సింహాన్ని సింగిల్‌గా కుమ్మేసింది..
‘సింహం.. సింగిల్‌గా వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి’ అన్నది సినిమా డైలాగ్. కానీ.. సింహం సింగిల్‌గా వస్తే ఏం జరుగుతుందో ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది! మృగరాజు, గేదె ల ఈ భీకర పోరాటం ఇటీవల జాంబియాలోని దక్షిణ లాంగ్వా జాతీయ పార్కులో చోటుచేసుకుంది. బాగా ఆకలితో ఉన్న సింహం అడవి గేదెల మందపై కన్నేసింది. ఒంటరిగా మిగిలిన గేదెపైకి దూకింది. అయితే, పారిపోవడానికి బదులుగా ఎదురుతిరిగిన గేదె సింహంతో తలపడింది. సింహం పంజా దెబ్బలతో విరుచుకుపడగా.. గేదె దాన్ని కొమ్ములతో పెకైత్తి కుమ్మేసింది. వీటి పోరాటం దాదాపు గంటసేపు సాగింది. రెండూ తీవ్రంగా గాయపడ్డాయి. చివరికి బతుకుజీవుడా అంటూ పొదల్లోకి పారిపోయినా.. రెండు రోజుల తర్వాత సింహం చనిపోయింది. పార్కులో సఫారీ గైడ్‌గా పనిచేసే ఆర్మ్‌స్ట్రాంగ్-ఫోర్డ్ అనే వ్యక్తి ఈ పోరు దృశ్యాలను తన కెమెరాలో బంధించారు.