breaking news
Labour Room
-
లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియో
మహిళ జీవితంలో బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మ ఎత్తినంత పనే. ఈ సమయంలో గర్భిణీకి అటు అత్తింటివారు, ఇటు పుట్టింటి వారు చాలా అండగా ఉంటారు. ప్రసవం పూర్తయి, తల్లీ బిడ్డ క్షేమంగా ఉండే దాకా చాలా ఆందోళన పడతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రసూతి వార్డులో జరిగిన ఒక సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. పురుటి నొప్పులతో బాధపడుతున్నకోడల్ని ఓదార్చి, ధైర్యం చెప్పాల్సిన అత్తగారు దారుణంగా ప్రవర్తించింది. దీనిపై గైనకాలజిస్ట్ షేర్ చేసిన వీడియో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది .ఈ సంఘటన ప్రయాగ్‌రాజ్‌లోని ఒక ఆసుపత్రిలో జరిగింది.వారణాసి నుండి ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రికి మహిళ ప్రసవం కోసం వచ్చింది. సహజం ప్రసవంకావాలని పట్టుబడుతూ కోడలిపై అరవడం మొదలు పెట్టింది. "నోరు మూసుకో, లేకపోతే మూతి పగలగొడతా అంటూ బెదిరించింది. ఇదంతా జరుగుతున్నపుడు, బాధిత మహిళ భర్త, ఇతర కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. కొంత వాగ్వాదం, కోడలి పరిస్థితి చూసిన తరువాత వారు సిజేరియన్‌కు అనుకూలంగా ఉన్నారు. కానీ అత్తగారు మాత్రం సహజ ప్రసవానికి పట్టుబడుతుండటం ఈ వీడియోలో చూడవచ్చు. "ఇలా ఏడుస్తూ ఉంటే తల్లి ఎలా అవుతావు?" అంటూ మండిపడింది. తన అంతేకాదు భార్య చేయి పట్టుకున్న కొడుకుని వారించింది. ఇతర కుటుంబ సభ్యులు ఆమెను శాంతింప జేయడానికి ప్రయత్నించినా ఆమె ధోరణికి అడ్డుకట్ట పడలేదు. మొత్తానికి ఆపరేషన్ లేకుండానే, సహజంగానే పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ సమయంలో ఆమెతో ప్రేమగా ఉండాలిఈ సంఘటనపై స్పందిస్తూ, గైనకాలజిస్ట్ డాక్టర్ నాజ్ ఫాతిమా, ఆమె మొదట ఏదో తమాషా చేస్తోందిలే అనుకున్నా.. కానీ ఇలాంటి పరిస్థితులలో, కుటుంబం గర్భిణీ స్త్రీని ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవాలి. అనునయంతో, ఓదారుస్తూ మాట్లాడాలి కదా అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ummul Khair Fatma (@drnaazfatima)నెటిజన్లు స్పందనపెద్దవాళ్లు తోడుగా ఉండాలి గానీ ఇలా ప్రవర్తించకూడదు, ఇంత మొరటుగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ పరిస్థితిలో ఆమెకు ధైర్యం చెప్పాలి అని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పగవాళ్లకి కూడా ఇలాంటి అత్తగారు ఇలా ఉండాలని కోరుకోను, ఈ సమయంలో కూడా కొడుకు తన భార్య చేతులు పట్టు కోవడం ఆమె భరించలేకపోతోంది అని మరొకరు వ్యాఖ్యానించారు. అయ్యో.. ఆమె అలా అరుస్తోంటే, భర్త ఏంటి ఏమీ మాట్లాడడు, భార్య కోసం స్టాండ్ తీసుకోవాలి కదా అంటూ మరొకరు మండిపడ్డారు. ఇదీ చదవండి: లోయర్ బెర్త్.. సీనియర్ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్ వీడియో -
ఎక్కడున్నావు కన్నా!
పురోగతి లేని దర్యాప్తు రెండు రోజులైనా తెలియని శిశువు ఆచూకీ ఆస్పత్రి వదిలి వెళ్లేది లేద ంటున్న తల్లిదండ్రులు సిబ్బంది పాత్ర, వార్డులో చనిపోయిన శిశువుల తల్లుల వివరాలపై ఆరా తూతూ మంత్రంగా అంతర్గత విచారణ విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్ : కేజీహెచ్ ప్రసూతి వార్డులో బుధవారం తెల్లవారుజామున కనిపించకుండా పోయిన మగ శిశువు ఆచూకీ శుక్రవారం రాత్రి వరకూ లభించలేదు. ఈ సంఘటనలో బంధువుల పాత్రపై పోలీసులు చేపట్టిన దర్యాప్తు రెండు రోజులు కావస్తున్నా ఎలాంటి పురోగతీ కనిపించలేదు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు. సంఘటన జరిగిన సమయంలో లేబర్ రూమ్, మ్యాటీ-2 వార్డులను ఆనుకొని ఉన్న గేట్‌కు తాళం వేయకపోవడం వల్లే శిశువు అపహరణ జరిగిందని శిశువు తల్లి, బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యం, శిశువు అపహరణ తర్వాత గేటుకు తాళం వేయడాన్ని బట్టి ఆరోజు విధుల్లో ఉన్న ఎఫ్ఎన్ఓ, ఫిమేల్ స్వీపర్ల పాత్రపై పోలీసులు దృష్టిసారించారు. వార్డులో ఇద్దరు మగ బిడ్డలు చనిపోయిన విషయాన్ని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూడడంతో ఆ శిశువులు చనిపోయిన తల్లుల వివరాలనూ పోలీసులు సేకరిస్తున్నారు. అయితే వారి చిరునామా వివరాలు ఆస్పత్రి రికార్డుల్లో నమోదు కాకపోవడంపై అనుమానాలు తలె త్తుతున్నాయి. ఇదిలాఉండగా విచారణ పేరుతో పోలీసులు రాత్రి వేళల్లో లేబర్ రూమ్‌కు వచ్చి అక్కడ విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని బెదిరిస్తున్నారని, ఇలాగైతే ఆందోళన చేస్తామని లేబర్ రూమ్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. మరోవైపు, శిశువును పోగొట్టుకున్న తల్లిదండ్రులు బిడ్డ ఆచూకీ లభించే వరకూ ఆస్పత్రి నుంచి వెళ్లేది లేదని తెగేసి చెబుతుండడంతో ఈ కేసు మరింత జఠిలంగా మారింది. తూతూ మంత్రంగా అంతర్గత విచారణ మగ శిశువు మాయంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. ఈ సంఘటనపై లోతుగా విచారించి నివేదిక సమర్పించేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బి.ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో మెడిసిన్ ప్రొఫెసర్ కె.కృష్ణమూర్తి, సీఎస్ ఆర్ఎంఓ శాస్త్రిలను నియమించారు. వీరు విచారణ ప్రారంభించి 24 గడిచినా ఎలాంటి పురోగతీ లేదు. సిబ్బంది తీరును తప్పుబట్టలేక, బాధితులకు న్యాయం చేయలేక ఈ కమిటీ సంకట స్థితిలో పడింది. ప్రసూతి వార్డుల్లో బిడ్డ భద్రత కేవలం సిబ్బందికే కాకుండా తల్లి, కుటుంబ సభ్యులకు కూడా ఉందని కమిటీ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.


