breaking news
Krushna Abhishek
-
14 సార్లు ప్రయత్నించా.. కానీ స్టార్ హీరో వల్లే తల్లినయ్యా: బుల్లితెర నటి
కాశ్మీర షా బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె హిందీతో పాటు తెలుగు, తమిళ్, భోజపురి మరాఠీ సినిమాల్లో నటించింది. ఆమె బిగ్ బాస్ 1, నాచ్ బలియే 3, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 4 షోస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే 2003లో బ్రాడ్ లిట్టర్మాన్ను పెళ్లాడిన భామ నాలుగేళ్లకే విడిపోయింది. ఆ తర్వాత 2013లో ప్రముఖ నటుడు, టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది. బాలీవుడ్లో కశ్మీరా షా, కృష్ణ అభిషేక్ జంట మంచి గుర్తింపు తెచ్చుకుంది. కపిల్ శర్మ షోలో ఈ జంట చాలా సార్లు సందడి చేసిన సంగతి తెలిసందే. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) అయితే పెళ్లయ్యాక పిల్లల కోసం చాలా సార్లు ప్రయత్నించారు ఈ జంట. గర్భం దాల్చడానికి ఏకంగా 14 సార్లు ప్రయత్నినా వారి ప్రయత్నాలు ఫలించలేదట. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేదట. కానీ ఓ స్టార్ హీరో సలహాతోనే తాము తల్లిదండ్రులైనట్లు తెలిపింది. పిల్లల కోసం ఈ జంట పడిన కష్టాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది బాలీవుడ్ భామ. అయితే ఈ జంటకు ఇంతలోనే సల్మాన్ ఖాన్ మంచి సలహా ఇచ్చాడట. అదే వారి జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. కశ్మీరా షా సరోగసీ ద్వారా బిడ్డను ప్లాన్ చేయమని సూచించాడు సల్మాన్ ఖాన్. అతని సలహాతోనే దాదాపు పెళ్లయిన నాలుగేళ్లకు కాశ్మీరా, కృష్ణ సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అయితే కశ్మీరా గ్లామర్ కోసమే సరోగసీని ఎంచుకుందని కొందరు ట్రోల్స్ కూడా చేశారు. అయితే అలాంటిదేమీ లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టి కశ్మీరా షా కొట్టిపారేసింది. ఏదైమైనా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సలహాతో కృష్ణ, కాశ్మీర షా ఇంట్లో సందడి నెలకొంది. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే! ) View this post on Instagram A post shared by Kashmera Shah (@kashmera1) -
నటికి క్షమాపణ చెప్పిన కమెడియన్
బాలీవుడ్ నటి తనిష్టా ఛటర్జీకి కమెడియన్ కృష్ణా అభిషేక్ క్షమాపణ చెప్పాడు. ‘కామెడీ నైట్స్ బచావో’ షోలో తన ఒంటిరంగును హేళన చేస్తూ జోకులు వేశారని తనిష్టా ఛటర్జీ ఆరోపించిన నేపథ్యంలో అభిషేక్ స్పందించాడు. ‘మా కార్యక్రమంలో ఏదైనా తప్పు జరిగిందని తనిష్టా ఛటర్జీ భావిస్తే మావైపు నుంచి ఆమెకు నేను క్షమాపణ చెబుతున్నాను. ఎవరినీ నొప్పించాలని, అవమానించాలని మేము అనుకోవడం లేదు. కామెడీ నైట్స్ బచావో షో రోస్ట్ ఫార్మాట్ లో సాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన హాస్యం అందించాలన్నదే మా ఉద్దేశమ’ని అభిషేక్ అన్నాడు. తమ కార్యక్రమాన్ని చూసినవారంతా ఎంతో మెచ్చుకుంటున్నారని చెప్పాడు. షారూఖ్ ఖాన్, వరుణ ధావన్ లాంటి హీరోలు తమ సినిమాల ప్రచారం కోసం ఈ షోకు వచ్చారని గుర్తు చేశాడు. ’తనిష్టా ఛటర్జీకి ఎందుకు బాధ కలిగిందో నాకు తెలియదు. ఎందుకంటే ఆమె వెళ్లిపోయిన తర్వాత నేను వచ్చాను. ఆమెను బాధ పెట్టివుంటే క్షమించమని అడుగుతున్నాను. ఇదంతా కావాలని చేసింది కాద’ని అభిషేక్ పేర్కొన్నాడు.