breaking news
Krishna Boat Tragedy
-
బోటు ప్రమాదం: జీవో అమలు చేసి ఉంటే
సాక్షి, అమరావతి : పడవ ప్రమాదాలు ఎన్ని జరిగినా, ఎందరి ప్రాణాలు నీటిలో కలిసినా గత సర్కారు కనీస జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద 2017 నవంబరులో కృష్ణా నదిలో బోటు బోల్తా పడిన సంఘటనలో 26 మంది మృత్యువాత పడ్డారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందునే ఈ ప్రమాదం జరిగిందని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. బోటు ఆపరేటింగ్ నిబంధనలను మార్చుతూ 2018 జూన్ 8న జీవోఎంఎస్ నంబరు 14 జారీ చేసింది. బోటు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలో సూచించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సులు, జీఓ అమలుపై గత ఏడాది ఆగస్టు 9వ తేదీన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమీక్షించారు. పలు ఫెర్రీల్లో స్థానికులు ఏమాత్రం సురక్షితం కాని బోట్లు నడుపుతున్నారని గుర్తించారు. లైఫ్ జాకెట్లు లాంటి రక్షణ సామగ్రి లేదని అభిప్రాయపడ్డారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదం ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడం కోసం బోట్లు నడిపే వారికి తగిన శిక్షణ, ఒకవేళ ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో తెలియజేసేలా ప్రయాణికులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఏమి చేయవచ్చో, ఏమి చేయరాదనే అంశాలపై అవగాహన కోసం ఫెర్రీ పాయింట్లలో బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా తీర్మానించారు. బోట్లలో ప్రయాణికుల సంఖ్యకు సరిపడా లైఫ్ జాకెట్లు కచ్చితంగా సిద్ధంగా ఉంచాలని, ఫెర్రీల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి : భద్రతా నియమాలకు అనుగుణంగా ఉన్న బోట్లను మాత్రమే అదీ రిజిస్ట్రేషన్ ఉన్న వాటినే అనుమతించాలని 2018 జూన్ 8న ఇచ్చిన జీవోలో స్పష్టంగా ఉంది. గోదావరి, కృష్ణా నదుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో భద్రత చర్యల నిమిత్తం బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, నిఘా, పటిష్ట రక్షణ చర్యల అమలు బాధ్యతను ఒకే నోడల్ ఏజెన్సీకి అప్పగించాలని కూడా జీవోలో ఉంది. అయితే గత ప్రభుత్వం వేటినీ పాటించలేదు. జీవో జారీ చేసి గాలికొదిలేసిందని మాత్రం స్పష్టమైంది. -
బోటు ప్రమాదం.. ప్రభుత్వ వైఫల్యంపై చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్ : ఘోర ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోతే... చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడంలేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్థసారథి మీడియా మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచంలోని అత్యంత అవినీతి ప్రపంచమన్న ఆయన.. మంత్రులతో సహా ప్రతీ నేత కూడా దోచుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. నీరు-చెట్టు కింద సుమారు 100 కాంట్రాక్టులను కావాల్సిన వారికే కట్టబెట్టుకున్నారని.. ఇసుక నుంచి మట్టి వరకు అంతా దోచుకుంటున్నారన్నారు. పవిత్ర సంగమాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేస్తున్నారని.. మరి టూరిస్ట్ స్పాట్ గా ప్రకటన చేసుకుంటున్న చంద్రబాబు.. ప్రజల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని పార్థసారథి ప్రశ్నించారు. గతంలో హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మౌలిక సదుపాయాలను కల్పించటంలో విఫలమవుతూ ప్రజల ప్రాణాలు పోయేందుకు బాధ్యుడవుతున్నారన్నారు. అనుమతులు లేని బోట్లు తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఘటన తర్వాత లైఫ్ జాకెట్లు, సాయం చేసేందుకు వచ్చిన వారిపై దాడికి యత్నించారని ఆయన అన్నారు. మృతుల బంధువులు రాకుండానే పోస్టు మార్టం పూర్తి చేయటం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బోటు ప్రమాద ఘటనను పక్కదారి పట్టించేందుకే యజమాని, డ్రైవర్ పై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారని.. మరి ప్రభుత్వం తరపున వైఫల్యంపై విచారణకు ఆదేశించారా? అని అడిగారు. అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవటం కాదని... వెంటనే ఇరిగేషన్ మంత్రి, మంత్రి అనుచరులు, టూరిజంశాఖ అధికారులపై కూడా దర్యాప్తు చేయించాలని.. సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ముడుపులు దండుకోవటం కోసమే పోలవరం ప్రాజెక్ట్ హైపవర్ కమిటీని రద్దు చేశారని తెలిపారు. బోటు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని పార్థసారథి డిమాండ్ చేశారు. -
ఒంగోలులో మాటలకందని విషాదం