breaking news
Krishna Raj
-
మోదీ అధ్యక్షతన భేటీ.. కేంద్రమంత్రికి అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కృష్ణరాజ్ అనూహ్యంగా అస్వస్థతకు గురయ్యారు. బీజేపీ పార్లమెంటరీ భేటీ జరుగుతుండగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రికి తరలించారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని గ్రంథాలయ భవనంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి కృష్ణరాజ్ కూడా హాజరయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై చర్చిస్తున్నారు. అదే సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. గత మూడు రోజులుగా జ్వరం రావడంతోపాటు ఆమెకు షుగర్ వ్యాధి కూడా ఉన్నందున ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యులు చెప్పారు. -
మోదీ టీమ్‌లోకి మరో ఇద్దరు మహిళలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో మరో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా ఎంపీలు కృష్ణరాజ్, అనుప్రియా పటేల్‌కు మంత్రి పదవులు దక్కాయి. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. కృష్ణరాజ్ బీజేపీ ఎంపీ కాగా, అనుప్రియా పటేల్ ఎన్డీయే మిత్రపక్షం ఆప్నా దళ్ ఎంపీ.