించారు.